నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 8 ఎపిసోడ్ లో అమ్మ మనసులో చంద్ర తప్పు చేయలేదనే నమ్మకం ఉంది. అందుకే మౌనంగా ఉందని శ్యామల, కామాక్షితో అంటాడు విరాట్. మాటలతో చంద్రను హింసించకండని అంటాడు విరాట్. ఇది నా లైఫ్, నాకు ఏం కావాలో మీరు డిసైడ్ చేయకండి ప్లీజ్ అని అంటాడు.
రూమ్ లో ఉన్న విరాట్ ను వెనకాల నుంచి హగ్ చేసుకుంటుంది చంద్రకళ. విరాట్ కూడా హత్తుకుంటాడు. చంద్ర ప్లేస్ తీసుకోవడానికి లైన్లో నేనున్నా. మరి శ్వేతను అడగడం ఏంటీ అని తల్లి దగ్గర ఆవేశపడుతుంది శ్రుతి. ఇక నుంచి పెద్దమ్మను కూడా టార్గెట్ చేయాలన్నమాట అని శ్రుతి అంటుంది. శ్యామల దెబ్బ నీ మీద పడితే పచ్చడి అవుతావని కామాక్షి చెప్తుంది.
నా తప్పును మన్నించి మీ ఇంటి మనిషిలా చూశారు. నా సమస్య తీర్చారు. ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేను. థ్యాంక్స్ చంద్ర. మీ వల్ల ప్రాబ్లెం సాల్వ్ అయిందని శ్వేత అంటుంది. థ్యాంక్స్ చెప్పి రుణం తీర్చుకునేంత చిన్న సాయం కాదు నువ్వు చేసింది. సారీ చెప్పేంత చిన్న తప్పు కాదు నేను చేసింది. చంద్ర కాలి గోటికి నేను సమానం కాదు. విరాట్ లైఫ్ లో ఉండాలనే రాత నాకు లేదు. విరాట్ యువర్ లక్కీ. మీ మధ్య ఉన్న అన్ని సమస్యలు తీరిపోయి కుటుంబం సంతోషంగా ఉండాలని చెప్పి శ్వేత వెళ్లిపోతుంది.
జల రాజ్ ఆవురావురుమని చేపల పులుసు లాగిస్తాడు. అలా చూడకు దిష్టి తగులుతుందని అమ్మతో అంటాడు. ఇలా జుర్రెస్తే మిగిలేది ఉత్త కుండలేనని సరోజ అంటుంది. అప్పుడే అప్పులోళ్లు ఇంట్లోకి వస్తారు. డబ్బులు కావాలని అడుగుతారు. మాటలతో మాయ చేస్తాడు రాజ్. వ్యాపారమని జల్సాలు చేస్తున్నావంటా అని అడుగుతారు. అప్పు తీర్చకపోతే గుండు గీయించి, గాడిద మీద ఊరేగిస్తామంటారు. మా అమ్మను ఇంకొక్క మాట అన్న ఊరుకోనని రాజ్ అంటాడు. ఒక్క రోజులో వడ్డీ ఇవ్వమని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతారు.
శ్రుతి దగ్గర నుంచి పాతిక లక్షలు లాగేయమని రాజ్ కు చెప్తుంది సరోజ. మా అమ్మకు డబ్బు లెక్క తెలియదని రాజ్ అనుకుంటాడు. మరోవైపు విరాట్ తన ఫోన్ కోసం వెతుక్కుంటాడు. శ్వేత పేరుతో విరాట్ ను ఏడిపిస్తుంది చంద్ర. ఇద్దరం హనీమూన్ ప్లాన్ చేశామంటాడు. ఎక్కువ మాట్లాడితే ఇక్కడే హనీమూన్ ప్లాన్ చేస్తానంటాడు విరాట్. మరి మనం ఒక్కటైతే అని విరాట్ అంటే, ముగ్గురం అవుతామని అంటుంది చంద్ర.
చంద్రకు విరాట్ ముద్దు ఇవ్వబోతుండగా శ్రుతి వస్తుంది. దీంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం