నిన్ను కోరి అక్టోబర్ 11 ఎపిసోడ్: రఘురాంకు అమెరికా డాక్టర్ ట్రీట్‌మెంట్- ఆపేందుకు చేయి కోసుకున్న శాలిని- కామాక్షి డౌట్-ninnu kori serial today episode october 11th 2025 kamakshi doubts shalini star maa jio hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నిన్ను కోరి అక్టోబర్ 11 ఎపిసోడ్: రఘురాంకు అమెరికా డాక్టర్ ట్రీట్‌మెంట్- ఆపేందుకు చేయి కోసుకున్న శాలిని- కామాక్షి డౌట్

నిన్ను కోరి అక్టోబర్ 11 ఎపిసోడ్: రఘురాంకు అమెరికా డాక్టర్ ట్రీట్‌మెంట్- ఆపేందుకు చేయి కోసుకున్న శాలిని- కామాక్షి డౌట్

Sanjiv Kumar HT Telugu

నిన్ను కోరి సీరియల్ అక్టోబర్ 11 ఎపిసోడ్‌లో రఘురాం ట్రీట్‌మెంట్‌ కోసం అమెరికా నుంచి స్పెషల్ న్యూరాలజిస్ట్ వచ్చిందని, తీసుకెళ్దామని క్రాంతి చెబుతాడు. కానీ, దాన్ని ఆపేందుకు కావాలనే చేయి కోసుకుంటుంది శాలిని. అదంతా కామాక్షి, శ్రుతికి డౌట్ వచ్చి నిలదీస్తారు. అర్జున్ కంపెనీకి కొత్త మెనేజర్ మనోహర్ వస్తాడు.

నిన్ను కోరి సీరియల్ అక్టోబర్ 11 ఎపిసోడ్‌

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అంతా నచ్చజెప్పడంతో పంతులు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది జగదీశ్వరి. తర్వాత విరాట్‌ను భోజనానికి రమ్మని చంద్ర అడిగితే.. రానంటాడు. నువ్వు అజాగ్రత్తగా ఉండి చేస్తున్నావో. నీ టైమ్ అలా ఉందో. నిన్ను అందరు అంటే ఏం చెప్పాలో తెలియక ఉండిపోతున్నా అని విరాట్ బాధపడుతాడు.

తప్పులు కనిపించవు

స్నేహం ఉన్నన్ని రోజులు తప్పులు కనిపించవు. అదే పోతే అన్ని తప్పులు కనిపిస్తాయి. ఇప్పుడు శ్యామల గారు అదే చేస్తున్నారు. ఆవిడ ఏం చేసిన ఇంటి మంచి కోసమే. మనం నిజాయితీగా ఉంటే అదే కాపాడుతుందని చంద్రకళ అంటుంది. కానీ, గడువు ముగిసిపోతుంది. ఆలోపు నాన్న కోలుకుంటారో లేదో అని భయంగా ఉందని విరాట్ అంటాడు.

అందుకు దిగులుపడాల్సిన అవసరం లేదని క్రాంతి వస్తూ అంటాడు. డాక్టర్ వైశాలి అని ఫేమస్ న్యూరో సర్జన్. అమెరికా నుంచి వస్తున్నారు. నా ఫ్రెండ్ ఆమెతో మాట్లాడించారు. నాన్న కండిషన్ గురించి మొత్తం చెప్పాను. ఆవిడ నాన్నకు క్యూర్ చేస్తుందని నా ఫ్రెండ్ చెప్పాడు అని క్రాంతి చెబుతుంది. దాంతో ముగ్గురు సంతోషిస్తారు. మరుసటి రోజు నాన్న కోసం హాస్పిటల్‌కు వెళ్తున్నట్లు శాలినికి చెబుతాడు క్రాంతి.

ఆ మాటలు జగదీశ్వరి వాళ్లు వింటారు. డాక్టర్ వైశాలి గురించి విరాట్, చంద్రకళ వచ్చి చెబుతారు. ఎలాంటి సమస్య అయినా క్యూర్ చేస్తారంటా అని క్రాంతి అంటాడు. కానీ, ఆల్రెడీ ఒక డాక్టర్‌కి చూపిస్తున్నాం కదా. మెడిసిన్ ఇంకా పూర్తి కాలేదుగా అని శాలిని అడ్డుపడుతుంది. ఒక డాక్టర్ కనిపెట్టలేనిది ఇంకో డాక్టర్ కనిపెట్టొచ్చు. ఇంకో ప్రయత్నం చేస్తే తప్పేముందని చంద్రకళ అంటుంది.

అమ్మవారు చూపించిన దారి

పూజ చేయగానే డాక్టర్ గురించి తెలిసిందంటే అమ్మవారు చూపించిన దారే అని జగదీశ్వరి అంటుంది. దాంతో శాలిని తెగ వణికిపోతుంది. ఆ డాక్టర్‌ను కలిస్తే నేను దాచిన విషయం బయటపడుతుంది. ఎలాగైనా ఆపాలి అని శాలిని ఆలోచిస్తుంది. మరోవైపు అర్జున్ ఆఫీస్‌కు కొత్త మేనేజర్ మనోహర్ వస్తాడు. ఇంతకుముందున్న మేనేజర్ నమ్మకద్రోహం చేయడంతో భారీ లాస్ వచ్చింది. మీరు దాన్ని భర్తీ చేయాలని అర్జున్ చెబుతాడు.

తర్వాత అర్జున్‌కు కాల్ రావడంతో వెళ్లిపోతాడు. మరోవైపు శాలిని టెన్షన్ పడుతుంటే కామాక్షి వచ్చి మాట్లాడుతుంది. టిఫిన్‌కు బదులు ఆపిల్ తింటానని చెప్పి కావాలనే చేయి కోసుకుంటుంది శాలిని. చంద్రకళ వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. మావయ్య గారిని హాస్పిటల్‌కు తీసుకెళ్తుంటే ఇలా అపశకునం జరిగిందేంటీ. మావయ్య కోసమేగా అని శాలిని అంటుంది.

పిచ్చిదానిలా మాట్లాడకు. నీకు చేయి కట్ అయితే నాన్నకు మంచి జరగకపోవడం ఏంటీ. డాక్టర్ ఇవాళ ఒక్కరోజే ఉంటాడు. కావాలంటే నేను ఇక్కడ ఉంటా అన్నయ్య వాళ్లు తీసుకెళ్తారు అని క్రాంతి కోపంగా అంటాడు. దాంతో క్రాంతి వాళ్లు వెళ్లేందుకు రెడీ అవుతారు. మరోవైపు రాజ్‌ను కలిసేందుకు శ్రుతి రెడీ అవుతుంటే ఎక్కడికి అని కామాక్షి అడుగుతుంది. శ్రుతి అబద్ధం చెబుతుంది.

కామాక్షి, శ్రుతి అనుమానం

శాలిని చేయి కట్ చేసుకుందని కామాక్షి జరగిదంతా చెబుతుంది. అలా జరగదు. శాలిని అబద్ధం చెప్పింది అని శ్రుతి అంటుంది. మొదటిసారి బ్రెయిన్ పెట్టి ఆలోచించావ్. శాలిని కావాలనే చేయి కట్ చేసుకుందని నా డౌట్. అన్నయ్యను హాస్పిటల్‌కు తీసుకెళ్లకుండా ఆపాలానా. కానీ, దానికి కారణం ఏమై ఉంటుంది అని కామాక్షి అనుకుంటారు. వెళ్లి అడుగుదాం పదా అని శ్రుతి అంటుంది.

దాంతో వెళ్లి శాలిని అడుగుతారు. నీకు మా అన్నయ్య కోలుకోవడం ఇష్టంలేదా. నిన్న చంద్రకళను పడేలా చేసింది కూడా నువ్వేగా. నీ ప్రవర్తన అనుమానించేలా ఉంది. మాకు తెలియకుండా నువ్వు ఏదో చేస్తున్నావ్ అని కామాక్షి అంటుంది. మావయ్య కోలుకోకూడదని ఎందుకు కోరుకుంటున్నావ్ అని శ్రుతి అంటుంది. ఆపండి. మీరు అనే మాటలకు మీదపడి కొట్టేయాలని ఉంది. మావయ్య కోలుకుంటే చంద్రకళ బయటకు వెళ్లిపోతుంది. ఆ అవకాశాన్ని నేను ఎలా వదులుకుంటా అని శాలిని అంటుంది.

చంద్రకళకు ఫోన్ కాల్

అది నమ్మిన కామాక్షి వాళ్లు వెళ్లిపోతారు. రఘురాంను హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు రెడీ అవుతారు. చంద్రకళ వెళ్లి రిపోర్ట్స్ తీసుకొస్తుంది. ఇంతలో అర్జున్ మెనేజర్ ఆఫీస్‌కు రమ్మని కాల్ చేస్తాడు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం