నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో చంద్రకళ, శాలిని మధ్య పోటీ నడుస్తుంటుంది. శ్యామల అందరిని పిలిచి మూడో పోటీ నిర్వహించబోతున్నాను. అందులో మీరు మీ భర్తలను ఇంప్రెస్ చేయాలి అని చెబుతుంది. దానికి శాలిని అంగీకరించి ఎలాగో క్రాంతి నా వైపు ఉన్నాడు. కాబట్టి ఏ పని చేసినా నాకు తన సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈ పోటీలో నేనే గెలుస్తానని సంబరపడిపోతూ ఉంటుంది.
ఇక చంద్రకళ మాత్రం విరాట్ తనకు సపోర్ట్‌గా లేడు కాబట్టి నేను ఓడిపోతానేమో అని కాస్తా భయపడుతుంది. తర్వాత శ్యామల ఉండి మీరు ఏదైనా చేయండి. మీ భర్తలను మాత్రం ఇంప్రెస్ చేయండి అని గదిలోకి పంపిస్తుంది. గదిలోకి వచ్చిన శాలినికి డ్రాయింగ్ బొమ్మలు గుర్తుకొచ్చి వాళ్ల బొమ్మలను ఒక చార్ట్ మీద చిత్రీకరిస్తుంది. ఆ చిత్రీకరించిన బొమ్మతో క్రాంతి ఇంప్రెస్ అవ్వాలని అనుకుంటుంది శాలిని.
చంద్రకళకి ఏమి తోచనట్టుగా తన గదిలో కంగారు పడుతూ ఉంటుంది. విరాట్ వచ్చి నువ్వు ఎలాగో ఈ పోటీలో ఓడిపోతావని తన కాన్ఫిడెన్స్‌ని తక్కువ చేసి మాట్లాడుతాడు. దాంతో తనకేం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉంటుంది చంద్రకళ. ఆ తర్వాత అందరూ హాల్లోకి వస్తారు. వచ్చిన తర్వాత శాలిని నువ్వు ఏం తీసుకొచ్చావో చూపించమని అడుగుతారు.
దాంతో శాలిని తాను క్రాంతి ఇద్దరు కలిసి ఉండే పటాన్ని అందంగా చిత్రీకరించి తీసుకొస్తుంది. అది చూసి అందరూ ఇంప్రెస్ అవుతారు. మెచ్చుకుంటారు. క్రాంతి కూడా చాలా బాగా చేశావని సంబరపడిపోతాడు. దానితో శాలిని విజయం సంపాదించుకుంటుందేమో అని చంద్రకళ భయపడిపోతుంది. తర్వాత చంద్రకళని నువ్వేం చేసుకు వచ్చావ్ అని అడుగుతారు.
చంద్రకళ తాను చిత్రీకరించిన విరాట్, జగదీశ్వరి కలిసి ఉన్న ఫోటోలను చూపిస్తుంది. అది చూసిన వాళ్లంతా చాలా ఆనంద పడిపోతారు. భర్తను ఎవరైనా ఇంప్రెస్ చేస్తారు. కానీ, తల్లీ కొడుకుల ప్రేమ, అనుబంధం అనేది చాలా అద్భుతమైనది, అమితమైనది అని చెప్పి చంద్రకళకి విజయం ప్రకటిస్తారు.
దాంతో ఇంటి తాళాలు, ఇంటి పెత్తనం చంద్రకళకు వెళ్లిపోతాయి. అదంతా చూసిన శాలినికి చాలా కోపం వస్తుంది. కామాక్షి, శృతి కూడా చాలా డిసప్పాయింట్ అయిపోతారు. ఇక చంద్రకళకు కొమ్ములు వచ్చినట్లే అని తల్లీకూతుళ్లు కామాక్షి, శ్రుతి అనుకుంటారు.
చంద్రకళకి తాళాలు వెళ్లిపోవడం మనకి ఓటమి కాదు అదే గెలుపు అనుకోవాలి అని శాలిని అంటుంది. అర్థం కాలేదు. అలా ఎలా అవుతుందని తల్లీకూతుళ్లు అంటారు. ఎందుకంటే రేపు ఇంట్లో ఏదైనా తప్పు జరిగినా, డబ్బులు పోయిన, ఇంకేదైనా దొంగతనం జరిగిన ఆ నింద చంద్రకళ మీద పడుతుంది. అప్పుడు ఆ తాళాలు అత్తయ్య మనకే ఇస్తుంది అని శాలిని అంటుంది.
దాంతో అంటే ఇంట్లో చంద్రకళ తప్పు చేసినట్లుగా మనం చిత్రీకరించాలి అని ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు. కాబట్టి, పెద్ద కోడలు చంద్రకళ గెలిచి ఇంటి తాళాలు రప్పించుకున్నప్పటికీ కొత్త సమస్య ఎదురైనట్లు అవుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్