నిన్ను కోరి జూన్ 28 ఎపిసోడ్: చంద్రకళను మెడపట్టి గెంటేసిన శ్యామల- ఎస్సై ద్వారా తెలిసిపోయిన నిజం- రఘురాం కేస్ వాపస్!-ninnu kori serial today episode june 28th 2025 shyamala threw out chandrakala in trouble star maa jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నిన్ను కోరి జూన్ 28 ఎపిసోడ్: చంద్రకళను మెడపట్టి గెంటేసిన శ్యామల- ఎస్సై ద్వారా తెలిసిపోయిన నిజం- రఘురాం కేస్ వాపస్!

నిన్ను కోరి జూన్ 28 ఎపిసోడ్: చంద్రకళను మెడపట్టి గెంటేసిన శ్యామల- ఎస్సై ద్వారా తెలిసిపోయిన నిజం- రఘురాం కేస్ వాపస్!

Sanjiv Kumar HT Telugu

నిన్ను కోరి సీరియల్ జూన్ 28 ఎపిసోడ్‌లో చంద్రకళను శ్యామల బయటకు గెంటేసేలా దుష్టత్రయం ప్లాన్ చేస్తుంది. అలాగే, మరుసటి రోజు ఉదయం ఎస్సై వచ్చి రఘురాం యాక్సిడెంట్ కేసు వాపసు తీసుకోమని చెబుతాడు. దాంతో చంద్రకళ సుభద్ర కూతురని తెలిసి కోప్పడుతుంది శ్యామల. చంద్రకళను మెడపట్టి బయటకు గెంటేస్తుంది శ్యామల.

నిన్ను కోరి సీరియల్ జూన్ 28 ఎపిసోడ్‌

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళ బెడ్ రూమ్‌కి వస్తుంది. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు. ఇప్పుడు ఇప్పుడే కోలుకునే నాన్నని ఇలా కింద పడేసావు ఎందుకు అంత కక్ష సాధింపులాగా చేస్తున్నావ్ అని చంద్రకళను విరాట్ తిడతాడు. దానికి చంద్రకళ నేను కావాలని చేయలేదు అని చాలా చెప్పి చూస్తుంది.

చంద్రకళను పంపించడానికి

అయినా కానీ, చంద్రకళ ఎంత చెప్పినా విరాట్ వినడు. దాంతో చంద్రకళ తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టే అందరి ముందు దోషిగా కనిపిస్తుంది. శ్యామలతో సహా అందరూ చంద్రకళను తిట్టేసరికి విరాట్ కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇక శృతి శాలిని కామాక్షి ముగ్గురు కలిసి ఆ చంద్రకళని ఇంట్లో నుంచి ఎలా పంపించేయాలి అని ప్లాన్ చేస్తుంటారు.

అక్కడ శాలిని వాళ్లిద్దరితో ఆ ప్లాన్ మొత్తం చెబుతుంది. వాళ్లు కూడా ఎగ్జైట్ అయిపోయి ఇక రేపు చంద్రకళని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తున్నామని సంతోషంగా అనుకుంటారు శాలిని, కామాక్షి, శ్రుతి. మరుసటి రోజు ఉదయాన్నే పోలీసులు జగదీశ్వరి ఇంటికి వస్తారు. రఘురాం ఆక్సిడెంట్ కేసు మీరు పెట్టారు కదా. అది ఇంకా వాపస్ తీసుకోలేదు. ఆ కేస్ అలాగే రన్నింగ్‌లో ఉంది మీరు దాన్ని రిటర్న్ తీసుకోమని జగదీశ్వరితో ఎస్సై అంటాడు.

యాక్సిడెంట్ చేసిందెవరు

మేము మర్చిపోయాం సార్. కానీ, ఆ కేసు రన్నింగ్‌లో ఉందని మాకు తెలియదు అని జగదీశ్వరి చెబుతుంది. అక్కడే ఉన్న శ్యామల అసలు యాక్సిడెంట్ చేసింది ఎవరు. వాళ్లెవరో తెలిస్తే ఊరికే వదిలిపెట్టను అని తెగ ఫైర్ అయిపోయి ఎస్ఐని అడుగుతుంది శ్యామల. దాంతో ఇంకెవరు ఆ వరదరాజుల కుటుంబమే అని ఎస్సై చెబుతాడు.

దాంతో మరింతగా శ్యామల కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆ వరదరాజుల కుటుంబం అస్సలు మంచిది కాదు. ఆ కుటుంబ వ్యక్తులు పరమ నీచులని శ్యామల ఆగ్రహంతో ఊగిపోతుంది. మరి ఆ ఇంటి మనిషి చంద్రకళ ఇక్కడే ఉందిగా అని కామాక్షి అంటుంది. ఏంటీ అని శ్యామల గట్టిగా నిలదీస్తుంది. దాంతో సుభద్ర కూతురు చంద్రకళ అని కామాక్షి తప్పక చెబుతుంది.

ఇన్నాళ్లు మంచిదానిలా నటించావా అని చంద్రకళపై ఫైర్ అవుతుంది శ్యామల. చంద్రకళని గట్టిగా తిట్టి మెడ పట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది శ్యామల. చంద్రకళ ఎంత చెప్పిన శ్యామల వినకుండా బయటకు గెంటేస్తుంది. అయితే, ఇదంతా కామాక్షి డ్రీమ్‌లో జరుగుతుంది. దాంతో కామాక్షి సంతోషిస్తూ చప్పట్లు కొడుతుంది. అంతా ఏమైందని అడగడంతో కామాక్షి తేరుకుంటుంది.

కేసు రిటర్న్ తీసుకుంటాను

అయ్యయ్యో.. ఎస్సై ద్వారా చంద్రకళ గురించి నిజం తెలిసి శ్యామల బయటకు గెంటేసినట్లు ఊహించుకున్నానే. అయినా జరిగేది అదే కదా అని మనసులో అనుకుంటుంది కామాక్షి. కానీ, జగదీశ్వరి వచ్చి ఆ కేసును నేను రిటర్న్ తీసుకుంటాను అని చెప్పడంతో సరే అని చెప్పి ఎస్సై వెళ్లిపోతాడు. దాంతో మళ్లీ దుష్ట త్రయం ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం