నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ మే 14: విరాట్‍తో సారీ చెప్పించుకున్న చంద్ర.. ముగ్గురికి వార్నింగ్.. శాలినీకి చెంపదెబ్బ-ninnu kori serial today episode may 14th 2025 chandrakala tempts virat and she warns shruti star maa tv jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ మే 14: విరాట్‍తో సారీ చెప్పించుకున్న చంద్ర.. ముగ్గురికి వార్నింగ్.. శాలినీకి చెంపదెబ్బ

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ మే 14: విరాట్‍తో సారీ చెప్పించుకున్న చంద్ర.. ముగ్గురికి వార్నింగ్.. శాలినీకి చెంపదెబ్బ

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ మే 14: విరాట్‍ను బెడ్‍రూమ్‍లో కవ్విస్తుంది చంద్రకళ. శృతి, కామాక్షి, శాలినీకి పొగపెట్టి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. నీళ్లు ఆపేసి స్నానానికి వెళ్లిన విరాట్‍ను చంద్ర ఆటపట్టిస్తుంది. నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఇవే..

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ మే 14: చంద్రకు సారీ చెప్పిన విరాట్.. దుష్టత్రయానికి వార్నింగ్.. శాలినీని కొట్టిన చంద్ర

నిన్ను కోరి సీరియల్ నేటి మే 14వ తేదీన ఎపిసోడ్‍లో.. రాత్రి విరాట్ బెడ్‍రూమ్‍లోకి చంద్రకళ వస్తుంది. తలకు మల్లెపూలు పెట్టుకొని అందంగా రెడీ అయి ఉంటుంది. వెళ్లిపో అని విరాట్ అంటాడు. పెళ్లయ్యాక భర్త ఏ గదిలో ఉంటే.. భార్య అక్కడే ఉండాలని, నేను రూమ్ వదిలి వెళ్లను అని చంద్ర తేల్చిచెబుతుంది. ఇద్దరి మధ్య మాటలు సాగుతాయి. కోపంలో అమ్మాయిలు మాత్రమే అందంగా ఉంటారని ఎవరో చెప్పారని, అబ్బాయిలు కూడా కోపంలో కత్తిలా ఉంటారని చంద్ర అంటుంది. బయటికి వెళ్లు అని చిరాకు పడతాడు విరాట్.

విరాట్‍ను రెచ్చిగొట్టిన చంద్రకళ

సోఫాపై పడుకుంటా బయటికి వెళ్లను అని చంద్రకళ అంటుంది. సోఫాపై అలా వాలిపోయి అందంగా పడుకుంటుంది. విరాట్‍ను కవ్విచేందుకు ప్రయత్నిస్తుంది. చంద్రను విరాట్ తదేకంగా రొమాంటిక్‍గా చూస్తాడు. చంద్ర బుక్ చదువుతుంటే చూస్తూ ఉంటాడు విరాట్. చంద్ర చూడగాని చూపు తిప్పుకుంటాడు. కంగారు పడతాడు.

ధూపంతో బెదరగొట్టిన చంద్ర.. గట్టి వార్నింగ్

చంద్రకళ ఉదయాన్నే లేచి పూజ చేస్తుంది. ధూపం పెడుతుంది. హారతి ఇచ్చేందుకు వెళితే జగదీశ్వరి తీసుకోదు. శృతి, కామాక్షి, శాలినీ.. మళ్లీ చంద్రపై నోరుపారేసుకొని మాటలు అంటారు. ధూపంతో వారికి పొగబెడుతుంది చంద్ర. దుష్టత్రయం అంటూ ఆ ముగ్గురికి కౌంటర్లు ఇస్తుంది. తనలోని లావాను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మానుకోండి అని చంద్ర వార్నింగ్ ఇస్తుంది. దుష్టశక్తులు పోయేందుకు తన వద్ద చిట్కా ఉందని అంటుంది. దూపంలో పొగ ఎక్కువగా పెట్టి శృతి, కామాక్షి, శాలినీపై వదులుతుంది. ముగ్గురూ దగ్గుతూ ఇబ్బందులు పడతారు.

బెడ్‍రూమ్‍కు వెళ్లి దూపం వేస్తుంది చంద్ర. దీంతో విరాట్ నిద్రలేస్తాడు. చిరాకు పడతాడు. రాత్రి మీ చూపుల మాట ఏంటి అని చంద్ర అడుగుతుంది. నేను చూడలేదు అంటూ కవర్ చేసుకుంటాడు విరాట్. రఘురాంను గది నుంచి బయటికి తీసుకొస్తుంది జగదీశ్వరి.

నీళ్లు ఆపేసిన చంద్ర

విరాట్ ఆఫీస్‍కు రెడీ అవుతుంటాడు. షర్ట్ సెలెక్ట్ చేసి ఇస్తుంది చంద్ర. తాను అది వేసుకొనని చెప్పి స్నానానికి వెళతాడు విరాట్. నానా మాటలు అంటాడు. పట్టపగలే చుక్కలు చూపిస్తా బావా అని చంద్ర అనుకుంటుంది. బాత్‍రూమ్‍లో నీళ్లు రాకుండా వాల్ తిప్పేస్తుంది చంద్ర. విరాట్‍ను ఆటపట్టిస్తుంది. నీళ్లు ఆగిపోవడంతో విరాట్ కంగారు పడతాడు. ఎవరైనా ఉన్నారా అంటే.. ఎవరూ లేరని చంద్ర అంటుంది. నీళ్లు ఎందుకు రావడం లేదంటే.. నేనే వాల్ కట్టేశా అని చంద్ర అంటుంది.

క్షమాపణ చెప్పిన విరాట్

ఇందాక మీరు అన్న మాటలకు సారీ చెబితే నీళ్లు వచ్చేలా చేస్తానని చంద్ర డిమాండ్ చేస్తుంది. ముందు బెట్టు చేసిన విరాట్.. ఆ తర్వాత కవితాత్మకంగా క్షమాపణలు చెబుతాడు. తనకు సింపుల్‍గా సారీ చెప్పాలని చంద్ర మళ్లీ అడుగుతుంది. సారీ చంద్ర అని చిరాకుగానే చెబుతాడు విరాట్. దీంతో వాటర్ వదులుతుంది చంద్ర.

స్పాన్సర్‌షిప్ క్యాన్సిల్ అయిందని ఫోన్‍లో కోపంగా మాట్లాడుతుంది శాలినీ. ఏమైందని క్రాంతి అడుగుతాడు. క్రాంతిని కోపంగా తిట్టేస్తుంది శాలినీ. స్పాన్సర్‌షిప్ క్యాన్సిల్ అయిందని, నిర్లక్ష్యంతో పని చేస్తున్నావని తిడుతుంది. కామన్‍సెన్స్ లేదా అంటూ కోప్పడుతుంది. దీంతో భర్త అని కూడా చూడకుండా తిట్టిన శాలినీపై చంద్ర కోప్పడుతుంది.

శాలినీకి చంద్ర చెంపదెబ్బ

కమింగ్ అప్‍లో.. చంద్రకు సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తాడు విరాట్. కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని చంద్ర అంటే.. మనద్దరికీ తెలుసు కదా అంటాడు విరాట్. చంద్రపై శాలినీ నోరు పారేసుకుంటుంది. సిగ్గు లేకుండా బతుకు అంటూ నానా మాటలు అంటుంది. దీంతో శాలినీని చెంపదెబ్బ కొడుతుంది చంద్ర.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం