నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ మే 22: ప్రాణం కాపాడిన చంద్రకళ.. జగదీశ్వరి సంతోషం.. చంద్రను ఎత్తుకున్న విరాట్-ninnu kori serial today episode may 22nd 2025 chandrakala does cpr and virat lifts her in temple star maa serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ మే 22: ప్రాణం కాపాడిన చంద్రకళ.. జగదీశ్వరి సంతోషం.. చంద్రను ఎత్తుకున్న విరాట్

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ మే 22: ప్రాణం కాపాడిన చంద్రకళ.. జగదీశ్వరి సంతోషం.. చంద్రను ఎత్తుకున్న విరాట్

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ మే 22: చంద్రకళ వండిన అన్నాన్ని గబగబా తినేస్తాడు విరాట్. చంద్ర పచ్చళ్ల బిజినెస్ గురించి జగదీశ్వరి స్నేహితులు వెటకారంగా మాట్లాడతారు. అయితే, వారిలో ఒకరి ప్రాణాలను చంద్ర కాపాడుతుంది. దీంతో భారీగా ప్రశంసిస్తారు.నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఇవే..

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్: ప్రాణం కాపాడిన చంద్ర.. జగదీశ్వరి సంతోషం.. చంద్రను ఎత్తుకున్న విరాట్

నిన్ను కోరి సీరియల్ నేటి (మే 22) ఎపిసోడ్‍లో.. బిజినెస్ క్లిక్ అయిందని భూమి మీద కాళ్లు నిలబడడం లేదా అంటూ చంద్రకళతో శాలినీ అంటుంది. మీకు మండుతున్నట్టుంది అని చంద్ర పంచ్ వేస్తుంది. ఆ మంటకు నువ్వు కాలిపోతావని శాలినీ అంటే.. ఏమీ చేయలేవని చంద్ర వెటకరిస్తుంది. మీరంతా జుజుబీలు అని కామాక్షి, శృతి, శాలినీని అంటుంది. ఫోన్ ఎత్తలేదు.. మేం చాలా కంగారు పడుతున్నామని చంద్రకు వాళ్ల అమ్మ కాల్ చేసి అంటుంది. ఫోన్ కిందపడింది.. నాకు ఏం కాదని చంద్ర కవర్ చేస్తుంది.

అన్నం ఫినిష్.. ఆకలితో విరాట్

ఇంటికి రాత్రి ఆలస్యంగా వస్తాడు విరాట్. ఇంత లేట్ ఎందుకైంది.. నీకోసం వెయిట్ చేస్తున్నా కదా అంటుంది. నీకెందుకు చెప్పాలి అని విరాట్ చిరాకు పడతాడు. భోజనం పెడతానని, నువ్వు తిన్నాకే తింటానని చంద్ర అంటుంది. నేనే వడ్డించుకుంటానని కోపంగా అంటాడు విరాట్. డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని తినేందుకు విరాట్ రెడీ అవుతాడు. కానీ అన్నం అయిపోయి ఉంటుంది. దీంతో లేచి వెళ్లిపోతాడు. ఫుడ్ ఆర్డర్ కావాడం లేదు, ఆకలి అవుతుందని విరాట్ అనుకుంటూ ఉంటాడు.

విరాట్‍కు భోజనం తెచ్చిన చంద్ర

ఇంతలో అన్నం వండుకొని ప్లేట్‍లో పెట్టుకొని విరాట్ దగ్గరికి తీసుకొస్తుంది చంద్రకళ. నేను తినని విరాట్ పట్టుబడతాడు. ఎంత కోపంలో ఉన్నా భార్య వంట చేస్తే భర్త కరుగుతాడు అంటూ ఫోన్‍లో కొన్ని కొటేషన్లు చదువుతుంది చంద్ర. వద్దు అని నిద్రపోయేందుకు విరాట్ రెడీ అవుతాడు.

చాటుగా తిన్న విరాట్.. నీళ్లు తెచ్చిన చంద్ర

కానీ ఆకలి వల్ల నిద్రపట్టదు. చంద్ర నిద్రపోయిందని చూసి డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్లి ఆ అన్నాన్ని వడ్డించుకొని తింటాడు విరాట్. విరాట్‍కు పొరబోతే సడెన్‍గా నీళ్లు తెచ్చిస్తుంది చంద్ర. అలా చూడకు అని విరాట్ అంటాడు.

జగదీశ్వరి పెద్ద కోడలిని

రఘురాంకు యాక్సిడెంట్ అయిన విషయం తెలుసుకొని జగదీశ్వరిని పలుకరించేందుకు ఆమె స్నేహితులు ఇంటికి వస్తారు. ఫంక్షన్‍కు ఇన్వైట్ చేస్తారు. రఘురాంకు ఎలా ఉందని అడుగుతారు. కోలుకునే వరకు వేచి చూడడం తప్ప చేసేందుకు మీ లేదని జగదీశ్వర్ అంటుంది. చంద్రకళ అప్పుడే పచ్చళ్ల బాటిళ్లు సర్దుతూ ఉంటుంది. ఇంతలో ఆమె ఎవరూ అని జగదీశ్వరిని అడుగుతారు. మా అన్నయ్య భార్య అని క్రాంతి చెబుతుంది. ఇంతలో ఓ కాఫీ కప్పు కింద పడి పగిలిపోతుంది. కప్పు ముక్కలను చంద్ర తీస్తుంది. అన్ని పనులు పనివాళ్లే చేయాలని అనుకోకూడదు.. ఇంటి కోడలిగా కొన్ని పనులు నేను కూడా చేయొచ్చని అంటుంది. నేను జగదీశ్వరి పెద్దకోడలిని అని చంద్ర వారితో చెబుతుంది.

పరువు తీసుస్తున్నావ్

ఆ పచ్చళ్లు నేను చేస్తున్న బిజినెస్ అని చంద్ర అంటుంది. పెళ్లికి పిలవలేదు అని దెప్పిపొడిచేలా వారు మాట్లాడతారు. మీ స్థాయికి కోడలితో పచ్చళ్ల వ్యాపారం ఏంటి, నలుగురు ఏమనుకుంటారని వెటకారంగా మాట్లాడతారు. అనుకునే వారు ఎవరో చెబితే.. వాళ్లకు దూరం ఉంటాం.. మీరు కదా అని చంద్ర గట్టిగా బదులిస్తుంది. మా అత్తయ్య సపోర్ట్ చేశారని చెబుతుంది. పెద్ద కోడలు పెంకిదే అని వారు అనుకుంటారు. మా అమ్మ నీకు సపోర్ట్ చేసిందని ఎందుకు అబద్ధం చెప్పావని చంద్రను విరాట్ ప్రశ్నిస్తాడు. పరువు తీస్తున్నావని అంటాడు. ఆశీర్వాదం తీసుకున్నా కదా అని చంద్ర చెబుతుంది.

ప్రాణాలు కాపాడిన చంద్ర

ఫంక్షన్‍కు రండి అని చెప్పి జగదీశ్వరి స్నేహితులు వెళుతుంటారు. ఇంతలో ఓ మహిళ కుప్పకూలిపోతుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆసుపత్రికి తీసుకెళ్లాలని అంటారు. అప్పటిలోగా ఏదైనా అయితే అని చంద్ర అంటుంది. ఆ మహిళకు చంద్ర సీపీఆర్ చేస్తుంది. ఛాతిపై నొక్కుతుంది. దీంతో ఆమె మళ్లీ స్పృహలోకి వస్తుంది. అందరూ ఊపిరి పీల్చుకుంటారు.

గుణవంతురాలిని కోడలిగా తెచ్చుకున్నారు

నేను నిన్ను ఎగతాళి చేసినా.. ప్రాణాలు కాపాడావ్.. ఎంత మంచి మనసు అని చంద్రను ఆ మహిళ ప్రశంసిస్తుంది. ఈ మేలును జన్మలో మరిచిపోలేను అని దండం పెడుతుంది. దీవించండి చాలు అని చంద్ర అంటుంది. ఎంతో గుణవంతురాలిని మీ కోడలిగా తెచ్చుకున్నారని జగదీశ్వరితో ఆ మహిళ అంటుంది. మీ ఇంటి వెలుగు మీ పెద్దకోడలు అవుతుందని చెబుతుంది. మా కోడళ్లకు కూడా చంద్రను ఫాలో అవ్వాలని చెబుతామని అంటుంది. దీంతో జగదీశ్వరి ఆలోచిస్తుంది. లోలోపల సంతోషపడినట్టు కనిపిస్తుంది.

చంద్రను ఎత్తుకొని విరాట్ ప్రదక్షిణలు

కమింగ్ అప్‍లో.. విరాట్, చంద్ర.. దేవాలయానికి వెళతారు. భార్యను చేతుల్లో ఎత్తుకొని గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయడం మన ఇంటి సంప్రదాయం అని విరాట్‍తో చంద్ర చెబుతుంది. దీంతో చంద్రను చేతులతో ఎత్తుకొని గుడిలో ప్రదక్షిణలు చేస్తాడు విరాట్.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం