నిన్ను కోరి మే 16 ఎపిసోడ్: జగదీశ్వరిని కాపాడిన చంద్రకళ- నోరు జారిన విరాట్- చంద్ర పచ్చళ్ల బిజినెస్-విషం పెట్టనున్న శాలిని-ninnu kori serial today episode may 16th 2025 chandrakala saves jagadeeshwari virat lost his control star maa jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నిన్ను కోరి మే 16 ఎపిసోడ్: జగదీశ్వరిని కాపాడిన చంద్రకళ- నోరు జారిన విరాట్- చంద్ర పచ్చళ్ల బిజినెస్-విషం పెట్టనున్న శాలిని

నిన్ను కోరి మే 16 ఎపిసోడ్: జగదీశ్వరిని కాపాడిన చంద్రకళ- నోరు జారిన విరాట్- చంద్ర పచ్చళ్ల బిజినెస్-విషం పెట్టనున్న శాలిని

Sanjiv Kumar HT Telugu

నిన్ను కోరి సీరియల్ మే 16 ఎపిసోడ్‌లో కిందపడుతున్న జగదీశ్వరిని చంద్రకళ పట్టుకుని కాపాడుతుంది. కానీ, తనను తాకినందుకు చచ్చిపోవాలనిపిస్తుందని జగదీశ్వరి వెళ్తుంది. అది చూసి సిగ్గుండాలి అంటూ చంద్రకళను తిడతాడు విరాట్. ఇక చంద్ర పచ్చళ్ల బిజినెస్ పెడుతున్నట్లు అందరికి చెబుతుంది.

నిన్ను కోరి సీరియల్ మే 16 ఎపిసోడ్‌

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళకు సుభద్ర కాల్ చేసి సారే గురించి చెబుతుంది. ఇప్పుడు సారే తెస్తే ఇంట్లో మరింత గొడవ అవుతుందమ్మా అని చంద్రకళ అంటుంది. ఏమైందమ్మా అని సుభద్ర అడుగుతుంది. విరాట్ బావ నన్ను జాబ్ నుంచి తీసేశారు అమ్మా అని చెబుతుంది చంద్రకళ.

శాలిని తప్పా

అయ్యో అవునా.. అలా ఎందుకు చేశారు. నేను వచ్చి ఇంట్లో మాట్లాడనా అని సుభద్ర అంటుంది. నువ్వేం వచ్చి మాట్లాడకు. ఏం చేయకు. నేను చూసుకుంటాను అని చంద్రకళ చెబుతుంది. ఇక తర్వాత ఇంట్లో అంతా భోజనం చేయడానికి రెడీ అవుతారు. ఇంట్లో శాలిని తప్ప మిగతా అంతా భోజనం చేస్తుంటారు.

చంద్రకళ చేసిన దానికి కోపంతో రగిలిపోతుంది శాలిని. దీనికి సరైన గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది. ఇక చంద్రకళ మాత్రం తినకుండా విరాట్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. విరాట్ బావ వచ్చేకా తాను భోజనం చేస్తానంటుంది. భర్త వచ్చి తిన్నాకే భార్య తినాలని అందరికీ చెబుతుంది చంద్రకళ. తర్వాత భోజనం చేసి జగదీశ్వరి వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్తుంది.

చచ్చిపోవాలనిపిస్తుంది

కానీ, ఇంతలో స్లిప్ అయి జగదీశ్వరి కింద పడబోతుంటుంది. అది గమనించిన చంద్రకళ అత్తయ్య జగదీశ్వరిని పట్టుకుని ప్రాణాలు కాపాడుతుంది. అత్తయ్య జాగ్రత్త అని చంద్రకళ చెబుతుంది. అప్పుడే విరాట్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. తల్లి పడిపోవడం, చంద్ర పట్టుకోవడం చూసి షాక్ అవుతాడు. క్రాంతి కూడా వస్తాడు. కానీ, విరాట్‌పై జగదీశ్వరి కోప్పడుతుంది.

తర్వాత మనుషులకు అయితే ఒక్కసారి చెబుతారు. కొంతమంది మనుషులను చూసిన తాకిన చచ్చిపోవాలనిపిస్తుంది అని కోపంగా అంటుంది జగదీశ్వరి. దాంతో అంతా షాక్ అవుతారు. అటు చంద్రకళను, ఇటు విరాట్‌ను ఇద్దరి తిట్టేస్తుంది. క్షమించమ్మా అని విరాట్ అంటాడు. కానీ, జగదీశ్వరి మాత్రం ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంది. అప్పుడు చంద్రకళపై విరాట్ ఫైర్ అవుతాడు.

సిగ్గుండాలి దానికి

ఏం చంద్ర ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా. నీ వల్లే మా అమ్మ నాతో మాట్లాడట్లేదు అని విరాట్ అంటాడు. ఫ్రెష్ అప్ అయి రా బావా డిన్నర్ వడ్డిస్తాను అని చంద్రకళ అంటుంది. సిగ్గుండాలి ఆ మాట అనడానికి అని నోరు జారుతాడు విరాట్. దాంతో చంద్రకళ షాక్ అవుతుంది. శాలిని, కామాక్షి మాత్రం సంతోషిస్తారు. నువ్ తిను చంద్ర. కడుపు నిండా తిను. తేరగా వస్తుంది కదా అని విరాట్ అంటాడు.

దాంతో చంద్రకళ మరింత బాధపడుతుంది. తనను విరాట్ అనేసరికి శ్రుతి సంబరపడిపోతుంది. ఏ పని చేయకుండా నీకు ఐదు వేళ్లు నోట్లోకి వెళ్తున్నాయి కదా. నీకు అన్ని ఫ్రీగానే వస్తున్నాయి కదా. ఎంజాయ్ యువర్ డిన్నర్ అని విరాట్ చెప్పేసి వెళ్తాడు. భోజనం చేయుకుండానే వెళ్తాడు. దాంతో చంద్రకళ బాధగా తినకుండా వెళ్లిపోతుంది. ఇక చంద్రకళ తినకుండా పడుకుంటుంది.

చంద్రకళకు విషం

అది చూసి భోజనం చేయమని విరాట్ చెబుతాడు. నీలో ప్రేమికుడు బయటకు వచ్చాడా అని చంద్రకళ అంటుంది. దాంతో ఎన్ని రోజులు భోజనం చేయకుండా ఉంటావో అది చూస్తాను అని విరాట్ అంటాడు. మరోవైపు శాలిని కోపంగా తిరుగుతూ ఉంటుంది. తర్వాత ఓ వ్యక్తికి ఫోన్ చేసి పాయిజన్ అడుగుతుంది. ఆ విషంను చంద్రకళకు పెట్టాలని శాలిని ప్లాన్ చేస్తుంది.

ఇక మరుసటి రోజు ఉదయం ఇంట్లో చంద్రకళ కనిపించకపోయేసరికి అంతా కంగారుపడుతారు. ఇంతలో చంద్ర ఇద్దరు పనిమనుషులతో రావడం చూసి షాక్ అవుతారు. మామిడి, నిమ్మ కాయలు తీసుకొచ్చిన చంద్ర పచ్చళ్ల బిజినెస్ పెడుతున్నాను అని చెబుతుంది. దాంతో అంతా అవాక్కవుతారు. నా కాళ్ల మీద నేను నిలబడతాను అని చంద్రకళ అందరితో చెబుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం