నిన్ను కోరి సీరియల్ నేటి (మే 20) ఎపిసోడ్‍లో.. నిద్ర లేచిన తర్వాత పడుకొని ఉన్న విరాట్‍ను ప్రేమగా తదేకంగా చూస్తుంది చంద్రకళ. ఇంతలో విరాట్ మేల్కొంటాడు. స్పృహలోకి వచ్చావా అని ఊరటగా ఉంటాడు విరాట్. నేను సోఫాలో కదా పడుకోవాలి.. మీరేంటి నా పక్కన ఉన్నారని చంద్రకళ అడుగుతుంది. ఇది కళా.. నిజమా అని అంటుంది. మీరు ఏదో దాస్తున్నారు బావా అని చంద్ర అంటుంది. ఏదో ఫుడ్ పాయిజన్ అయిందని డాక్టర్ చెప్పారని విరాట్ చెబుతాడు. కాఫీ ఒక్కటే తాగాను.. ఫుడ్ పాయిజన్ అవడం ఏంటి అని చంద్ర అంటుంది.
మీకు నా మీద ప్రేమ ఉంది, అందుకే జాగ్రత్తగా చూసుకున్నారని విరాట్‍తో చంద్ర అంటుంది. అమ్మ కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకుంది.. అంత మాత్రాన నీపై కోపం పోయినట్టా అని విరాట్ అంటాడు. అత్తయ్య కంగారు పడ్డారా అని చంద్ర సంతోషంగా అంటుంది.
పాయిజన్ ఇచ్చిన వ్యక్తి.. శాలినికి ఫోన్ చేస్తాడు. మొన్న ఇచ్చిన పాయిజన్ పని చేసిందా అని అడుగుతాడు. దాదాపు జరిపోయేదే.. మా బావ పాడు చేశాడని శాలినీ అంటుంది. చంద్రకళ తాగే కాఫీలో నేను విషం కలిపానని, తాగి పడిపోయిందని కూడా అంటుంది. వర్కౌట్ అయిందో లేదో తెలియదని చెబుతుంది. శాలినీ మాటలను చంద్ర వెనుక నుంచి వింటూనే ఉంటుంది. చంద్రను చూసి శాలినీ షాక్ అవుతుంది. తాను తాగిన కాఫీలో శాలినీనే విషం కలిపిందని చంద్రకు తెలిసిపోతుంది.
చంద్ర నువ్వు లేచావా.. ఎంత కంగారు పడ్డామో అని శాలినీ అంటుంది. నీ పాయిజన్ ప్లాన్ ఫెయిల్ అయింది కదా అని చంద్ర అంటుంది. శాలినీ మాత్రం నిజం ఒప్పుకోదు. ఏం ప్రూఫ్ ఉంది.. నీ మాట ఎవరూ నమ్మరు.. ఎలా నిరూపిస్తావని శాలినీ అంటుంది. దీంతో కొట్టేందుకు చేయి ఎత్తి ఆపేస్తుంది చంద్ర. నిన్ను కొట్టడం కూడా దండగే అని అంటుంది. తాను ఇదంతా వీడియో తీశానని చెబుతుంది. సోషల్ మీడియాాలో పెట్టి నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నావని పబ్లిసిటీ చేస్తానని బెదిరిస్తుంది. వద్దు అని భయపడుతుంది శాలినీ.
ఓ రోజంతా ఈ ఇంటికి చాకిరీ చేయాలి అని శాలినీకి కండీషన్ పెడుతుంది చంద్రకళ. బాత్‍రూమ్‍లు కూడా కడగాలి అంటుంది. క్రాంతికి వీడియో చూపిస్తానని చంద్ర బెదిరిస్తుంది. శాలినీ ఇల్లు తుడుస్తుంది. అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఎందుకు ఇలా చేస్తోందని, చంద్ర ఏదో చేసి ఉంటుందని కామాక్షి, శృతి అనుమానిస్తారు. శాలినీ ఇక్కడ తుడువు అంటూ ఆటాడుకుంటుంది చంద్ర. .శాలినీని అలా చూసి మురిసిపోతుంది. అంట్లు కడగడం, వంట చేయడం లాంటివి శాలినీ చేస్తుంది.
నువ్వు చెప్పింది చేశా కదా.. ఆ వీడియో డిలీట్ చేసేయ్ అని చంద్రను శాలినీ అడుగుతుంది. ఏ వీడియో అని చంద్ర అడుగుతుంది. నీకు నేను పాయిజన్ ఇచ్చానని చెప్పిన వీడియో అని శాలినీ అంటుంది. వీడియో తీయలేదని, అలాంటి వీడియో లేదని బిగ్ ట్విస్ట్ ఇస్తుంది చంద్ర. దీంతో శాలినీ షాకవుతుంది. థాంక్యూ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది చంద్ర. దెబ్బకు దెబ్బ కొట్టే వరకు నిద్రపోనని రగిలిపోతుంది శాలినీ.
ఆఫీస్‍కు రెడీ అవుతున్న విరాట్‍కు కాఫీ తీసుకొస్తుంది చంద్ర. కప్‍ను కావాలనే కిందేసి పగలగొడతాడు విరాట్.
కమింగ్ అప్‍లో.. తాను వ్యాపారం ప్రారంభిస్తున్నానని ఆశీర్వదించాలని జగదీశ్వరి కాళ్లకు మొక్కుతుంది చంద్రకళ. రోడ్డుపై చంద్రను ఆకతాయిలు ఆటపట్టిస్తారు. విరాట్ అడ్డుకుంటాడు. నేను రాకపోతే ఏం జరిగి ఉండేదో తెలుసా అంటాడు. ఏం జరిగి ఉండేది అని.. ఆ ఆకతాయిలను చంద్ర చితకబాదేస్తుంది. దీంతో విరాట్ ఆశ్చర్యపోతాడు.
సంబంధిత కథనం