నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నా మీద అనుమానాలు పోవాలంటే దేవుడే దిగి రావాలని కోరుకున్నాను. కానీ, ఆ దేవుడే శ్యామల పిన్ని గారిని ఒక దూతలా పంపించినట్లున్నాడు. పిన్ని గారి ఇంట్లో ఉన్న సమయంలోనే ఆవిడ అండని ఆసరాగా చేసుకుని నా తప్పేం లేదని నిరూపించుకుని నా కాపురాన్ని చక్కదిద్దుకోవాలి అని చంద్రకళ అనుకుంటుంది.
మరోవైపు శ్యామల దగ్గరికి వెళ్లి ఇంటి పెద్ద కోడలు మీ వదినకు ఇష్టంలేని పని నట్టింట్లో కూర్చుని చేస్తుంది అని శాలిని అంటుంది. మనకు ఎంతో పేరుంది. మంచి మంచి బిజినెస్‌లు చేస్తారు అని కామాక్షి, పొద్దున్నే లేవలేదని నన్ను తిట్టావుగా. ఇప్పుడు చంద్రకళ చేస్తున్న దారుణం తెలిస్తే నీకు ఎంత కోపం వస్తుందో అని శ్రుతి అంటారు. నసపెట్టకుండా చెప్పండి అని శాలిని అంటుంది.
మన స్టేటస్‌కు తగినట్లు చేయాలి కదా. కానీ, చంద్రకళ ఛీప్‌గా మన ఫ్యామిలీ స్టేటస్ పడిపోయేలా పచ్చళ్ల బిజినెస్ చేస్తుంది అని శాలిని చెబుతుంది. ఏంటీ పచ్చళ్ల బిజినెసా. మరి అంత అవసరం ఏమొచ్చింది. అసలు అలా ఎందుకు చేసిందో అడుగుతా అని శాలిని అంటుంది. ఆ విషయాన్ని వెళ్లి జగదీశ్వరిని అడుగుతుంది. బయటవాళ్లు మన గురించి ఏమనుకుంటారు అంటుంది.
ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నావ్ అని శ్యామల అంటే అందులో తప్పేముందని చంద్రకళ అంటుంది. అత్తయ్యకు కొత్తగా పెళ్లి అయినప్పుడు ఒక్కతే ఎంత కష్టపడిందో నాకు తెలుసు. నేను కూడా అలాగే చేయాలనుకున్నా. మనం చేసే బిజినెస్‌ను బట్టి మన స్టేటస్ ఉండదు. దాంట్లో వచ్చే సక్సెస్, ఇష్టంను బట్టి ఉంటుంది. నేను చేసేది తప్పు అయితే ఆరోజే అత్తయ్య ఆపేది. కానీ, ఆశీర్వదించి పంపించారు అని చంద్రకళ అంటుంది.
ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడటం తప్పు కాదు అని జగదీశ్వరి అంటుంది. దాంతో శ్యామల చప్పట్లు కొడుతుంది. అబ్బా నువ్ నాకు బాగా నచ్చావ్. మీ అత్త అడుగుజాడల్లో నడవడంలోనే సగం సక్సెస్ అయ్యావ్ అని శ్యామల అంటుంది. ఇక కామాక్షి, శాలిని, శ్రుతి (దుష్ట త్రయం) వైపు తిరిగి నిజాయితీతో చేసే ఏ బిజినెస్ తప్పు కాదు అని అంటుంది.
పచ్చళ్లకు బయట ఎంత మార్కెట్ ఉందో తెలుసా. ఇందాక చంద్రను పొగిడాననే కదా తిట్టించాలని ప్లాన్ వేశారు. ఇలాంటివి నా దగ్గర పనిచేయవు. చాడీలతో చంద్ర గురించి తప్పుగా ఇంకోసారి చెప్పారో ముగ్గురిని మడతెట్టేస్తాను అని శ్యామల వార్నింగ్ ఇస్తుంది. అలా దుష్ట త్రయం ప్లాన్ బెడిసికొడుతుంది. చంద్రకళను ఇరికిద్దామని చూసి వాళ్లే ఇరుక్కుంటారు. వదినా నీకు తగ్గ కోడలినే తెచ్చుకున్నావుగా. చంద్రకళ ఏం హెల్ప్ కావాలన్న నన్ను అడుగు అని చెబుతుంది శ్యామల.
మరోవైపు బాబాయ్ దగ్గరికి వెళ్లిన చంద్రకళ బిజినెస్ గురించి అడుగుతుంది. పచ్చళ్లు హాట్ కేక్‌లా అమ్ముడుపోతున్నాయి. నా షాప్ కూడా ఫేమస్ అయింది. నీతో డీల్ ఫిక్స్ చేసుకుందామనుకుంటున్నాను. పచ్చళ్లకు అయ్యే ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటాను. నువ్ షాపులోనే వాటిని ప్రిపేర్ చేసి ఇవ్వు. పెట్టుబడి నేనే పెడతాను కాబట్టి లాభాల్లో 60 శాతం నాకు 40 శాతం నీకు అని బాబాయ్ చెబుతాడు.
దాంతో సరే అని సంతోషిస్తుంది చంద్రకళ. మరోవైపు ఇంటికి విరాట్ వస్తే.. చంద్రకళ ఎక్కడరా అని శ్యామల అడుగుతుంది. తెలిదని విరాట్ అంటాడు. నా కూతురు ఎక్కడరా అని శ్యామల అంటే కామాక్షి కుళ్లుకుంటుంది. తను బిజినెస్ చేస్తుందిగా లేట్ అయినట్లుందని విరాట్ అంటాడు. ఏదో సమస్య వచ్చినట్లుందని క్రాంతి అంటాడు. దాంతో చంద్రకు కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుంది.
ఏదో జరిగినట్లే కదా. మొత్తం సిటీ అంతా వెతికైనా సరే చంద్రను తీసుకురా. మీరిద్దరు అంటి ముట్టనంటే ఉంటున్నారు. అందుకేనా లైట్ తీసుకుంటున్నావ్ అని శ్యామల అంటుంది. దాంతో విరాట్‌కు జగదీశ్వరి చంద్రకళను తీసుకురమ్మని చెబుతుంది. మరోవైపు రోడ్డు మీద చంద్రకళ స్కూటీ ఆగుతుంది. చంద్రకళ ఎక్కడ లేదు. నిజంగా ఏమైనా అయిందా. దీంతో ఇంట్లో ఉన్న టార్చరే, బయట ఉన్న టార్చరే అని విరాట్ అనుకుంటాడు.
ఇంతలో చంద్రకళ కనిపిస్తుంది. చంద్రను చూసి కోపంగా అరుస్తాడు విరాట్. ఇంత లేట్ అయ్యేవరకు ఏం చేస్తున్నావ్ అని కోప్పడుతాడు. ఏం జరిగిందో తెలుసుకుని అనండి అని చంద్రకళ అంటుంది. అప్పుడు జరిగింది చెబుతుంది. ఇంతలో అక్కడికి పోలీసులు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు. అసలు ఎవరు మీరు అని నిలదీస్తారు.
దాంతో చంద్రకళ తన భార్య అని, ఇంటికి రావడం లేట్ అయితే వెతుక్కుంటూ వచ్చానని విరాట్ చెబుతాడు. విరాట్ తనను తన భార్య అని ఒప్పుకోవడంతో చంద్రకళ చాలా సంతోషిస్తుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్