నిన్ను కోరి జూన్ 26 ఎపిసోడ్: శ్యామలను బోల్తా కొట్టించిన చంద్రకళ- కలబంద కాకరకాయ పచ్చడి- ఇంటికొచ్చి తిట్టిన కస్టమర్!-ninnu kori serial today episode june 26th 2025 chandrakala lies to shyamala on virat marital life star maa jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నిన్ను కోరి జూన్ 26 ఎపిసోడ్: శ్యామలను బోల్తా కొట్టించిన చంద్రకళ- కలబంద కాకరకాయ పచ్చడి- ఇంటికొచ్చి తిట్టిన కస్టమర్!

నిన్ను కోరి జూన్ 26 ఎపిసోడ్: శ్యామలను బోల్తా కొట్టించిన చంద్రకళ- కలబంద కాకరకాయ పచ్చడి- ఇంటికొచ్చి తిట్టిన కస్టమర్!

Sanjiv Kumar HT Telugu

నిన్ను కోరి సీరియల్ జూన్ 26 ఎపిసోడ్‌లో విరాట్ చంద్రకళకు మధ్య సక్యత లేదని, గొడవ పడుతున్నారని, ఇదంతా జగదీశ్వరికి తెలిసే జరుగుతుందని శ్యామల రచ్చ చేస్తుంది. కానీ, రఘురాం అలా ఉండటం వల్లే అని శ్యామలకు చంద్రకళ చెబుతుంది. భలే బోల్తా కొట్టించింది అని కామాక్షి అంటుంది. కామాక్షి పచ్చడిని కస్టమర్ వచ్చి తిడతారు.

నిన్ను కోరి సీరియల్ జూన్ 26 ఎపిసోడ్‌

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బెడ్ రూమ్‌లోకి చంద్రకళ వస్తే నువ్ పడుకోవాల్సింది సోఫాపై అని అంటాడు విరాట్. సోఫాపై ఒకవైపుకే పడుకోలేకపోతున్నాను అని చంద్రకళ అంటుంది. కానీ, విరాట్ వినడు. దాంతో సోఫాపై నీళ్లు పోసి బెడ్ మీద పడుకుందామనుకుంటుంది చంద్ర. బాటిల్ పట్టుకుని సోఫాపై చంద్ర నీళ్లు పోస్తుంటే విరాట్ వచ్చి గ్లాస్ పట్టుకుంటాడు.

మెడపట్టి బయటకు గెంటేవాన్ని

నాకు తెలిసే ఇలాంటివి వింత ప్రయోగాలు చేస్తావని అని విరాట్ అంటాడు. ఇద్దరు అలాగే గొడవ పడతారు. ఆ మాటలన్నీ విన్న శ్యామల ఓహో వీళ్ల మధ్య ఏం జరగలేదన్నమాట. చెబుతా అని అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం శ్యామల అత్తయ్య లేకపోతే నిన్ను మెడపట్టి బయటకు గెంటేసేవాన్ని అని విరాట్ అన్న మాటలు తలుచుకుంటుంది శ్యామల.

ఇంతలో చంద్ర వచ్చి త్వరగా లేచారు అని అడుగుతుంది. నిద్ర పట్టలేదని శ్యామల అంటే హోమ్ సిక్ అయినట్లున్నారు. మీ ఇంటికి వెళ్తే సెట్ అవుతుందని విరాట్ అంటాడు. ఎందుకు మీ ఇద్దరికి ఇలా నటించే అవకాశం ఉండదనా అని శ్యామల అంటుంది. దాంతో ఇద్దరు షాక్ అవుతారు. ఎందుకు అన్యూన్నంగా ఉన్నట్లు నటించారు. అంతా మొదటి నుంచి నన్ను మోసం చేశారన్నమాట. వదినకు కూడా తెలుసు కదా అని శ్యామల అంటుంది.

వదినకు తెలిసే జరుగుతుంది

అంతా చంద్రకళ మీద కోపంగా ఉన్నారు. అంటే ఏదో జరిగింది. అది దాస్తున్నారు అన్న శ్యామల అందిరిని పిలుస్తుంది. జగదీశ్వరికి విరాట్, చంద్రకళ నటించింది చెబుతుంది శ్యామల. ఇదంతా మా వదినకు తెలిసే జరుగుతుందని నాకు బాగా అర్థం అవుతుంది అని శ్యామల ఇంట్లో జరిగిన విషయాలన్నిటిపై డౌట్ పడుతుంది. ఎందుకు నా ముందు దాచారు అని శ్యామల నిలదీస్తుంది.

నేను చెబుతాను అని చంద్రకళ చెబుతుంది. మావయ్య అలా బెడ్ మీద ఉంటే మా ఆయన ఎలా సంతోషంగా ఉండగలడు. కాపురం ఎలా చేయగలడు.అందరూ బాధలో ఉంటే ఎలా సంతోషంగా ఉంటాం. మావయ్య బాగా అయ్యేవరకు మేము కలవకూడదు అనుకున్నామని చంద్రకళ చెబుతుంది. ఇంత రచ్చ చేశాను. సారీ వదినా కంగారుపడకు అని శ్యామల అంటుంది.

ఇది మళ్లీ బోల్తా పడిందే. ఇక చంద్రను గెలవడం కష్టమే అని కామాక్షి అంటుంది. సారీ చంద్రకళ అనవసరంగా సీన్ చేశాను. అదంతా ఆ కామాక్షి వల్లే. నీ మాటలు వినే ఇలా చేశాను అని శ్యామల అంటుంది. దాంతో కామాక్షి పారిపోతుంది. పెద్ద తుఫాను వెనక్కి వెళ్లినట్లుంది అని విరాట్ అంటే ఆ తుఫాన్ ఎవరి వల్ల ఆగిందని చంద్రకళ అంటుంది. నువ్వే చేశావ్. ఇలాంటివి నువ్వు బాగా చేస్తావ్ అని విరాట్ అంటాడు.

నీ మాటలకు పడను

మావయ్య కోలుకోవడం నాకే ముఖ్యం. నేను తప్పు చేయలేదని చెప్పేది ఆయన ఒక్కరే అని చంద్రకళ ఏడుస్తూ అంటుంది. ఇలాంటి మాటలకు నేను పడను అని విరాట్ అంటాడు. తర్వాత సోఫా ఎక్కి బూజు దులుపుతుంది చంద్రకళ. దులుపుతు చంద్రకళ పడిపోతుంటే విరాట్ పట్టుకుని ఎత్తుకుంటాడు. రొమాంటిక్‌గా సీన్ ఉంటుంది. ఏదో ఒక రూపంలో నీ ప్రేమ బయటపడుతుందని చంద్రకళ అంటుంది.

మరోవైపు ఆర్డర్స్ అంతా బాగా వెళ్లాయి. కానీ రెస్పాన్స్ ఇంకా రావట్లేదని తల్లీకూతుళ్లు కామాక్షి, శ్రుతి అనుకుంటారు. ఇంతలో ఒక కస్టమర్ నేరుగా ఇంటికి వస్తారు. ఎవరు చేయని కాంబినేషన్‌తో కలబంద కాకరకాయ పికిల్ చేశారుగా. అది తిని మా ఆయన హాస్పిటల్‌లో పడ్డారు అని కస్టమర్ తిడుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం