నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కాఫీలో శాలిని విషం కలుపుతుంది. ఆ కాఫీని చంద్రకళ తాగుతుంది. మరోవైపు విరాట్‌కు క్లైంట్ అర్జంట్‌గా ఫైల్ పంపించమని అడుగుతాడు. ఆ ఫైల్‌ను చంద్రకళకు అప్పగించాను కదా అని అనుకున్న విరాట్ ఆ ఫైల్ ఎప్పుడో పూర్తి అయిపోయింది. మిస్ కమ్యునికేషన్ గ్యాప్ వల్ల పంపండం లేట్ అయిందని, వెంటనే ఆ ఫైల్ పంపిస్తానని విరాట్ చెబుతాడు.
చంద్రకళకు ఆ పని అప్పగించాను. వెళ్లిపోయేముందు పెండింగ్ పనులు పూర్తి చేసి వెళ్లాలి కదా అని చంద్రకళపై చిరాకు పడతాడు. ఆ ఫైల్ ఎక్కడుందో ఏంటో అనుకుని చంద్రకళకు కాల్ చేస్తాడు విరాట్. కానీ, చంద్రకళ ఫోన్ లిఫ్ట్ చేయదు. మరోవైపు చంద్రకళ బెడ్ రూమ్‌కు వెళ్తుంది. సంతోషంగా బెడ్ రూమ్‌లోకి వెళ్లిన చంద్రకళకు అకస్మాత్తుగా తల తిరినట్లు అవుతుంది.
తల పట్టుకుని అటు ఇటు తూగుతుంది. తర్వాత ఒక్కసారిగా కళ్లు తిరిగి కింద పడిపోతుంది. ఎంత లేవాలని ప్రయత్నించిన లేవలేకపోతుంది. కాసేపటికి చంద్రకళ స్పృహ కోల్పోతుంది. అదంతా పక్కనే ఉండి శాలిని గమనిస్తుంది. చంద్రకళ కింద పడిపోవడంతో సంతోషిస్తుంది. నాతోనే పెట్టుకుంటావా. ఇక నుంచి నీకు ఎలాంటి చలనం ఉండదు అని మనసులో అనుకుంటుంది శాలిని.
చంద్రకళ ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో విరాట్ ఫైల్ కోసం ఇంటికి వస్తాడు. బెడ్ రూమ్‌లోకి వెళ్లి ఫైల్ తీసుకుని వెళ్తున్న విరాట్‌కు బెడ్ పక్కన కింద పడి ఉన్న చంద్రకళ కనిపిస్తుంది. చంద్రకళను అలా చూసి షాక్ అవుతాడు విరాట్. ఇప్పటివరకు చంద్రకళ కనిపించట్లేదు అనుకుంటే ఇలా కింద పడిపోయిందా అనుకుంటాడు విరాట్.
చంద్రకళను లేపడానికి విరాట్ ట్రై చేస్తాడు. కానీ, చంద్రకళ మాత్రం లేవదు. దాంతో బెడ్ రూమ్‌లో చంద్రకళను పడుకోబెట్టిన విరాట్ డాక్టర్‌కి కాల్ చేస్తాడు. కాసేపటికి డాక్టర్ వచ్చి చంద్రకళకు చెకప్ చేస్తాడు. ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్ చంద్రకళకు ఫుడ్ పాయిజన్ అయిందని, కాసేపటికి స్పృహలోకి వస్తుందని చెబుతారు. కంగారుపడాల్సిన అవసరం ఏం లేదని, కానీ నైట్ అంతా చంద్రకళను దగ్గరుండి చూసుకోవాలని చెప్పి వెళ్లిపోతారు డాక్టర్.
డాక్టర్ చెప్పినట్లుగానే రాత్రంతా మెళకువగా ఉండి విరాట్ చంద్రకళను చూసుకుంటాడు. చంద్రకళ ఎప్పుడెప్పుడు స్పృహలోకి వస్తుందా అని ఎదురుచూస్తుంటాడు. ఇక మరోవైపు చంద్రకళకు అలా జరగడంపై శృతి, శాలిని, కామాక్షి ఎంజాయ్ చేస్తుంటారు. చంద్రకళకు అసలు ఏమైందని జగదీశ్వరి, క్రాంతి మాత్రం తెగ కంగారుపడుతుంటారు.
రాత్రంతా నాలుగు గంటలకు ఒకసారి చంద్రకళకు విరాట్ సిరప్ తాగిస్తూ సేవలు చేస్తుంటాడు విరాట్. ఇక ఉదయం చంద్రకళ నిద్రలో నుంచి లేస్తుంది. చంద్రకళ స్పృహలోకి వస్తుంది. బాడీ అంతా ఏదోలా ఉంది, అసలు నాకు ఏమైంది అని చంద్రకళ అడుగుతుంది. ఫుడ్ పాయిజన్ అయిందని విరాట్ చెబుతాడు. అసలు నేను ఫుడే తినలేదు కదా అని మనసులో చంద్రకళ అనుకుంటుంది.
ఏం తినకుండా ఫుడ్ పాయిజన్ ఎలా అవుతుంది, నేను తాగింది ఒక్క కాఫీ మాత్రమే. అది కూడా నేనే కలుపుకున్నాను. ఎలా ఫుడ్ పాయిజన్ అవుతుంది అని చంద్రకళ అనుమానంగా ఆలోచిస్తుంది. చంద్రకళ స్పృహలోకి వచ్చిందని తల్లికి విరాట్ చెబుతాడు. దాంతో జగదీశ్వరి చంద్రకళను చూసి రిలాక్స్ అవుతుంది. చంద్రకళ క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడిందని అనుకుంటుంది.
ఇక చంద్రకళ నిద్ర లేవడంతో శాలిని షాక్ అవుతుంది. నేను ఇచ్చిన విషం పక్షవాతం వచ్చేలా చేస్తుందని వాడు పాయిజన్ ఇచ్చినవాడు చెప్పాడు. కానీ, చంద్రకళ మాత్రం ఏం జరగనట్లు స్పృహలోకి వచ్చిందేంటీ అని షాలిని అవాక్కవుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్