నిన్ను కోరి మే 23 ఎపిసోడ్: శాలినికి ఎదురుతిరిగిన భర్త క్రాంతి.. చంద్రకళను మోసం చేసిన విరాట్.. పంతులుతో బయటపడిన నిజం-ninnu kori serial today episode may 23rd 2025 kranthi angry on shalini virat cheated chandrakala star maa jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నిన్ను కోరి మే 23 ఎపిసోడ్: శాలినికి ఎదురుతిరిగిన భర్త క్రాంతి.. చంద్రకళను మోసం చేసిన విరాట్.. పంతులుతో బయటపడిన నిజం

నిన్ను కోరి మే 23 ఎపిసోడ్: శాలినికి ఎదురుతిరిగిన భర్త క్రాంతి.. చంద్రకళను మోసం చేసిన విరాట్.. పంతులుతో బయటపడిన నిజం

Sanjiv Kumar HT Telugu

నిన్ను కోరి సీరియల్ మే 23 ఎపిసోడ్‌లో యాక్సిడెంట్ వీడియో చూపించకపోయి ఉంటే నీకు ఈ కష్టాలు ఉండేవి కావని చంద్రకళతో అంటాడు క్రాంతి. ఆ మాటలు విన్న శాలిని భర్త క్రాంతిని తిడుతుంది. దాంతో శాలినికి క్రాంతి ఎదురుతిరుగుతాడు. చంద్రకళను విరాట్ గుడికి తీసుకెళ్తాడు. రోడ్డు మీద చెప్పులు లేకుండా చంద్రకళ నడుస్తుంది.

నిన్ను కోరి సీరియల్ మే 23 ఎపిసోడ్‌

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జగదీశ్వరి ఇంట్లో చంద్రకళకు జరుగుతున్న అవమానాలు, ద్వేషాలు చూసి క్రాంతి బాధపడుతాడు. చంద్రకళ దగ్గరికి వెళ్లి మాట్లాడుతాడు. నాన్నకు జరిగిన యాక్సిడెంట్, జరిగిన వీడియో చూపించకపోయి ఉంటే ఈరోజు నువ్వు ఇంత కష్టపడే అవసరం ఉండేది కాదు వదిన అని క్రాంతి బాధపడుతూ అంటాడు.

పెద్దనాన్న మాటలతో

ఇందులో నీ తప్పేమి లేదు క్రాంతి. అంతా విధి ప్రకారమే జరుగుతుంది. నేను కూడా వాళ్లు అలా చేస్తారని అనుకోలేదు. మా పెద్దనాన్నను నేను మార్చగలను అనుకున్నాను. ఆయన చెప్పిన మాటలు నమ్మాను. నమ్మి మోసపోయాను. ఇంట్లోవాళ్లంతా పెద్దనాన్న మాటలతో మోసపోయారు. కానీ, మనసులో ఇంతపెద్ద కుట్ర పెట్టుకుని వస్తారని అనుకోలేదు. అయినా ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది. ఇందులో నా తప్పేం లేదని అత్తయ్య వాళ్లు తెలుసుకుంటారు అని చంద్రకళ అంటుంది.

చంద్రకళ, క్రాంతి మాట్లాడుకున్న మాటలను శాలిని వింటుంది. తర్వాత అక్కడి నుంచి గదిలోకి వెళ్లిపోతుంది. బెడ్ రూమ్‌లోకి క్రాంతి వెళ్తాడు. గదిలోకి రాగానే క్రాంతిని శాలిని తిడుతుంది. చంద్రకళతో నీకేంటీ మాటలు, మీ నాన్నను ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చినదాంతో అంత ఆప్యాయంగా మాట్లాడుతావేంటీ, కాస్తాయిన సిగ్గులేదా అని క్రాంతిని శాలిని అంటుంది.

దాంతో క్రాంతి ఫైర్ అవుతాడు. ఏం జరిగిందో నాకు తెలుసు. చంద్రకళ వదిన ఎలాంటిదో అంతకంటే బాగా తెలుసు. నువ్ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు భర్తను ఎలా చూసుకోవాలో అని శాలినిపై కోప్పడి వెళ్లిపోతాడు క్రాంతి. ఇన్నిరోజులు నేను ఏది అన్నా సైలెంట్‌గా పడేవాడు. అలాంటిది ఇప్పుడు నాకే ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు. ఇలాగే కొనసాగితే నాకు చాలా సమస్యగా మారుతుంది. ముందు క్రాంతిని మార్చాలి అని శాలిని అనుకుంటుంది.

ఫైల్ గురించి అడిగిన విరాట్

ఇక మరోవైపు విరాట్‌కి ఆది ఫోన్ చేస్తాడు. కేఎస్ కంపెనీ వాళ్ల ఫైల్ సబ్‌మిట్ చేయలేదు. తీసుకురండి అని విరాట్‌తో ఆది చెబుతాడు. దాంతో చంద్రకళ దగ్గరికి వెళ్లి ఫైల్ గురించి విరాట్ అడుగుతాడు. ఏ ఫైల్, నాకేం తెలుసు. ఆఫీస్ నుంచి తొలగించాక అక్కడి పనులు ఎందుకు చేస్తాను అని బెట్టు చేస్తుంది చంద్రకళ. ఇది గొడవ పడే సమయం కాదు. మర్యాదగా ఫైల్ ఎక్కడుందో చెప్పమని విరాట్ అడుగుతాడు.

నన్ను గుడికి తీసుకెళ్తేనే నీకు ఫైల్ ఇస్తాను అని చంద్రకళ అంటుంది. ముందు ఒప్పుకోని విరాట్ తర్వాత చంద్రకళను గుడికి తీసుకెళ్లేందుకు ఒప్పుకుంటాడు. కారులో విరాట్, చంద్రకళ ఇద్దరూ గుడికి వెళ్తారు. కారులో సైలెంట్‌గా ఉన్న విరాట్‌ను చూసి కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలం.. గుడికి ఇలా సైలెంట్‌గా వెళ్తారా. సరదాగా, జాలీగా మాట్లాడుకుంటూ వెళ్లాలి. ఏదైనా మాట్లాడొచ్చుగా అని చంద్రకళ అంటుంది.

మా ఇంటి ఆచారం ప్రకారం గుడికి నడుచుకుంటూ రావాలి అని విరాట్ చెబుతాడు. అయ్యో.. అవునా.. నాకెందుకు చెప్పలేదు బావ. నేను నడుచుకుంటూ వచ్చేదాన్ని కదా. పర్వాలేదు. ఇక్కడి నుంచి అయినా నడుచుకుంటూ రావచ్చు అని చంద్రకళ కారు దిగుతుంది. చెప్పులు లేకుండా రోడ్డు మీద నడుచుకుంటూ చంద్రకళ గుడికి వెళ్తుంది. విరాట్ మాత్రం కారులో గుడి దగ్గరికి వెళ్తాడు.

సంతోషపడిన విరాట్

చంద్రకళ కోసం గుడి దగ్గర విరాట్ ఎదురుచూస్తుంటాడు. చంద్రకళ ఎంతకీ రాకపోవడంతో ఏమై ఉంటుందా అని కంగారుపడుతాడు విరాట్. కానీ, అంతలోనే చంద్రకళ రావడంతో విరాట్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే విరాట్‌కు ఫోన్ కాల్ రావడంతో పక్కకు వెళ్లిపోతాడు. చంద్రకళ గుడికి వస్తుంది. అక్కడికి పంతులు వస్తాడు. ఏంటమ్మా లేటుగా వచ్చావ్ అని చంద్రకళను పంతులు అడుగుతాడు.

ఆచారం ప్రకారం నేను నడుచుకుంటూ రావాలంట కదా పంతులుగారు అని చంద్రకళ చెబుతుంది. అలాంటి ఆచారాలు ఏమి లేవు. నీకు ఎవరో అబద్ధం చెప్పి ఫూల్‌ను చేశారమ్మా. ఇప్పుడు కూడా ఇలాంటి ఆచారాలు ఎలా నమ్మావమ్మా అని చంద్రకళతో పంతులు అంటాడు. అదంతా విన్న చంద్రకళ షాక్ అవుతుంది. అంటే, కావాలనే బావ నన్ను నడిపించాలని నాతో అలా చెప్పాడన్నమాట అని చంద్రకళ అనుకుంటుంది.

మోసం చేశాడన్నమాట

అంటే, విరాట్ బావ ఆచారం అని అబద్ధం చెప్పి నన్ను మోసం చేశాడు. కారులో రాకుండా గుడికి అంత దూరం నుంచి చెప్పులు లేకుండా నడవాలని చూశాడా అని ఫీల్ అవుతుంది చంద్రకళ. అలా పంతులుతో విరాట్ చేసిన మోసం చంద్రకళకు తెలుస్తుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం