నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో క్రాంతిని అన్‌ఫిట్ అంటూ శాలిని ఫైర్ అవుతుంది. దాంతో చంద్రకళ కలుగ జేసుకుని క్రాంతి నీకు తాళి కట్టిన భర్త. మాటలు జాగ్రత్తగా మాట్లాడు అని అంటుంది. నాలుక కంట్రోల్‌లో ఉంచుకో అని చెబుతుంది. నా భర్తను అంటే నీకేంటీ అని శాలిని అంటుంది.
ఈ ఇంటి పెద్ద కోడలిని. ఈ ఇంటి మర్యాదకు భంగం కలిగితే ఊరుకోను అని చెప్పేదాన్ని. భర్తకు ఎలా గౌరవం ఇవ్వాలో తెలుసా నీకా. ఏదైనా భార్యాభర్తలు ఇద్దరూ తప్పు భరించాల్సిందే. అసలు ఆఫీస్ పెట్టిందే నీ వల్ల. క్రాంతి మెతక మనిషి అని తెలియదా. నువ్వే కదా సపోర్ట్ చేయాల్సింది. అలాంటిది తప్పంతా నీదే అని ముందుకు తోస్తున్నావ్ అని చంద్రకళ అంటుంది.
తర్వాత కావాలని చేస్తే తప్పు. మనకు తెలియకుండా జరిగితే మన తప్పు ఎంతమాత్రం కాదు. కాబట్టి మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. మాట పడాల్సిన అంత అవసరం లేదు. ఇంత మెతక్కా ఉండకు క్రాంతి. ఉంటే బతకనివ్వరు అని సలహా ఇచ్చి వెళ్లిపోతుంది చంద్రకళ. మరోవైపు ఆఫీస్‌లో ఆది స్టాఫ్ అందరితో విరాట్‌కి పెళ్లి అయిందని చెబుతాడు. కానీ, విష్ చేయొద్దని చెప్పాలనుకుని కాల్ వస్తే వెళ్లిపోతాడు.
దాంతో ఆఫీస్ స్టాఫ్ అంతా విరాట్‌కు బొకేలతో విష్ చేయాలని అనుకుంటారు. ఇంతలో వరాట్ వస్తే అంతా బొకేలు ఇచ్చి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెబుతారు. దాంతో కోప్పడిన విరాట్ మీకు పెళ్లి అయిందని ఎవరు చెప్పారని అడిగితే.. మీ బెస్ట్ ఫ్రెండ్ ఆది అని స్టాఫ్ అంతా అంటారు. అలా విరాట్ బెస్ట్ ఫ్రెండ్ కొంప ముంచాడని విరాట్ అనుకుంటాడు.
తర్వాత బొకేలు ఇచ్చిన స్టాఫ్ అంతా పార్టీ అడుగుతారు. తర్వాత మధ్యలో అడ్డుకుని విరాట్‌ను వెళ్లమంటాడు ఆది. నీతో చాలా పని ఉంది రా అని కోపంగా వెళ్లిపోతాడు విరాట్. తర్వాత ఏంట్రా ఇది అని ఆదిని నిలదీస్తాడు విరాట్. తప్పుగా అనుకుంటారు అని ఏదో చేస్తే ఇలా జరిగిందని ఆది చెబుతాడు. ఫూలిష్‌గా లేదని తిడతాడు. శిక్ష వేద్దామని తాళి కడితే అదే నాకు సమస్యగా మారింది అని విరాట్ అంటాడు.
తర్వాత చంద్రకళను పిలవమని ఆదికి చెబుతాడు. దాంతో చంద్రకళను ఆది పిలుస్తాడు. దాంతో క్యాబిన్‌లోకి బావ గారు పిలిచారంటా అని చంద్రకళ వెళ్తుంది. ఇంకా ఆఫీస్‌లో అలా పిలిచే అవకాశం లేదులే. నీ సస్పెన్షన్ లెటర్ అని జాబ్ మానేయమని చెబుతాడు విరాట్. కారణం ఏంటని చంద్రకళ అడిగితే.. అసలు కారణం మీకు తెలుసు. కానీ, ఆఫీస్ కారణం ఏంటంటే గత మూడు రోజులుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రావట్లేదు అని విరాట్ చెబుతాడు.
థ్యాంక్యూ అని సస్పెన్షన్ ఆర్డర్ తీసుకుని చంద్రకళ వెళ్లిపోతుంది. మరోవైపు ఆఫీస్‌లో పెనుమార్పులు జరిగాయట కదా అని శాలిని అంటుంది. జాబ్‌లో నుంచి తీసేశారట కదా. ఇప్పటికైనా నీ విలువ ఏంటో అర్థమైందా అని శాలిని అంటుంది. రేపు ఇంట్లోంచి గెంటేస్తాడు. నీకు చీము నెత్తురు లేదనుకుంటా. మొహం మీద ఉమ్మేసిన తుడుచుకుని వెళ్లిపోతావేమో. పెంపకం అలాంటిది అని తల్లి, తండ్రి గురించి మాటలు అంటుంది శాలిని.
దాంతో కోపంగా శాలిని ఒక్కటి లాగి పెట్టి కొడుతుంది చంద్రకళ. అదంతా పై నుంచి కామాక్షి, శ్రుతి చూసి షాక్ అవుతారు. ఇంకొక్కమాట మా అమ్మ గురించి మాట్లాడితే నాలుక తెగి నేలపై పడుతుంది అని వార్నింగ్ ఇస్తుంది చంద్రకళ. నన్నే కొడతావా అని శాలిని చేయి చేసుకోబోతుంటే చేయి పట్టుకుని ఆపి వెనక్కి మెలిపెడుతుంది చంద్రకళ. దాంతో శాలిని విలవిల్లాడిపోతుంది.
బావ ఇబ్బందిగా ఫీల్ అవుతాడని నేను వచ్చేశాను. నా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడితే ఇదే హాల్‌లో ఉరేస్తాను అని చంద్రకళ అంటుంది. ఇది ఎక్కువ చేస్తుంది. ఏదోటి చేయాలి అని శ్రుతి అంటుంది. అన్ని హక్కులున్న శాలినినే ఆడుకుంటుంది. ఇక మన పరిస్థితే ఏంటో అని కామాక్షి భయపడుతుంది. మరోవైపు విరాట్ దగ్గరికి ఆది వచ్చి చంద్రకళని జాబ్‌లో నుంచి ఛీప్ కారణం చెప్పి తీసేయడం కరెక్ట్ కాదు అని చెబుతాడు.
రేపటి నుంచి చంద్రకళ వర్క్ నువ్ చేయు. నీ జాబ్‌లో ఇంకొకరిని చూడు అని విరాట్ అంటాడు. నేను చంద్రకళ పని చేయలేను అని ఆది అంటాడు. మరోవైపు నన్ను జాబ్ నుంచి తీసేశాడు. అలా ఎలా దిగజారిపోయాడు అని చంద్రకళ అనుకుంటుంది. ఇంతలో సుభద్ర చంద్రకళకి కాల్ చేసి సారే తీసుకొస్తాను అంటుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్