నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శాలినికి ఇంటి బాధ్యతలు అప్పజెప్పడంపై చంద్రకళ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దాంతో తోడి కోడళ్లు అయిన చంద్రకళ, శాలిని మధ్య శ్యామల పోటీ పెడతానంటుంది. దానికి ఇంట్లో వారందరూ ఒప్పుకుంటారు.
తర్వాత జగదీశ్వరి దగ్గరికి వచ్చిన కామాక్షి చంద్రకళ ఈ ఆస్తి పోటీలో పాల్గొనడానికి ముఖ్య ఉద్దేశం ఏదో ఉంది. తనకు ఈ ఆస్తి మీద కన్నుంది. అందుకే నిన్న మనతో ఇంటి బాధ్యతలు ఎవరికైనా అప్పజెప్పండి నాకు అవసరం లేదు అని చెప్పి ఇప్పుడు తను కూడా ఈ ఇంటి బాధ్యతలు కావాలంటుంది. దీని వెనకాల ఏదో మర్మం ఉంది అంటుంది.
అప్పుడే అక్కడికి చంద్రకళ వస్తుంది. జగదీశ్వరితో శాలిని ఈ ఇంటిని కొల్లగొట్టడానికి పగ పట్టి ఇక్కడికి వచ్చిందన్న విషయం చెప్పుదామని చంద్రకళ అనుకుంటుంటే జగదీశ్వరి మాట వినకుండా రివర్స్‌లో తిడుతుంది. చంద్రకళని అత్త జగదీశ్వరి దూషిస్తుంది. తననే జగదీశ్వరి దోషిగా చూడటంతో ఏం చేయలేక చంద్రకళ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్లిపోతుంది.
అయితే, చంద్రకళను జగదీశ్వరి తిట్టిన మాటలు విరాట్ వింటాడు. శాలిని పన్నిన పన్నాగం గురించి విరాట్‌కు అయిన చంద్రకళ చెప్పాలనుకుంటుంది. విరాట్‌తో శాలిని గురించి చంద్రకళ చెబితే.. ఇదొక కొత్త నాటకం. ఇది ఒక కొత్త కథ అల్లుకొని వచ్చావా. చాలా బాగుంది అని చంద్రకళనే తిడతాడు విరాట్.
అసలు ఇంటి ఆస్తిని కొల్లగొట్టే పన్నాగం పన్నింది శాలిని కాదు నువ్వే అన్న అనుమానం నాకు కలుగుతుంది అన్నట్టు విరాట్ మాట్లాడుతాడు. దాంతో చంద్రకళకు ఏం మాట్లాడాలో తెలియక, ఏం చేయాలో తోచక ఆలోచిస్తూ అక్కడే బాధపడుతూ ఉండిపోతుంది. తాను ఏం చేయకున్న చంద్రకళ దోషిలా అందరితో అడుగడుగునా అవమానాలు పడుతుంది.
అనంతరం శాలిని దగ్గరికి చంద్రకళ వెళ్తుంది. ఈ పోటీలో నువ్వెలా గెలుస్తావో నేను చూస్తానని శాలిని చాలెంజ్ విసిరితే.. నీ ప్లాన్ అంతా నాకు తెలిసిపోయింది. నవ్వు కూడా ఈ పోటీలో ఎలా గెలుస్తావో నేను చూస్తాను అని శాలినికి సవాల్ విసురుతుంది చంద్రకళ. ఇద్దు వాదోపవాదాలు చేసుకుంటారు.
మరుసటి రోజు ఉదయాన్నే శ్యామల అందరిని పిలుస్తుంది. నేను మొత్తానికి పోటీ పెట్టడానికి నిర్ణయించుకున్నాను. అది ఈరోజు అవుతుంది మొదటి పోటీ ఏంటంటే వంట వండే కార్యక్రమం. అది ఎలాంటి వంట అంటే.. నూనె, మంట, పోయి గ్యాస్ ఏమి వాడకుండా మీరు వంట వండి మా అందరిని మెప్పించగలిగితే ఎవరూ బాగా చేశారు దాన్ని బట్టి ఆ పోటీలో ఎవరు గెలుస్తారో అన్నది నిర్ణయిస్తామని శ్యామల చెబుతుంది.
ఆ పోటీకి ఇంట్లో వాళ్లందరు అంగీకరిస్తారు. కానీ, శాలిని అసలు వంటే రాదు. ఏం వండుతుంది అని కామాక్షి, శ్రుతి సెటైర్లు వేసుకుంటారు. తర్వాత చంద్రకళ, శాలిని ఇద్దరిని మొదటి పోటీకి సిద్ధం కండి అని శ్యామల చెబుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్