నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ మే 13: ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకున్న విరాట్, చంద్ర.. జగదీశ్వర్ ఆగ్రహం-ninnu kori serial today episode may 13th 2025 virat chandrakala challenges each other star maa jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ మే 13: ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకున్న విరాట్, చంద్ర.. జగదీశ్వర్ ఆగ్రహం

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ మే 13: ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకున్న విరాట్, చంద్ర.. జగదీశ్వర్ ఆగ్రహం

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ మే 13: ఇంట్లో నుంచి నువ్వే వెళ్లిపోతావ్ అనేలా చంద్రకళతో విరాట్ అంటాడు. రఘురాం దగ్గరికి వెళ్లిన చంద్రపై జగదీశ్వరి ఆగ్రహిస్తుంది. కామాక్షి, శృతి, షాలినీకి చంద్ర గట్టి కౌంటర్లు ఇస్తుంది.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ మే 13: ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకున్న విరాట్, చంద్ర.. జగదీశ్వర్ ఆగ్రహం

నిన్ను కోరి సీరియల్ నేటి మే 13వ తేదీన ఎపిసోడ్‍లో.. కట్టుబట్టలతో ఇంటి నుంచి వచ్చా కదా.. కొత్త డ్రెస్‍లు కొనుకున్నానని చంద్రకళ చూపిస్తుంది. ఛీ అంటూ చిరాకు డపడతాడు విరాట్. దుస్తులు ఛీపే.. నీ భార్యగా సేవింగ్స్ మొదలుపెట్టేశానని చంద్ర అంటుంది. నువ్వు ఊ అను విరాట్.. దీన్ని.. అని కామాక్షి కోపంగా ఉంటుంది. ఏం చేస్తావ్ అంటూ మీదమీదకు వెళుతుంది చంద్రకళ.

విరాట్ గదిలో చంద్ర.. తాళితో శిక్ష వేశా

విరాట్ బెడ్‍రూమ్‍లో తన దుస్తులు వస్తువులు సర్దుతుంది చంద్రకళ. రూమ్ షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదని అంటాడు. నా ఇష్టంతోనే మెడలతో తాళి కట్టారా అని చంద్ర అడుగుతుంది. శ్రీవారు, బావగారు, అయ్యగారు అంటూ కొంటెగా మాట్లాడుతుంది. గిల్లుతుంది. నన్ను బావ అనొద్దని విరాట్ అంటాడు. అప్పట్లో అలా పిలమనేవాడివి కదా అని చంద్ర అంటే.. అప్పుడు నీ మనస్తత్వం వేరు అని విరాట్ చెబుతాడు. దీంతో చంద్ర ఫీల్ అవుతుంది. అలాగే ఉన్నానని అంటుంది. నువ్వు ఎంత ప్రయత్నించినా మనసు మారదని విరాట్ అంటుంది. నేను తప్పు చేయలేదు, నా తప్పు లేదని నిరూపిస్తాననేలా చంద్ర మాట్లాడుతుంది. నీ మెడలో తాళి కట్టి శిక్ష వేశానని విరాట్ అంటాడు. భార్యగా గదిలోకి వచ్చినా.. తిరిగి నా మనసులోకి రాలేవని చెబుతాడు.

ఛాలెంజ్ చేసుకున్న విరాట్, చంద్ర

ఈ ఇంట్లో నిన్ను ఎవరూ పట్టించుకోరని విరాట్ అంటాడు. “ఇది నీకే అర్థమై.. నీ అంతట నువ్వే ఇంట్లో నుంచి నా జీవితంలో నుంచి వెళ్లిపోతావ్” అని ఛాలెంజ్ చేసినట్టుగా మాట్లాడతాడు విరాట్. “నువ్వు నన్ను ఎలా చూసినా నేను ఇంట్లో నుంచి వెళ్లను. ఇష్టం లేని తాళినే భరించిన గుండె బావ నాది. ఇష్టమైన మనిషి తాళి కడితే ఓ గుండె ఎంత ఓపిక తెచ్చుకుంటుందో నువ్వు ఆలోచించు” అని చంద్ర కూడా స్వీట్ ఛాలెంజ్ చేస్తుంది. తాను ఇంట్లోనే ఉంటాననేలా మాట్లాడుతుంది.

చంద్ర గురించి సౌజన్య దిగులు చేస్తుంటుంది. ఆ తర్వాత ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్నావ్, విరాట్ కోపం తగ్గిందా.. జగదీశ్వరి క్షమించిందా అని అడుగుతుంది. కాస్త టైమ్ పడుతుందని చంద్ర అంటుంది. తాను అన్నీ చూసుకుంటానని చెబుతుంది.

రఘురాం దగ్గర కూర్చొని చంద్ర వేదన

కోమాలో ఉండి మంచంపై ఉన్న రఘురాం దగ్గరికి చంద్రకళ వస్తుంది. మీరు కోలుకుంటేనే అందరికీ నిజాలు తెస్తాయని కన్నీళ్లతో అంటుంది. మీతో వస్తానని నేను అడిగినప్పుడు ఆరోజు ఆపకపోయి ఉంటే బాగుండేదని ఆలోచిస్తుంది. మీరు ఎంత త్వరగా కోలుకుంటే అంత త్వరగా నా జీవితం బాగుపడుతుందని కన్నీళ్లతో తనతో తానే మాట్లాడుకుంటుంది.

చంద్రపై జగదీశ్వరి ఫైర్

రఘురాం దగ్గర చంద్రకళ ఉండడాన్ని చూసి జగదీశ్వరి కోప్పడుతుంది. మామయ్య ఎలా ఉన్నారో చూద్దామని వచ్చానని చంద్ర అంటుంది. నీ వల్లే ఆయనకు ఈ గతి పట్టింది.. ఈ నాలుగు గోడల మధ్య కూడా ఆయనను ప్రశాంతంగా ఉండనివ్వవా అని ఆగ్రహిస్తుంది. ఇంట్లో ఎక్కడైనా ఉండు కానీ.. ఇక్కడికి రావొద్దని చిరాకుగా ఉంటుంది. నా భర్త వద్దకు రావొద్దని కోపంగా చేతులు జోడించి చెబుతుంది. చంద్ర బాధపడుతూ వెళుతుంది.

మిమ్మల్నే గెంటేస్తా

నిన్ను ఇంట్లో నుంచి ఎలాగైనా పంపిస్తానని చంద్రతో శృతి పొగరుగా మాట్లాడుతుంది. అత్తయ్య బాగా వడ్డించేసినట్టు ఉన్నారని వెటకరిస్తుంది. కామాక్షి, షాలిని కూడా నానామాటలు అంటారు. చంద్ర వారికి గట్టిగా కౌంటర్లు వేస్తుంది. వారిని దృష్టత్రయం అంటూ పంచ్ వేస్తుంది. ఇది చంద్ర వెర్షన్ 2.0 అని అంటుంది. నన్ను ఏమీ చేయలేరని చంద్ర చెబుతుంది. బావ, అత్త మనసులను మారుస్తానని, అందుకు అవసరమైతే మిమ్మల్నే బయటికి గెంటేస్తానని అంటుంది. నిన్ను కాదులే అని శృతిని ఉద్దేశించి అంటుంది. మాటలు అలాగే సాగుతాయి.

చంద్రవైపు విరాట్ రొమాంటిక్ చూపు

రాత్రి విరాట్ బెడ్‍రూమ్‍లోకి వస్తుంది చంద్రకళ. ఇక్కడి ఎందుకు వచ్చావని విరాట్ కంగారు పడతాడు. నేను సోఫాలో పడుకుంటా కానీ.. బయటికి వెళ్లమని మాత్రం చెప్పొద్దని చంద్ర అంటుంది. సోఫాలో అలా వాలి పడుకుంటుంది. చంద్రను రొమాంటిక్‍గా చూస్తాడు విరాట్.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం