నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 7వ తేదీ ఎపిసోడ్ లో నువ్వు ఎప్పుడైనా నా అల్లుడిని మిస్ అయ్యావా? విరాట్ విషయంలో నీకు ఇంకో అవకాశం దొరికే అదృష్టం ఉంది. ఆ అదృష్టం నీకుందో లేదో ఓ వారం రోజుల్లో తెలిసిపోతుంది. ఓ పది రోజులు ఉండేసి వెళ్లు అని శ్యామల అంటుంది. అది విన్న జగదీశ్వరి గట్టిగా అరుస్తుంది.
ఏం చేస్తున్నావ్ నువ్వు? పరాయి అమ్మాయి ముందు ఏంటీ మాటలు? ఇంటి విషయాలు సొంతవాళ్ల మధ్య డిస్కస్ చేయాలి. ఈ మధ్య నీ ఆలోచనలు హద్దు మీరుతున్నాయి శ్యామల అని జగదీశ్వరి అంటుంది. రేప్పొద్దున చంద్రకళ తప్పు తేలితే అప్పుడు విరాట్ ఒంటరివాడు అవుతాడని అంటున్నానని శ్యామల చెప్తుంది. శ్వేతను మళ్లీ విరాట్ జీవితంలోకి రమ్మని అనడం చాలా తప్పంటుంది జగదీశ్వరి.
అత్తయ్య అలా మాట్లాడింది ఏంటీ శాలిని? అని అడుగుతాడు క్రాంతి. శ్వేత ముందు వదిన ముందు అలా మాట్లాడటం కరెక్టేనా? తప్పు తేలకముందే శ్వేతను అన్నయ్య లైఫ్ లోకి తీసుకురావాలనుకోవడం ఏంటీ? అని అడుగుతాడు క్రాంతి. బావ ఒంటరిగా ఉండటం కంటే కూడా శ్వేత వస్తే బెటరని పిన్ని అనుకుని ఉంటుందని శాలిని చెప్తుంది.
శ్యామల మాటలు తలుచుకుని ఏడ్చేస్తుంది చంద్రకళ. అప్పుడే శ్వేత వచ్చి సారీ చెప్తుంది. మీరు నిజంగా గ్రేట్ చంద్ర. నా వల్ల మీరు బాధపడుతున్నా నా ముందు మాత్రం బయటపెట్టకుండా ఉంటున్నారు. మీ మంచితనం తెలుసుకున్నా. కానీ ఇంట్లోవాళ్లు ఎందుకు తెలుసుకోవడం లేదు. నా వల్ల మీ లైఫ్ లో డిస్టర్బెన్స్ కలిగినందుకు సారీ అని చెప్తుంది శ్వేత. మిమ్మల్ని, విరాట్ ను కలిపేందుకు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమేనని శ్వేత అంటుంది.
చంద్ర వెళ్లిపోతే శ్రుతి కదా ఇంటి కోడలు కావాలి కదా అని శ్యామలను అడుగుతుంది కామాక్షి. అప్పుడే వచ్చిన విరాట్ సీరియస్ అవుతాడు. ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తున్నావ్ అత్తా. నా మనసులో ఏముందో తెలుసుకోకుండా నా లైఫ్ కు సంబంధించి నిర్ణయం తీసుకోవడం ఏంటీ? నాకు ఏం కావాలో నీకు పట్టదా అత్త. ఇంత ద్వేషం పనికిరాదత్తా అని విరాట్ అంటాడు.
నేనే వెళ్లి చంద్ర మీద ద్వేషంలో తాళి కట్టా. ఆ తర్వాత చంద్రను నీ కంటే ఎక్కువగానే హేట్ చేశా. చంద్ర అన్నింటినీ భరించి ఈ ఇంట్లోనే ఉంది. మెడ పట్టుకుని బయటకు గెంటేసిన తను వెళ్లలేదు. అప్పుడు అమ్మ లోపలికి ఆహ్వానించింది. ఒకప్పుడు చంద్ర ఎవరో తెలియకుండానే నా జీవితంలోకి తీసుకురావాలనుకుంది. అమ్మది ద్వేషం కాదు బాధని అంటాడు విరాట్.
చంద్ర బాధపడటానికి నేనే కారణం. తాళి కట్టకపోయి ఉంటే ఈ ఇంటికి వచ్చేది కాదు. ఇదంతా నా తప్పే కానీ చంద్ర అనుభవిస్తుంది. చంద్ర తప్పు చేయలేదని నమ్ముతున్నా. తనకు కుటుంబమంతా కావాలి. నిజంగా చంద్ర రచ్చ చేయాలనుకుంటే ఒక్క కంప్లయింట్ ఇస్తే చాలత్తా. కానీ తను భరిస్తూనే ఉంది. నాన్న కోలుకోవాలని, చంద్ర తప్పు లేదని చెప్పాలని కోరుకుంటుందని విరాట్ అంటాడు.
దయచేసి చంద్రను బాధపెట్టకండి అత్త అని చేతులెత్తి మొక్కుతాడు విరాట్. అమ్మలా ఆలోచించండని విరాట్ అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం