నిన్ను కోరి అక్టోబర్ 10 ఎపిసోడ్: శాలిని కన్నింగ్-కింద‌ప‌డ్డ చంద్ర‌-జ‌గ‌దీశ్వ‌రి క‌న్నీళ్లు-అత్త కాళ్లు ప‌ట్టుకున్న కోడలు-ninnu kori serial today episode october 10th 2025 shalini chandrakala jagadeeshwari cries viral star maa jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నిన్ను కోరి అక్టోబర్ 10 ఎపిసోడ్: శాలిని కన్నింగ్-కింద‌ప‌డ్డ చంద్ర‌-జ‌గ‌దీశ్వ‌రి క‌న్నీళ్లు-అత్త కాళ్లు ప‌ట్టుకున్న కోడలు

నిన్ను కోరి అక్టోబర్ 10 ఎపిసోడ్: శాలిని కన్నింగ్-కింద‌ప‌డ్డ చంద్ర‌-జ‌గ‌దీశ్వ‌రి క‌న్నీళ్లు-అత్త కాళ్లు ప‌ట్టుకున్న కోడలు

నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 10వ తేదీ ఎపిసోడ్ లో దుర్గా పూజ కోసం చంద్రకళ మాల తెస్తుంది. శాలిని కాలు అడ్డు పెట్టడంతో చంద్ర కింద పడుతుంది. మాల వెళ్లి చెప్పులపై పడుతుంది. దీంతో జగదీశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటుంది. చంద్ర వెళ్లి అత్త కాళ్లు పట్టుకుంటుంది.

నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar)

నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 10వ తేదీ ఎపిసోడ్ లో చంద్రకళతో రొమాంటిక్ గా మాట్లాడతావు విరాట్. తన భార్యను పొగిడేస్తాడు. ఇద్దరు హగ్ చేసుకుంటారు. దుర్గాదేవి దయ వల్ల ప్రాబ్లెమ్స్ అన్ని తీరిపోతాయని విరాట్ అంటాడు. అది చూసిన శ్రుతి కుళ్లుతో రగిలిపోతుంది. శ్యామల నగలను చూస్తూ వేసుకుందామని ఆశగా చూస్తుంది కామాక్షి.

శ్యామలకు ముద్దు

చంద్రకళ జడలో విరాట్ పువ్వు పెట్టిన విషయాన్ని శ్యామల, కామాక్షికి చెప్తుంది శ్రుతి. విరాట్ తో ఏకంగా కాపురమే చేస్తుందని కామాక్షి అంటుంది. ఈ మాటలు చంద్రకళ వింటుంది. చంద్ర కోసం విరాట్ పూలు తేవడం ఇది కొత్తేమీ కాదు. భార్యభర్తలను అడ్డుకునే హక్కు మనకు ఎక్కడ ఉంటుందని శ్యామల అంటుంది. నా మీద మీకు ప్రేమ ఉంది. ఐ లవ్యూ పిన్ని అని శ్యామల బుగ్గ గిల్లి ముద్దు పెట్టి వెళ్లిపోతుంది చంద్ర.

కిందపడ్డ చంద్రకళ

దసరా రోజు చంద్రకు అర్జున్ ఫోన్ చేస్తాడు. బిజినెస్ ప్రాబ్లెమ్స్ కూడా సెట్ అవాలని అమ్మవారిని కోరుకోండని అర్జున్ అడుగుతాడు. అలా చంద్ర మాట్లాడుతూ వస్తుండగా శాలిని కాలు అడ్డం పెడుతుంది. చంద్ర కింద పడుతుంది. పూల దండ వెళ్లి చెప్పుల మీద పడుతుంది. ఎలా కిందపడ్డానో అర్థం కాలేదని చంద్ర చెప్తుంది. ఫ్లవర్ వాజ్ అయి ఉంటుందని శాలిని చెప్తుంది.

ఛాన్స్ దొరికిందని

ఛాన్స్ దొరికిందని చంద్రకళ, విరాట్ ను మాటలంటారు శ్యామల, కామాక్షి. పండగ పూట రొమాన్స్ ఏంటని ఫైర్ అవుతుంది శ్యామల. పొరపాటున జరిగిందని ఇంకో మాల తీసుకొస్తానని అంటుంది చంద్ర. ఈ అమ్మాయి ఏదో చేస్తుందని, పూజలో ఏ అవాంతరం రావొద్దని ముందే చెప్పా. ఇలా జరిగితే వదిన మనసు ఎంతలా నొచ్చుకుంటుందని శ్యామల అంటుంది. జగదీశ్వరి ఏడుస్తూ వెళ్లిపోతుంది. విరాట్ కూడా చంద్రను జాగ్రత్తగా ఉండాల్సిందని అంటాడు.

కాళ్లు పట్టుకున్న చంద్ర

అత్తయ్య నన్ను క్షమించండి. పూల మాల కావాలని పడేయలేదు. పూజ చెడగొట్టాలనే ఉద్దేశం నాకు లేదని చంద్ర అంటుంది. నా బతుక్కి బాధే రాసి పెట్టాడు దేవుడు. ఎవరిని ఏం అనలేను వెళ్లు అని అంటుంది జగదీశ్వరి. ఇంకో మాల తీసుకొస్తాను పూజ చేయమంటుంది చంద్ర. ఎలా పూజ చేయగలను? అని అడుగుతుంది జగదీశ్వరి. నా భవిష్యత్ మామయ్య చేతుల్లో ఉంది ఈ పూజ ఆగిపోకూడదు. ప్లీజ్ అత్తయ్య అని కాళ్లు పట్టుకుంటుంది చంద్ర.

శ్యామల ఇంకో మాల తీసుకొచ్చి పూజ చేయమంటుంది. పూజ దగ్గరకు చంద్రను రావద్దని అంటుంది శ్యామల. జగదీశ్వరి, రఘురాం కలిసి పూజ చేస్తారు. మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నానంటూ భర్తను చూస్తూ బాధ పడుతుంది జగదీశ్వరి. దీంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం