నిన్ను కోరి సీరియల్ నేటి (మే 27) ఎపిసోడ్‍లో.. ఏసీ కూల్ తగ్గించడానికి విరాట్ ట్రై చేస్తాడు. కానీ రిమోట్‍లో సెల్స్ ఉండవు. తంటాలు పడతాడు. నా దగ్గర ఉన్నాయని చంద్రకళ అంటుంది. విరాట్‍ను సరదా పట్టిస్తుంది. దుప్పటి లాక్కుంటూ ఇద్దరూ పోటీ పడతారు. ఒకే దుప్పటి కప్పుకొని పడుకుంటారు. విరాట్ వంక ప్రేమగా చూస్తూ మీద చేయి వేస్తుంది చంద్ర. విరాట్ చిరాకు పడతాడు.
రాత్రంతా నేల మీద పడుకునే సరికి ఒళ్లు నొప్పులుగా ఉందని, అంతా ఆయన వల్లే అంటూ చంద్రకళ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కిచెన్‍లోకి కామాక్షి, శృతి వస్తారు. ఏంటి అలా ఉన్నావని అడుగుతాడు. సోఫా మీద పడుకోలేదు.. అందుకే ఒళ్లు నొప్పులు అని చంద్ర అంటుంది. అంటే విరాట్‍తో మంచం మీద పడుకున్నావా అని కామాక్షి అడుగుతుంది. నీకు అంత సీన్ లేదు.. విరాట్ నిన్ను దగ్గరికి కూడా రానివ్వడని శృతి అంటుంది. బావే నా దగ్గరికి వచ్చాడని చంద్ర చెబుతుంది. ఇంతలో శాలినీ అక్కడికి వస్తుంది.
కొంపతీసి ఇద్దరూ రాత్రి ఒక్కటయ్యారా అని కామాక్షి అంటుంది. దీంతో చంద్ర సిగ్గుపడుతూ ఉంటుంది. అంతలేదని శృతి చెబుతుంది. ఇంతలో బాడీ అంతా పెయిన్స్ అని విరాట్ ఇబ్బంది పడుతుంటాడు. కామాక్షి, శృతి, శాలినీ ఇది చూసి షాక్ అవుతారు. చంద్ర ఎప్పుడూ దుష్టత్రయం అనే ఈ ముగ్గురు అవాక్కవుతారు. ఒకే దుప్పటి కింద పడుకునే సరికి ఒళ్లు పులిసిపోయిందని విరాట్ అనుకుంటాడు. నమ్మలేదు కదా నా కన్నా ఆయనకే పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయని ఆ ముగ్గురిని మరింత ఉడికిస్తుంది చంద్ర.
రాత్రి ఏం జరిగిందో చెప్పండి అని విరాట్‍ను చంద్ర అడుగుతుంది. పరువు పోతుందేమో అనుకొని.. రాత్రి చాలా ఎంజాయ్ చేశా.. లైఫ్‍లో ఎప్పుడూ అంత మాజా రాలేదని విరాట్ అంటాడు. దీంతో ఆ మగ్గురు షాక్ అవుతారు. వాళ్లు మన మధ్య జరిగింది గొడవ అనుకోవడం లేదు.. అది జరిగిందని అనుకుంటున్నారని చంద్ర చెప్పేస్తుంది. దీంతో విరాట్ కంగారు పడతాడు.
కామాక్షి, శృతి, శాలినీ ఒక్క చోట చేరి రగిలిపోతుంటారు. ఇంతలో అక్కడికి చంద్రకళ వస్తుంది. రాత్రి తనకు, విరాట్‍కు మధ్య ఏదీ జరగలేదని చెప్పేస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెటటాలని అలా అన్నానని, నేను మరీ అంత చీప్‍గా ఆలోచించనని అంటుంది. తాళి సంప్రదాయబద్ధంగా కట్టించుకోకపోయినా.. మిగిలిన తంతు అంతా సంప్రదాయంగా జరుగుతుందని చంద్ర అంటుంది.
ఆల్లోపతి మందులతో రఘురాం నయం కావడం లేదని, ఆయుర్వేద చికిత్స చేయించేందుకు వైద్యుడిని చంద్ర తీసుకొస్తుంది. మన మీద ఏదైనా ప్లాన్ చేసిందా అని శృతి అంటుంది. ఏదేదో ఆలోచిస్తావేంటి అని క్రాంతి వారిస్తాడు. మా నాన్న విషయంలో జోక్యం చేసుకోవద్దని చంద్రపై చిరాకు పడతాడు విరాట్. ఇంతలో జగదీశ్వరి అక్కడికి వస్తుంది. కామాక్షి, శృతి, శాలినీ నోరు పారేసుకుంటారు. ఈయన మహాజ్ఞాని అని చంద్ర అంటుంది. మీరు గురుదేవ సింహ కదా అని ఆయుర్వేద వైద్యుడిని జగదీశ్వరి అడుగుతుంది. రఘురాంకు ఆయన చికిత్స చేసేందుకు ఓకే చెబుతుంది.
రఘురాంను చూసి ఈయన కోలుకునే అవకాశం ఉందని ఆయుర్వేద వైద్యుడు చెబుతాడు. దీంతో జగదీశ్వరి సంతోషిస్తుంది. ఆయుర్వేద మందులు, తైలాలు ఇస్తాడు వైద్యుడు. మీ మామయ్య మామూలు మనిషి అవుతాడని చంద్రతో ఆ వైద్యుడు అంటాడు. దీంతో మామయ్య త్వరగా కోలుకోవాలని చంద్ర అనుకుంటుంది. చంద్ర చేయాలనుకున్న పనికి మీర అడ్డుపడడం బాగోలేదని శృతి, శాలిని, కామాక్షిపై క్రాంతి ఫైర్ అవుతాడు.
ఆఫీస్‍కు వెళ్లేందుకు విరాట్ సిద్ధమవుతుంటాడు. ఇంతలో విరాట్ బ్యాగ్‍ను చంద్ర సర్దుతుంటుంది. విరాట్ కోప్పడతాడు. ఇద్దరు మాటమాటా అనుకుంటారు. ఫేస్ క్రీమ్ కింద పడుతుంది. ఫేస్ క్రీమ్‍పై కాలు పెట్టడంతో జారి చంద్రపై పడతాడు విరాట్. దీంతో అనుకోకుండా చంద్ర బుగ్గపై ముద్దు పెట్టేస్తాడు విరాట్. ఒకరి కళ్లలోకి ఒకరు తదేకంగా చూసుకుంటారు.
సంబంధిత కథనం