నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ జూన్ 6: విరాట్, చంద్రకు నల్లపూసల వేడుక.. ఓకే చెప్పిన జగదీశ్వరి.. అడ్డుకునేందుకు ప్లాన్-ninnu kori serial today episode june 6th 2025 nallapoosala function for chandra and virat kamakshi new plan star maa tv ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ జూన్ 6: విరాట్, చంద్రకు నల్లపూసల వేడుక.. ఓకే చెప్పిన జగదీశ్వరి.. అడ్డుకునేందుకు ప్లాన్

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ జూన్ 6: విరాట్, చంద్రకు నల్లపూసల వేడుక.. ఓకే చెప్పిన జగదీశ్వరి.. అడ్డుకునేందుకు ప్లాన్

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ జూన్ 6: విరాట్ తన భార్య అని పోలీసుల వద్ద విరాట్ చెబుతాడు. విరాట్ పడబోతుంటే చంద్ర పట్టుకుంటుంది. శ్యామల ప్రశంసలు కురిపిస్తుంది. చంద్రకు నల్లపూసల వేడుక చేద్దామని చెబుతుంది. ఎపిసోడ్ హైలైట్స్ ఇవే..

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ జూన్ 6: విరాట్, చంద్రకు నల్లపూసల వేడుక

నిన్ను కోరి సీరియల్ నేటి (జూన్ 6) ఎపిసోడ్‍లో చంద్రకళతో రాత్రివేళ విరాట్ గొడవ పడుతుంటే పోలీసులు చూస్తారు. కేసు బుక్ చేస్తామని పోలీసులు బెదిరిస్తారు. నేను తెలుసు అని వాళ్లకు చెప్పవే అని చంద్రను విరాట్ అడుగుతాడు. నేను నీ భార్యను అని చెప్పు.. అప్పుడు భర్త అని చెబుతానని చంద్ర అంటుంది. తను నా భార్యే అని పోలీసులకు విరాట్ చెబుతాడు. ఇతడే నా భర్త అని చంద్ర అంటుంది. భర్తను ఇలా లిమిట్స్ లో ఉంచేందుకే ఇలా అని చంద్ర చెప్పడంతో పోలీసులు వెళ్లిపోతారు. చంద్ర, విరాట్ కోసం ఇంట్లో అందరూ ఎదురుచూస్తుంటారు.

విరాట్‍ను పట్టుకున్న చంద్ర

ఇంట్లో వస్తుంటే తడబడి విరాట్ కిందపడబోతాడు. చంద్ర అతడిని పట్టుకుంటుంది. దీంతో చంద్రను శ్యామల ప్రశంసిస్తుంది. మొగుడుపెళ్లాలు ఇలా ఉండాలని చెబుతుంది. నీ మీద చంద్ర ఎంత కేర్ తీసుకుంటుందో చూశావా అని విరాట్‍కు శ్యామల చెబుతుంది. విరాట్ నుంచి చూసి చంద్ర కన్నుకొడుతుంది. ఎందుకు ఇంత లేటైందని చంద్రను శ్యామల అడుగుతుంది. పచ్చళ్ల బిజినెస్ ఊపందుకుందని అందుకే లేటైందని, బండి కూడా ఆగిపోయిందని చంద్ర బదులిస్తుంది. విరాట్ వచ్చాడని చెబుతుంది.

నల్లపూసల ఫంక్షన్.. జగదీశ్వరి ఓకే

చంద్ర మెడలోని పసుపు తాడును చూసి పెళ్లయి ఎన్ని రోజులైందని అడుగుతుంది శ్యామల. 15 రోజులు అయిందని చెబుతుంది చంద్ర. అయితే రేపే 16 రోజుల పండుగ, నల్లపూసలు అల్లేయాలని అని శ్యామల అంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు విరాట్ అంటే.. చేయాల్సిందేనంటుంది శ్యామల. పంతులు గారిని పిలిస్తే నల్లపూసల వేడుక చేద్దామని చెబుతుంది. మామయ్యకు ఇలా ఉన్నప్పుడు అవసరా అని శాలినీ అంటే.. పంచ్‍లు వేస్తుంది శ్యామల. నల్లపూసల వేడుక జరగాల్సిందేనని చెబుతుంది.

విరాట్, చంద్రకళ నల్లపూసల వేడుకకు జగదీశ్వరి కూడా ఓకే చెబుతుంది. పంతులుకు ఫోన్ చేసి రావాలని చెప్పాలని క్రాంతితో అంటుంది. విరాట్, చంద్రకు భోజనం వడ్డించాలని శాలినీకి శ్యామల చెబుతుంది. నల్లపూసల ఫంక్షన్‍కు ఎందుకు ఓకే చెప్పావని విరాట్ అంటే.. ఈ ముచ్చట నేనెందుకు మిస్ చేసుకోవాలని చంద్ర చెబుతుంది. ఇద్దరి మధ్య సరదాగా మాటలు సాగుతాయి.

ఫంక్షన్ జరగకుండా చేస్తా

నల్లపూసల ఫంక్షన్ ఆపేందుకు కామాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. ఏదో ఒకటి చెయ్ అని శృతి అంటుంది. ఇంతలో అక్కడికి శాలినీ వస్తుంది. నల్లపూసల ఫంక్షన్ జరగకుండా చేస్తానని, వేచి చూడండి అని శాలినీ అంటుంది. తన ప్లాన్ ఏంటనేది కామాక్షి, శృతికి చెప్పదు.

ఉదయాన్ని లేచి ఇంటి ముందు ముగ్గు పెడుతుంటుంది చంద్ర. ఇది చూసి శ్యామల మురిసిపోతుంది. ఎందుకో అంత మురిపం అని కామాక్షి అంటుంది. చంద్రను పొడిగి.. కామాక్షి, శాలినీ, శృతికి కౌంటర్లు వేస్తుంది శ్యామల.

బయటికి వెళ్లిన విరాట్

తాను ఆఫీస్‍కు వెళతానని విరాట్ అంటాడు. నల్లపూసల వేడుకకు ఎలా రారో నేనూ చూస్తానని చంద్ర సవాల్ చేస్తుంది. మీటింగ్ ఉందని విరాట్ బయటికి వెళ్లాడని చంద్ర చెప్పడంతో శ్యామల అవాక్కవుతుంది. కామాక్షి నవ్వుతుంది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం