నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రను పెళ్లి చేసుకుని నీకు అన్యాయం చేశాను అని విరాట్ అంటాడు. చంద్ర పోయాక రేపు ఇదే మాట మీద ఉండు బావ శ్రుతి అంటే నువ్వు చెప్పే ఆ రేపటికి రూపం లేదని చంద్రకళ అంటుంది. శ్యామల అందరిని పిలుస్తుంది. ఇతరులకోసం ఫైట్స్ చేసి పోరాటాలు చేయడం ఇక ఆపండి. రేపు దసరా పండుగ. గుర్తు చేద్దామని పిలిపించాను అని శ్యామల అంటుంది.
గుర్తుంది. పూజ చేయించాలని కూడా అనుకున్నా అని చంద్రకళ అంటుంది. కానీ, పూజ చేయాల్సింది మీరు కాదు. మా అన్నయ్య, మా వదిన అని శ్యామల చెబుతుంది. దాంతో అంతా సంతోషిస్తారు. ఆయన చేతుల మీదుగా పూజ చేస్తే అమ్మవారు కరుణిస్తుందేమో అని జగదీశ్వరి అంటుంది. దానికి అంతా సపోర్టింగ్‌గా మాట్లాడుతారు. రేపు ఎలాంటి ఆటంకం లేకుండా పూజ సజావుగా జరగాలి. ఎవరి వల్ల అయిన జరిగితే నేను ఊరుకోను అని శ్యామల అంటుంది.
ఏ లోటు రానివ్వం అని చంద్రకళ అంటుంది. చంద్రకళ గురించి శ్యామల, కామాక్షి మాట్లాడుకుంటారు. ఆ మాటలు విన్న క్రాంతి ఇద్దరిని అంటాడు. తన గురించి నీకే తెలియదు. అన్నయ్య మాములు మనిషి అయ్యుంటే ఎప్పుడో చంద్రను పంపించేవాడని శ్యామల అంటుంది. నాన్న కోలుకోవాలని అందరికంటే ఎక్కువ కోరుకునేది వదినే అని క్రాంతి అంటాడు.
రేపు ఏదైనా అవాంతరం ఎదురుకావాలి అప్పుడు చెబుతాను అని శ్యామల అంటుంది. కచ్చితంగా ఎదురవుతుంది. అది నేనే చేస్తాను అని శాలిని అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం చంద్రకళకు హ్యాపీ దసరా అని చెబుతుంది శాలిని. పూజకు కావాల్సినవి విరాట్, క్రాంతి తీసుకొస్తారు. చిన్నప్పుడు దసరా సంబురాలను గుర్తు చేసుకుంటారు.
పూజకు ఏర్పాట్లు చేస్తుంటారు క్రాంతి, విరాట్, చంద్రకళ, శాలిని. మరోవైపు నా బంగారు బాతు ఏం చేస్తుందో ఫోన్ చేసి కాకపడుదాం అనుకుంటాడు చేపల రాజ్. శ్రుతికి కాల్ చేస్తాడు. నా ఫోన్ నెంబర్, పేరు ఎలా తెలిసింది అని అడుగుతుంది. కావాల్సినవాళ్ల గురించి తెలుసుకుంటాం అని రాజ్ అంటే.. నా గురించి తెలుసుకుంటున్నాడు కాబట్టి నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని శ్రుతి అనుకుంటుంది.
నా లైఫ్‌లో ఇంత త్వరగా కనెక్ట్ అయిన పర్సన్‌వి నువ్వే. మనం కలుసుకోవడాన్ని సెలబ్రేట్ చేసుకుందామని ఇవాళ నీకు ట్రీట్ ఇద్దామనుకుంటున్నా అని రాజ్ అంటే.. ఈరోజు పండుగ. బయటకు రాలేను అని శ్రుతి అంటుంది. ఇవాళ కాకుంటే రేపు అని రాజ్ అంటాడు. దాంతో సరే అని శ్రుతి మొహం వెలిగిపోతుంది. ఇంతలో కామాక్షి వచ్చి ఏంటే మొహం వెలిగిపోతుంది అని అడుగుతుంది.
ఫ్రెండ్ ఫోన్ చేసింది. దాంతో సంతోషమసిందని శ్రుతి అంటే ఎవరా ఫ్రెండ్ అని కామాక్షి అడుగుతుంది. చెబితే మళ్లీ ఏమంటుందో అని నిజం చెప్పదు శ్రుతి. మరోవైపు చంద్రకళకు రెడ్ రోజ్ ఫ్లవర్ గిఫ్ట్‌గా ఇస్తాడు విరాట్. తీసుకోను అని చంద్రకళ అంటుంది. ఇంత స్పెషల్‌గా తీసుకొస్తే తీసుకోవేంటీ అని విరాట్ అంటే.. తీసుకోను. తలలో పెట్టమని చంద్రకళ అంటుంది.
దాంతో చంద్రకళ తలలో పూవు పెడతాడు విరాట్. చంద్రకళ అందాన్ని పొగుడుతాడు విరాట్. దాంతో విరాట్‌ను హత్తుకుంటుంది చంద్రకళ. మరోవైపు పూజ జరుగుతుంటుంది. అర్జున్ కాల్ చేస్తే ఫోన్ మాట్లాడుకుంటూ చంద్రకళ వస్తుంది. అది చూసిన శాలిని కాలు అడ్డు పెడుతుంది. దాంతో చంద్రకళ చేతిలో ఉన్న పూజ వస్తువులు చెప్పుల స్టాండ్‌పై ఎగిరి పడతాయ్.
చంద్రకళ కింద పడిపోతుంది. చంద్రకళను విరాట్ లేపుతాడు. అమ్మవారికి వేయాల్సిన పూలదండ చెప్పులపై పడింది అని కామాక్షి చెబుతుంది. దాంతో శ్యామల కోపంగా చూస్తుంది. శాలిని పైశాచికంగా నవ్వుతుంటుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్