నిన్ను కోరి మే 30 ఎపిసోడ్: నా భర్తను చంపడానికే చేసింది.. చంద్రకళ చెంప చెల్లుమనిపించిన జగదీశ్వరి- శాలిని ప్లాన్ సక్సెస్!-ninnu kori serial today episode may 30th 2025 jagadeeswari slaps chandrakala star maa jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నిన్ను కోరి మే 30 ఎపిసోడ్: నా భర్తను చంపడానికే చేసింది.. చంద్రకళ చెంప చెల్లుమనిపించిన జగదీశ్వరి- శాలిని ప్లాన్ సక్సెస్!

నిన్ను కోరి మే 30 ఎపిసోడ్: నా భర్తను చంపడానికే చేసింది.. చంద్రకళ చెంప చెల్లుమనిపించిన జగదీశ్వరి- శాలిని ప్లాన్ సక్సెస్!

Sanjiv Kumar HT Telugu

నిన్ను కోరి సీరియల్ మే 30 ఎపిసోడ్‌లో డబ్బు కనిపించకపోవడంతో చంద్రకళే తీసిందని కామాక్షి, శాలిని నిందలు వేస్తారు. కానీ, క్రాంతి సపోర్ట్ చేస్తాడు. స్పృహలోకి వచ్చిన చంద్రకళ జరిగింది చెబుతుంది. రఘరాం ట్యాబ్లెట్లను శాలిని మార్చేస్తుంది. వాటిని రఘురాంకు చంద్ర ఇవ్వడంతో నురగలు కక్కుతాడు.

నిన్ను కోరి సీరియల్ మే 30 ఎపిసోడ్‌

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో ఏం దొరకలేదని, రాంగ్ ఇన్ఫర్మేషన్ అని, సారీ చెప్పి ఐటీ రైడ్స్ ఆఫీసర్స్ వెళ్లిపోతారు. రూమ్‌లోకి వెళ్లి బ్యాగ్ చూస్తే కనిపించదు. దాంతో డబ్బు ఏమైందని అంతా అడుగుతారు. డబ్బు ఎలా మిస్ అయిందని అనుకుంటారు. అందరం ఉన్నాం కానీ, కొత్తగా వచ్చిన మనిషి లేదుగా చంద్రకళ తీసిందని శాలిని అంటుంది.

చంద్రకళపై నిందలు

కచ్చితంగా చంద్రకళ తీసి ఉంటుందని కామాక్షి ఉంటుంది. అనసవరంగా చంద్రకళ మీద నిందలు వేస్తారు అని క్రాంతి సపోర్ట్ చేస్తాడు. చంద్ర గురించి నీకు తెలియదని శ్రుతి అంటుంది. ఇదంతా ఎందుకు ముందు కాల్ చేయు అని విరాట్ అంటే.. క్రాంతి కాల్ చేస్తాడు. నాట్ రీచబుల్ అని వస్తుంది. దాంతో చంద్రకళనే డబ్బు తీసిందని గట్టిగా వాదిస్తారు శాలిని, కామాక్షి, శ్రుతి.

డబ్బు తీసింది చంద్ర అని మీరైనా నమ్ముతున్నారా. మీ తమ్ముడిలాగే సపోర్ట్ చేస్తారా అని శాలిని అంటుంది. సాయంత్రం అయితే చంద్ర వస్తుందిగా. ఒకవేళ రాకుంటే అప్పుడు ఆలోచిద్దాం అని విరాట్ వెళ్లిపోతాడు. టెర్రస్ పైకి వెళ్లి చంద్రకు కాల్ చేస్తాడు విరాట్. కానీ, కాల్ కలవదు. విరాట్ కిందకు వెళ్తూ చంద్ర ఫోన్ అక్కడ చూస్తాడు. ఇది ఇక్కడ ఎందుకు పడిందని చుట్టూ చూస్తాడు విరాట్.

స్పృహలోకి చంద్రకళ

స్పృహ తప్పి పడిపోయి ఉన్న చంద్రకళను చూసి షాక్ అవుతాడు. కంగారుగా చంద్రకళను లేపుతాడు. ఇక్కడ ఎలా పడిపోయిందని అంతా అనుకుంటారు. వాటర్ తీసుకొచ్చి మొహంపై జల్లి చంద్రకళను లేపుతారు. దాంతో చంద్రకళ స్పృహలోకి వస్తుంది. ఏమైందని అడుగుతారు. డబ్బుల గురించి అడుగుతామని ఇలా నాటకం ఆడుతుందని శ్రుతి, కామాక్షి అంటారు.

డబ్బులు ఏం చేశావని శాలిని నిలదీస్తుంది. చంద్ర ఆ డబ్బు నువ్వేమైనా తీశావా అని విరాట్ అడుగుతాడు. దీంట్లో ఇప్పుడే అందరికి క్లారిటీ రావాలని విరాట్ అంటాడు. అవును, ఆ డబ్బు నేనే తీశాను అని నీళ్ల ట్యాంక్‌లో దాచిపెట్టిన డబ్బు తీసుకొస్తుంది చంద్రకళ. క్రాంతికి ఇస్తుంది. ఇది దొంగతనంగానే తీశాను. నిన్ను సేవ్ చేయడానికి తీశాను అని జరిగింది చెబుతుంది చంద్రకళ.

అరెస్ట్ అయ్యేవాన్ని

చూశారా నాకోసం వదిన ఎంత రిస్క్ చేసిందో. తను రాకుంటే నేను అరెస్ట్ అయ్యేవాన్ని. అలాంటి మనిషిపై నిందలు వేశారు అని దుష్ట త్రయాన్ని తిడతాడు క్రాంతి. చంద్రకళ కూడా క్లాస్ పీకి వెళ్తుంది. తర్వాత ఎవరికి వాళ్లు వెళ్తుంటారు. ఈ సంఘటనతో అటు అన్నయ్యకు, ఇటు అమ్మకు చంద్రకళపై పాజిటివ్ అభిప్రాయం వస్తుంది అని క్రాంతి అంటాడు.

అలా జరగకూడదు. ఏదోటి చేయాలి అని శాలిని కొత్త స్కెచ్ వేస్తుంది. మరుసటి రోజు ఉదయం. రఘురాంకు ఇచ్చే ట్యాబ్లెట్స్ మార్చేస్తుంది శాలిని. అది తెలియక అవే మాత్రలను రఘురాంకి వేస్తుంది చంద్రకళ. కాసేపటికి రఘురాం నురగ కక్కుతాడు. అది చూసి జగదీశ్వరి షాక్ అవుతుంది. మెడిసిన్ పడలేదేమో అని శాలిని అంటుంది.

భర్తను చంపడానికే చేసింది

ఇందాక చంద్ర వదిన మెడిసిన్ ఇచ్చిందని క్రాంతి చెబుతాడు. ఇది నా భర్తను చంపడానికే ప్రయత్నం చేసింది అని జగదీశ్వరి అంటుంది. అంత మాట అనకండి. నేనెందుకు మావయ్య గారిని చంపడానికి చూస్తాను అని చంద్రకళ అంటుంది. దాంతో నోర్మూయ్ అని చంద్రకళ చెంపచెల్లుమనిపిస్తుంది జగదీశ్వరి. దానికి అంతా షాక్ అవుతారు. శాలిని ప్లాన్ సక్సెస్ అవుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం