నిన్ను కోరి జూన్ 13 ఎపిసోడ్: చంద్రకళ విరాట్ ఫస్ట్ నైట్- ఒప్పుకున్న జగదీశ్వరి- దుష్ట త్రయంతోనే పనులు- చెడగొట్టేలా ప్లాన్!-ninnu kori serial today episode june 13th 2025 shyamala arrange virat chandrakala first night star maa jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నిన్ను కోరి జూన్ 13 ఎపిసోడ్: చంద్రకళ విరాట్ ఫస్ట్ నైట్- ఒప్పుకున్న జగదీశ్వరి- దుష్ట త్రయంతోనే పనులు- చెడగొట్టేలా ప్లాన్!

నిన్ను కోరి జూన్ 13 ఎపిసోడ్: చంద్రకళ విరాట్ ఫస్ట్ నైట్- ఒప్పుకున్న జగదీశ్వరి- దుష్ట త్రయంతోనే పనులు- చెడగొట్టేలా ప్లాన్!

Sanjiv Kumar HT Telugu

నిన్ను కోరి సీరియల్ జూన్ 13 ఎపిసోడ్‌లో విరాట్ చంద్రకళకు ఫస్ట్ నైట్ చేయించాలని శ్యామల చెబుతుంది. అందుకోసం దుష్ట త్రయం కామాక్షి, శ్రుతి, శాలినితో పనులు చేయిస్తుంది. జగదీశ్వరి కూడా చంద్రకళ శోభనానికి ఒప్పుకుంటుంది. కానీ, ఫస్ట్ నైట్ చెడగొట్టేలా దుష్ట త్రయం ప్లాన్ వేస్తుంది.

నిన్ను కోరి సీరియల్ జూన్ 13 ఎపిసోడ్‌

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మావయ్య నిజంగానే కళ్లు ఆర్పారు అని చంద్రకళ చెబితే విరాట్ చిరాకు పడతాడు. ప్రతి దానికి తింగరగా ఆలోచిస్తావ్. అదే వంకరగా ఆలోచిస్తావ్ అని చంద్రకళ అంటుంది. ఏంటిది బావ ఉక్కపోస్తుంటే ఫ్యాన్ వేసుకోకుండా అని చంద్రకళ ఫ్యాన్ వేస్తుంది. దాంతో గాల్లోకి పేపర్స్ అన్ని ఎగురాతాయి.

సరసం కాదు సమరం

చంద్రకళను తిట్టి పేపర్స్ తీయమంటాడు. ఈ క్రమంలో విరాట్, చంద్రకళ తలలు గుద్దుకుంటాయి. తర్వాత చంద్రకళ గుద్దుకుని పడబోతుంటే పట్టుకుంటాడు విరాట్. చిరాకు తెప్పిస్తున్నావే అని విరాట్ అంటాడు. మీ చిరాకు పోయేందుకు ఒక ముద్దు పెట్టమంటారా అని చంద్రకళ అంటుంది. మన మధ్య జరుగుతుంది సమరం, సరసం కాదని విరాట్ అంటాడు.

అర్థమైంది లేండి. ఇంకా మన మధ్య ఫస్ట్ నైట్ జరగలేదని కదా. ముహుర్తం పెట్టించమంటారా అని చంద్రకళ అంటుంది. మరోవైపు రెండు రోజుల్లో డిజైన్స్ రెడీ చేసి ఇస్తాను ఫోన్‌లో అంటాటు క్రాంతి. శాలిని డిజైన్స్ వేయనంది. రెండు రోజుల్లో ఇస్తా అన్నా. ఇప్పుడేం చేయాలని టెన్షన్ పడుతుంటాడు క్రాంతి. ఇంతలో చంద్రకళ వచ్చి ఏమైందని అడుగుతుంది.

దాంతో కొత్త క్లైంట్స్ డిజైన్ గురించి, శాలిని మాట్లాడిన దాని గురించి చెబుతాడు క్రాంతి. నీలో పంతం పెంచాలన్న ఉద్దేశంతో శాలిని మాట్లాడింది. నిన్ను నువ్ ప్రూవ్ చేసుకోవాలి. డిజైన్స్ నువ్వు ఎందుకు వేయలేవు. శాలిని డిజైన్స్ చూసిన ఎక్స్‌పీరియెన్స్ ఉంది. తను ఎలా ఆలోచించిందో ట్రై చేయు అని చంద్రకళ మోటివేట్ చేస్తుంది. పిల్లలకు నచ్చేలా ఎలాంటి డిజైన్స్ వేయాలో తెలియట్లేదని క్రాంతి అంటుంది.

చంద్రకళ మోటివేషన్

నువ్వు కూడా పిల్లాడిలా మారు. వారికి ఏవి నచ్చుతాయి ఎంక్వైరీ చేయి అని చెబుతుంది చంద్రకళ. నాకు చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉందని క్రాంతి అంటాడు. మరోవైపు కామాక్షి, శ్రుతిలతో పూలు తీసుకొచ్చేలా చేస్తుంది శ్యామల. పని మనుషులును చేసేసిందే అని తల్లీకూతుళ్లు బాధపడుతుంటారు. జగదీశ్వరిని పిలుస్తుంది శ్యామల. ఇన్ని పూలు, పండ్లు ఎందుకు అని జగదీశ్వరి అడుగుతుంది.

ఇవన్నీ చంద్రకళ కోసం. ఇవన్నీ కూడా చంద్ర విరాట్ శోభనానికి తీసుకొచ్చాను అని శ్యామల చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఇప్పుడు సడెన్‌గా ఫస్ట్ నైట్ అంటే మేము ప్లాన్ చేసుకోవాలిగా అని కామాక్షి అంటుంది. మీరెందుకు ప్లాన్ చేసుకోవాలి అన శ్యామల అంటే.. అదే విరాట్, చంద్ర అని కామాక్షి అంటుంది. విరాట్ వాళ్లు ఫస్ట్ నైట్ జరగట్లేదని లోలోపలే బాధపడుతున్నారు అని శ్యామల చెబుతుంది.

విరాట్, చంద్ర మాట్లాడుకోవడం నేను విన్నాను. ఇంట్లో పరిస్థితి చూసి మీరెలా సంతోషంగా ఉండాలనుకున్నారు. మీరు ఉదయం మాట్లాడుకోవడం నేను విన్నాను అని చంద్రకళ ఫస్ట్ నైట్ గురించి మాట్లాడటం విన్నట్లు శ్యామల చెబుతుంది. వద్దు అని చంద్రకళ అంటుంది. మంచి ఆలోచన చేశావ్. విరాట్ అలా బాధపడుతున్నట్లు తెలియదు. నీ చేతుల మీదుగానే ఆ కార్యం చేయించు అని జగదీశ్వరి ఒప్పుకుంటుంది.

ఒప్పుకున్న జగదీశ్వరి

దాంతో దుష్ట త్రయం మరింత షాక్ అవుతుంది. మనమే దగ్గరుండి చేపిద్దాం అని కామాక్షి, శ్రుతిని అంటుంది శ్యామల. విరాట్‌కు విషయం చెప్పకుండా కాల్ చేసి రమ్మను అని చంద్రకళతో అంటుంది శ్యామల. చూడు కామాక్షి శ్యామల చెప్పింది దగ్గరుండి చేయించు అని జగదీశ్వరి వెళ్లిపోతుంది. ఏం తెలివి చంద్ర. ఆవిడ వినేలా చేసింది నువ్వే, ఇలా చేయించింది నువ్వే అని శాలిని అంటుంది.

బావ చస్తే ఒప్పుకోడు అని శ్రుతి అంటుంది. నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే మీరు పూలు తీసుకురావడం, మీ చేతులతో నా శోభనం జరగడం అని చంద్రకళ అంటుంది. బావ ఎలా ఫీల్ అవుతాడో అనుకుంటూ వెళ్లిపోతుంది చంద్రకళ. మరోవైపు శ్రుతి, కామాక్షిలను సిగ్గు లేదా మీకు అని తిడుతుంది. చంద్ర తలుచుకుంటే బావ గారిని బుట్టలో వేసుకుంటుంది. టెంప్ట్ చేసి లొంగదీసుకుంటే ఏం చేస్తావ్ అని శాలిని అంటుంది.

ఎలాగైనా ఈ ఫస్ట్ నైట్ చెడగొట్టాలి అని కామాక్షి అంటుంది. మీరిద్దరు పిచ్చోళ్లు కాబట్టే మిమ్మల్ని బయటకు తీసుకెళ్లింది. మీ చేతులతోనే మీ కొంపను తగలబెట్టించింది అని శాలిని అంటుంది. ఫస్ట్ నైట్ చెడగొట్టడానికి మంచి ప్లాన్ ఆలోచించు అని తల్లీకూతుళ్లు వేడుకుంటారు. ఒక ప్లాన్ చెబుతుంది శాలిని. ఇది బాగుంది. ఈ దెబ్బతో చంద్ర సంతోషం ఆవిరైపోతుందని కామాక్షి అంటుంది.

చంద్రకళ ఫస్ట్ నైట్

విరాట్ ఇంటికి రాగానే ఫస్ట్ నైట్ గురించి తెలుస్తుంది. దాంతో ఏంటిదమ్మా. నాకు శోభనం ఇష్టంలేదని విరాట్ అంటాడు. అయితే, శ్యామలకు నిజం చెప్పేయ్ అంటుంది జగదీశ్వరి. అది చెప్పలేక విరాట్ ఫస్ట్ నైట్‌కు రెడీ అవుతాడు. చంద్రకళకు పాలిచ్చి శోభనం గదిలోకి పంపిస్తారు దుష్టత్రయం కామాక్షి, శాలిని, శ్రుతి. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం