నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ జూన్ 11: దుష్టత్రయానికి అదిరిపోయే ట్విస్ట్.. ఒకరికొకరు తినిపించుకున్న చంద్ర, విరాట్-ninnu kori serial today episode june 11th 2025 chandrakala gives twist to kamakshi and she shares food with virat ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ జూన్ 11: దుష్టత్రయానికి అదిరిపోయే ట్విస్ట్.. ఒకరికొకరు తినిపించుకున్న చంద్ర, విరాట్

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ జూన్ 11: దుష్టత్రయానికి అదిరిపోయే ట్విస్ట్.. ఒకరికొకరు తినిపించుకున్న చంద్ర, విరాట్

HT Telugu Desk HT Telugu

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ జూన్ 11: కర్రీల్లో కారం, ఉప్పు కలిపిన కామాక్షి, శాలిని, శృతికి దిమ్మతిరిగే ట్విస్ట్ ఇస్తుంది చంద్రకళ. ఊహించని ఎదురుదెబ్బతో ముగ్గురు విలవిల్లాడతారు. వీడియో చూపించి వారికి వార్నింగ్ కూడా ఇస్తుంది చంద్ర. ఈ ఎపిసోడ్ హైలైట్స్ ఇక్కడ చూడండి.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ జూన్ 11: దుష్టత్రయానికి అదిరిపోయే ట్విస్ట్.. ఒకరికొకరు తినిపించుకున్న చంద్ర, విరాట్

నిన్ను కోరి సీరియల్ నేటి (జూన్ 11) ఎపిసోడ్‍లో.. ఏవండోయ్ శ్రీవారు భోజనం చేసేందుకు రండి, మీకు ఇష్టమైనవే చేశానని విరాట్‍ను చంద్రకళ పిలుస్తుంది. వినపడలేదని విరాట్ అంటాడు. అయితే శ్యామల పిన్ని వచ్చి పిలుస్తుందని చంద్ర అంటుంది. దీంతో భయపడిన విరాట్.. వస్తున్నా అంటాడు. తాము కారం ఎక్కువగా కలిపిన కూర ఎక్కువ తింటే రచ్చరచ్చే అని ‘దుష్టత్రయం’ శాలినీ, కామాక్షి, శృతి అనుకుంటారు. వాళ్లకు చంద్ర కౌంటర్లు ఇస్తుంది.

తినిపించుకున్న విరాట్, చంద్ర

మీ ఆయన పక్కన కూర్చో చంద్ర అని శ్యామల అంటుంది. మేం వడ్డిస్తామని కామాక్షి చెబుతుంది. ఒకరికొకరు తినిపించుకోండని విరాట్, చంద్రకళకు శ్యామల చెబుతుంది. మొన్న తినిపించుకున్నాం కదా అని విరాట్ అంటాడు. ఇప్పుడు సంప్రదాయం కోసం అని శ్యామల సర్దిచెబుతుంది. ఎగిలి ముద్ద తినిపించుకోవాలని అంటుంది. అలా మూడు ముద్దలు తినిపించుకోవాలని, కచ్చితంగా చేయాల్సిందేనని చెబుతుంది.

ముందు విరాట్ ఓ ముద్ద తింటాడు. ఇదేంటి విరాట్ బావకు ఏమీ కాలేదని శాలినీ షాక్ అవుతుంది. కామాక్షి, శృతి కూడా ఆశ్యర్యపోతారు. వారికి అదిరిపోయే ట్విస్ట్ ఎదురవుతుంది. విరాట్, చంద్ర ఒకరికొకరు ముద్దలు తినిపించుకుంటారు. అందరూ ఆనందంగా తింటుంటే చంద్ర దుష్టత్రయం అని పిలుచుకునే శాలిని, కామాక్షి, శృతి షాకై చూస్తుంటారు.

అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన చంద్ర

మీరు కూడా కూర్చొని తినండని శాలిని, కామాక్షి, శృతికి శ్యామల చెబుతుంది. వారి కోసం తాను సపరేట్‍గా వండానని చంద్ర అంటుంది. ఏమైంది.. ఎవరికీ ఏం కాలేదు అని శృతి అంటే.. నాకు అర్థం కావడం లేదని కామాక్షి చెబుతుంది. మీకోసం స్పెషల్‍గా చేసిన కర్రీ అని ఆ ముగ్గురికి చంద్ర వడ్డిస్తుంది. అది వారు ఎక్కువగా కారం, ఉప్పు వేసిన కూరలు అయి ఉంటాయి. వాటిని ఆ ముగ్గురితోనే తినిపించి దిమ్మతిరిగే ట్విస్ట్ ఇస్తుంది చంద్ర.

వీడియో చూపించి..

వాళ్ల కూరలో కారం కలిపిన విషయాన్ని చంద్ర వీడియో తీసి ఉంటుంది. దాన్ని చూపిస్తుంది. నోరు మూసుకొని తినకపోతే వీడియోను శ్యామల పిన్నికి చూపిస్తానని బెదిరిస్తుంది. ఉప్పు, కారం సరిగ్గా సరిపోయినట్టు ఉన్నాయంటూ కామాక్షి, శాలినీ, శృతిని మరింత ఉడికిస్తుంది చంద్ర. మరింత కర్రీ వేస్తుంది శ్యామల. తినలేక ఆపలేక ఆపసోపాలు పడతారు ఆ ముగ్గురు.

వార్నింగ్ ఇచ్చిన చంద్ర

ఎలా ఉంది నా ఘాటు దెబ్బ, దిమ్మతిరిగి బొమ్మ కనపడినట్టు ఉంది అని శాలిని, కామాక్షి, శృతికి కౌంటర్లు వేస్తుంది చంద్ర. వీడియో చూపిస్తానంటూ బెదిరిస్తుంది. వీడియో డిలీట్ చేయాలని శృతి అడుగుతుంది. శ్యామలకు చూపిచ్చొద్దని వేడుకుంటుంది. మరోసారి తన పనులకు అడ్డువచ్చినా, విరాట్ బావ మధ్య దూరం పెంచాలని చూసినా నా రియాక్షన్ వేరుగా ఉంటుందని వార్నింగ్ ఇస్తుంది.

క్రాంతిని తిట్టిన శాలిని

కొత్త డిజైన్‍ల గురించి స్పాన్సర్‌తో ఫోన్‍లో మాట్లాడుతుంటాడు క్రాంతి. టైమ్‍లో డిజైన్స్ చేస్తానని చెబుతాడు. నేను కొత్త స్పాన్సర్లతో మాట్లాడానని, డిజైన్స్ నచ్చితే స్పాన్సర్‌షిప్‍కు ఒప్పుంటారని శాలినీతో క్రాంతి చెబుతాడు. డిజైన్స్ వేయాలని అంటాడు. అంతా నేనే చేస్తే నువ్వెందుకు అని భర్త క్రాంతిని అవమానించేలా శాలినీ మాట్లాడుతుంది. నువ్వేం కష్టపడవా అంటూ తిడుతుంది.

నల్లపూసల ఫంక్షన్, తల్లి జగదీశ్వరి మాటలు తలుచుకొని బాధగా ఉంటాడు విరాట్. మనస్సాక్షే లేదా అని చంద్రను చిరాకుగా అడుగుతాడు. నల్లపూసల వేడుక జరిగినందుకు సంతోషంగా ఉన్నానని చంద్ర అంటుంది. అమ్మ మాత్రం చాలా బాధగా ఉందని విరాట్ అంటాడు. జగదీశ్వరి అత్తయ్య మన పెళ్లిని అంగీకరించిందని చంద్ర సర్ది చెప్పేలా మాట్లాడుతుంది.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం