నిన్ను కోరి మే 17 ఎపిసోడ్: కాఫీలో విషం కలిపిన శాలిని- చంద్రకళకు పక్షవాతం- కిందపడబోయిన కామాక్షి- శ్రుతికి కౌంటర్-ninnu kori serial today episode may 17th 2025 shalini poisoned to chandrakala to get paralysis star maa jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నిన్ను కోరి మే 17 ఎపిసోడ్: కాఫీలో విషం కలిపిన శాలిని- చంద్రకళకు పక్షవాతం- కిందపడబోయిన కామాక్షి- శ్రుతికి కౌంటర్

నిన్ను కోరి మే 17 ఎపిసోడ్: కాఫీలో విషం కలిపిన శాలిని- చంద్రకళకు పక్షవాతం- కిందపడబోయిన కామాక్షి- శ్రుతికి కౌంటర్

Sanjiv Kumar HT Telugu

నిన్ను కోరి సీరియల్ మే 17 ఎపిసోడ్‌లో విరాట్ షర్ట్ మారుస్తుంది చంద్రకళ. దాంతో అదే వేసుకుని ఆఫీస్‌కు వెళ్తాడు విరాట్. చంద్రకళ పచ్చళ్ల బిజినెస్‌పై జగదీశ్వరి ఏమనంకుండా సైలెంట్‌గా ఒప్పుకుంటుంది. పాయిజన్ తీసుకొచ్చిన శాలిని చంద్రకళ కాఫీలో కలుపుతుంది. అది తాగిన చంద్ర పక్షవాతం వచ్చినట్లుగా పడిపోతుంది.

నిన్ను కోరి సీరియల్ మే 17 ఎపిసోడ్‌

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో తేరగా తింటున్నాను అని అన్నారుగా మా శ్రీవారు అని పచ్చళ్ల బిజినెస్ చేస్తున్నాను అని చంద్రకళ చెబుతున్నాను. అంటే ఏదైనా జాబ్ చేయాలిగానీ పచ్చళ్ల బిజినెస్ ఏంటీ చీప్‌గా అని శాలిని అంటుంది. అది లేనివాళ్లు చేస్తారు అని శ్రుతి అంటుంది. అయితే, మీరు అదే చేయాలిగా అని చంద్రకళ కౌంటర్ వేస్తుంది.

నాది అనేది ఏముంది

ఏంటా తలపొగరు అని విరాట్ అంటాడు. మాకు అన్నయ్య ఉన్నాడు అని కామాక్షి అంటుంది. అన్నయ్య అనేది రక్త సంబంధం. అది కాకూండా నాది అనేది ఏముంది అని తాళి చూపిస్తూ అంటుంది చంద్రకళ. లేనివాళ్లు లేనివాళ్లు అని మాట్లాడటానికి స్పేస్ లేదని గట్టిగానే అంటుంది చంద్రకళ. అయినా నువ్ ఇది చేయడం చిన్నచూపు అవుతుంది. నేను ఒప్పుకోను అని విరాట్ అంటాడు.

ఒప్పుకోకపోవడానికి మీరెవరు బావగారు. ఇది ఆఫీస్ కాదు. నన్ను ఆఫీస్ నుంచి నాన్సెన్స్ రీజన్ చెప్పి తీసేశారు. ఇక ఈ ఇంటికి నా వంతుగా ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నాను అని చంద్రకళ అంటుంది. ఈ చెత్తంతా ఏంటీ అని శాలిని అంటే.. చిన్న కోడలివి చిన్న కోడలిలా ఉండు చీకో. లేదంటే వీటితో కలిపి స్నాక్స్ చేసి పెడతా అని చంద్రకళ అంటుంది.

దాంతో శాలిని వాళ్లు వెళ్లిపోతారు. నీకు నచ్చింది చేసుకో అని విరాట్ వెళ్తాడు. ఈరోజు మీటింగ్‌కు ఇది పర్ఫెక్ట్ అని ఒక షర్ట్ సెలెక్ట్ చేసుకుని వెళ్లిపోతాడు. నా టేస్ట్ నీ టేస్ట్ వేరా అని విరాట్ సెలెక్ట్ చేసిన షర్ట్ తీసి వేరే పెడుతుంది. బాత్రూమ్ నుంచి వచ్చిన విరాట్ షర్ట్ మారిందని షాక్ అవుతాడు. కాకి ఎత్తుకెళ్లిందని చంద్రకళ అంటుంది. దాంతో నా షర్ట్ ఏమైందని అడుగుతాడు విరాట్.

ఇదొక్కటే ఉంది

ఈ ఒక్క షర్ట్ తప్పా అన్నింటిని వాష్‌కేసాను. కావాలంటే ఈ షర్ట్ వేసుకెళ్లు అని చంద్రకళ అంటుంది. నువ్వించింది అయితే వేసుకోను అని విరాట్ అంటాడు. కబ్ బోర్డ్‌లో చూస్తే ఒక్క షర్ట్ ఉండదు. ఇదొక్కటే బాగుందని చంద్రకళ అంటుంది. అర్జంట్ కాబట్టి తప్పదు అని చంద్రకళ ఇచ్చిన షర్ట్ వేసుకుంటాడు విరాట్. ఇంట్లో పచ్చళ్లు చేస్తుంది చంద్రకళ.

అది చూసిన శాలిని ఇది నట్టింట్లోనే బిజినెస్ పెట్టింది. ఇది ఉంటే నా ఆటలు సాగవు. దీని సంగతి చెబుతా అని శాలిని అనుకుంటుంది. జగదీశ్వరి వచ్చి ఏంటీ ఇదంతా అంటుంది. పచ్చళ్ల వ్యాపారం చేస్తుందని చిరాకుగా చెబుతుంది కామాక్షి. ఇప్పుడు ఇవన్ని చేయాల్సిన అవసరం ఏముంది. మా పరువు తీయడం తప్ప అని జగదీశ్వరి అంటుంది. నాకు ఆత్మాభిమానం ఉందిగా. అందుకే ఏదో ఒక బిజినెస్ చేసి సంపాదించుకోవాలనుకున్నాను అని చంద్రకళ అంటుంది.

బయట జాబ్ చేసుకోవచ్చు. కానీ, నాకు బావకి పెళ్లి అయినట్లు అంతా తెలిసింది. మీకే ఆఫీస్ ఉండగా ఇక్కడ జాబ్ ఎందుకు చేస్తున్నారు అని అడిగితే.. బావతో గొడవ అయింది. అందుకే పని చేస్తున్నాను చెబితే పరువు పోదా. దానికంటే గుట్టుగా ఇది చేసుకుంది బెటర్ కదా అని చంద్రకళ అంటుంది. నువ్వే ఏదో ఒకటి చేయి అని కామాక్షి అంటే.. ఎవరికి నచ్చింది వారి చేసి ఏడవండి అని జగదీశ్వరి అంటుంది.

పాయిజన్ తీసుకున్న శాలిని

తర్వాత కామాక్షి, శ్రుతి కూడా పనిచేస్తే రోజు కూలీ ఇస్తానంటుంది చంద్రకళ. తర్వాత శాలిని బయటకు వెళ్లి ఓ వ్యక్తి నుంచి పాయిజన్ బాటిల్ తీసుకుంటుంది. ఒక 20 ఎమ్ఎల్ నీళ్లలో, ఏదైనా డ్రింక్‌లో కలిపి ఇస్తే ఎవ్వరు నమ్మలేరు. బాడీలోకి వెళ్లిన అరగంటలో పక్షవాతం వస్తుంది. ఎవరికి అనుమానం రాదు అని అతను చెబుతాడు. నాకు ఇదే కావాలి. మావయ్యకు జరిగినదానికి దేవుడే దానికి ఈ శిక్ష వేశాడు అనుకోవాలి అని పాయిజన్ తీసుకుంటుంది శాలిని.

మరోవైపు చంద్ర పచ్చడి చేస్తున్న దగ్గర నడుస్తూ కామాక్షి పడబోతుంటే శ్రుతి పట్టుకుంటుంది. జాగ్రత్త పిన్నిగారు హైటు వేటు రెండు ఎక్కువే అని చంద్రకళ అంటుంది. తర్వాత పనికి వచ్చినవాళ్లకు చంద్రకళ కాఫీ ఇస్తుంది. ఒక కాఫీని టేబుల్‌పై పెడుతుంది. దాంట్లో ఎవరు చూడకుండా శాలిని విషం కలుపి వెళ్లిపోతుంది. ఆ కాఫీని చంద్రకళ తాగుతుంది.

తననే చూస్తున్న శాలినిని ఎందుకు అలా చూస్తున్నారని అడుగుతుంది చంద్రకళ. నిన్ను అలా చూస్తుంటే పనిదానిలాగే ఉన్నావ్ అని శాలిని అంటుంది. మనకోసం పనివాళ్లలా చేస్తేనే సక్సెస్ అవుతాం అని చంద్ర అంటుంది. తర్వాత కాసేపటికి చంద్రకళకు కళ్లు తిరుగుతాయి.

చంద్రకు పక్షవాతం

కళ్లు తిరిగి స్పృహ తప్పి బెడ్‌పై పడిపోతుంది చంద్రకళ. ఎంత లేవాలనుకున్న లేవలేదు. పక్షవాతం వచ్చినట్లుగా పడిపోతుంది చంద్రకళ. అది చూసి శాలిని సంతోషిస్తుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం