నిన్ను కోరి జూలై 3 ఎపిసోడ్: పోటీలో ఇద్దరు తోడికోడళ్ల విజయం- దెబ్బలు తగిలించుకున్న తల్లీకూతుళ్లు- విరాట్‌కు చంద్ర ముద్దు-ninnu kori serial today episode july 3rd 2025 chandrakala shalini wins the food competition star maa jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నిన్ను కోరి జూలై 3 ఎపిసోడ్: పోటీలో ఇద్దరు తోడికోడళ్ల విజయం- దెబ్బలు తగిలించుకున్న తల్లీకూతుళ్లు- విరాట్‌కు చంద్ర ముద్దు

నిన్ను కోరి జూలై 3 ఎపిసోడ్: పోటీలో ఇద్దరు తోడికోడళ్ల విజయం- దెబ్బలు తగిలించుకున్న తల్లీకూతుళ్లు- విరాట్‌కు చంద్ర ముద్దు

Sanjiv Kumar HT Telugu

నిన్ను కోరి సీరియల్ జూలై 3 ఎపిసోడ్‌లో చంద్రకళ, శాలినికి కొన్ని కండిషన్స్‌తో శ్యామల వంటల పోటీ పెడుతుంది. ఆ పోటీలో చంద్రకళను ఓడించడానికి తల్లీకూతుళ్లు కామాక్షి, శ్రుతి ప్రయత్నించి దెబ్బలు తగిలించుకుంటారు. పోటీలో చంద్ర, శాలిని ఇద్దరు గెలిచినట్లు జగదీశ్వరి, శ్యామల ప్రకటిస్తారు.

నిన్ను కోరి సీరియల్ జూలై 3 ఎపిసోడ్‌

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్యామల అందరిని పిలిచి వంట పోటీలకు అన్ని సిద్ధం చేసి పెడుతుంది. అందరూ అక్కడికి వస్తారు. కానీ, వంట పోటీలో శ్యామల ఒక కండిషన్ పెడుతుంది. పదినిమిషాల సమయంలోపు ఎవరైతే అద్భుతంగా రుచికరంగా వంట వండుతారో వాళ్లు ఈ పోటీలో గెలిచినట్లు అని శ్యామల చెబుతుంది.

శ్యామల కండిషన్స్

అలాగే, గ్యాస్, ఆయిల్ రెండు వాడకుండా రుచికరంగా ఏదైనా పది నిమిషాల్లో వండాలి అని శ్యామల కండిషన్స్ చెబుతుంది. దానికి అంగీకరించిన శాలిని, చంద్రకళ ఇద్దరూ పోటీకి సిద్దమవుతారు. అలాగే తమకు నచ్చినట్టు వండటానికి రెడీ అవుతారు.

శాలిని శాన్విజిని వండుతానని, చంద్రకళ ముంత మసాలా వండుతానని చెబుతారు. ఇద్దరు వండుతున్న సమయంలో చంద్రకళని ఎలాగైనా ఇబ్బందుల్లో పెట్టి తన వంట చెడగొట్టాలని కామాక్షి, శ్రుతి ఇద్దరూ ప్రయత్నాలు చేస్తారు. చంద్రకళ దగ్గరికి వెళ్లి వంట చెడగొట్టేందుకు ప్రయత్నించి వాళ్లే కింద పడి దెబ్బలు తగిలించుకుంటారు.

ఇద్దరు గెలిచారు

ఆ తర్వాత సమయం గడిచే కొద్దీ శాలిని, చంద్రకళ ఇద్దరూ తమకు నచ్చిన వంటలు రెండు ప్రిపేర్ చేసి పెడతారు. పోటీ తర్వాత ఆ రెండింటిని జగదీశ్వరి, శ్యామల ఇద్దరూ టేస్ట్ చేస్తారు. ఇద్దరి వంటలు కూడా బాగున్నాయని, రుచికరంగా ఉన్నాయని జగదీశ్వరి, శ్యామల చిన్న సస్పెన్స్ ఇచ్చి చెబుతారు. దాంతో మొదటి వంట పోటీలో చంద్రకళ, శాలిని ఇద్దరు తోడికోడళ్లు గెలుస్తారు.

తర్వాత పోటీ ఏంటో అని ఇద్దరు టెన్షన్ పడతారు. అనంతరం విరాట్ దగ్గరికి చంద్రకళ వెళ్లి నేను పోటీలో గెలవాలని కోరుకున్నావా బావ. శాలిని ఇంటిని మోసం చేయడానికి వచ్చింది. లేకుంటే నేను ఈ పోటీలో పాల్గొనేదాన్నే కాదు అని చెబుతుంది. కానీ, విరాట్ మాత్రం చంద్రకళ మాటలు వినడు, నమ్మడు. తాను చెప్పింది విరాట్ వినకపోవడంతో బాధపడుతుంది.

ముద్దుతో ఎక్కిళ్లు

ఇంతలోనే విరాట్‌కి ఎక్కిళ్లు రావడం మొదలవుతుంది. ఎక్కిళ్లు ఆగడానికి నీళ్లు తాగించకుండా చంద్రకళ ముద్దు పెడుతుంది. దాంతో విరాట్ ఎక్కిళ్లు ఆగిపోతాయి. చూసావా బావ నేను ముద్దు పెడితే ఎక్కిళ్లు ఆగిపోయాయి అని చంద్రకళ అంటుంది. అక్కడ ఇద్దరి మధ్య చిన్నిపాటి రొమాన్స్ జరుగుతుంది.

మరోవైపు శాలిని దగ్గరికి శృతి, కామాక్షి ఇద్దరు వస్తారు. వాళ్లొచ్చి నిలబడగానే శాలిని ఉండి మిమ్మల్ని చెడగొట్టడానికి పంపిస్తే దెబ్బలు తగిలించుకొని వచ్చారు సిగ్గు ఉందా అని తిడుతుంది. దానికి వాళ్లు మేం ప్రయత్నించాం. కానీ, ఫలితం రాలేదు అని శ్రుతి కామాక్షి చెబుతారు.

ముగ్గురు టెన్షన్

మీకు ఏ పని అప్పగించిన సరిగా చేయరు అనేసి వాళ్లను తిడుతుంది శాలిని. శ్యామల నెక్ట్స్ పోటీ ఏం నిర్వహిస్తుందో అని ముగ్గురు టెన్షన్ పడతారు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం