నిన్ను కోరి సీరియల్ నేటి మే 26వ తేదీ ఎపిసోడ్‍లో.. మామయ్య రఘురాం గది దగ్గరికి చంద్రకళ వస్తుంది. మంచంపై ఉన్న రఘురాంకు చెమటలు పట్టడాన్ని చంద్ర గమనిస్తుంది. అత్తయ్య ఇక్కడ లేనట్టు ఉన్నారని అనుకుంటుంది. ఏసీ పని చేయలేదని చూస్తుంది. దీంతో ఫ్యాన్ ఆన్ చేస్తుంది. రఘురాం ముఖానికి చెమట తుడుస్తుంది. మీరేమే మీ ఇబ్బందులు చెప్పుకోలేరు.. ఎంత కష్టంవచ్చిందని చంద్ర బాధపడుతుంది. కొంగుతో గాలి విసురుతుంటుంది.
రఘురాం దగ్గర చంద్రకళ ఉండడాన్ని చూసి జగదీశ్వరి ఆగ్రహిస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధిరాదా.. అసలు నువ్వు మనిషివేనా అని తిడుతుంది. ఈ రూమ్‍లోకి రావొద్దని మళ్లీమళ్లీ మొత్తుకున్నా ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రశ్నిస్తుంది. మామయ్యకు చెమటలు పట్టేసి ఉంటే.. ఫ్యాన్ వేసేందుకు వెళ్లానని అంటుంది. ఇంతలో జగదీశ్వరిని రెచ్చగొడతారు శాలినీ, శృతి, కామాక్షి. కావాలనే ఆ గదిలోకి చంద్ర వెళ్లిందని అంటారు.
ఆ ముగ్గురి మాటలతో చంద్రపై జగదీశ్వరి కోపం మరింత పెరుగుతుంది. వదిన చెప్పేది వినొచ్చు కదా అని క్రాంతి అంటాడు. ఏంటి తనకు సపోర్ట్ చేస్తున్నావని శృతి వారిస్తుంది. మామయ్యకు ఆ గతి పట్టించిందే చంద్ర కదా అని అంటుంది. నిజం ఆలోచించకుండా నిందించడం కరెక్టా అని క్రాంతి అంటాడు. ఏం జరిగినా సరే తను ఈ గదిలోకి అడుగుపెట్టేందుకు వీలు లేదు అంతే అని జగదీశ్వరి అంటుంది. నన్ను లేకపోతే ఎవరినైనా పిలవచ్చు కదా అని చంద్రపై ఫైర్ అవుతుంది.
నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని అంటుంది. శృతి మరింత రెచ్చగొడుతుంది. తనలో తాను చాలా వేదన పడుతున్నానని జగదీశ్వరి అంటుంది. నీ వల్లే నా భర్తకు ఈ గతి పట్టిందని చంద్రను నానా మాటలు అంటుంది. స్వార్థంతో ఆయనకు చెమటలు పట్టేలా చేసి.. నువ్వే సపర్యలు చేస్తున్నట్టు నటిస్తున్నావా అని నిందలు వేస్తుంది. “ఇంత పాడుబుద్ధి ఎలా వచ్చిందే నీకు. నా దరిద్రానికి దాపురించావ్ కదే” అని జగదీశ్వరి ఫైర్ అవుతుంది.
దీంతో చంద్రకళ కన్నీళ్లు పెట్టుకుంటుంది. తాను చెప్పేది నిజమని అంటుంది. చంద్రను వదలొద్దని జగదీశ్వరితో కామాక్షి అంటుంది. మీరు ఎక్కడికి వెళ్లారని అందరినీ అరుస్తుంది జగదీశ్వరి. వదిన నువ్వు ఏమీ అనుకోవద్దని చంద్రను క్రాంతి ఓదారుస్తాడు. అమ్మకు ఇంకా కోపం తగ్గలేదని అంటాడు.
ఏసీ ఇంత హైలో ఉంటే తాను పడుకోలేనన విరాట్‍తో చంద్ర అంటుంది. ఏసీ ఇంకా పెంచేస్తే రూమ్‍లో ఉండలేవని విరాట్ అనుకుంటాడు. ఏసీని మరింత పెంచేస్తాడు. కూల్‍ను చంద్ర తగ్గించకుండా రిమోట్‍లో సెల్స్ తప్పుగా పెట్టేస్తాడు విరాట్. ఏంటి మరీ కూలింగ్ ఎక్కువగా పెట్టేశావని చంద్ర అంటుంది. నీ ఇష్టం ఉండే పడుకో లేకపోతే లేదు అని విరాట్ అంటాడు.
రిమోట్ నొక్కి.. పని చేయడం లేదేంటి అని చంద్ర అడుగుతుంది. సెల్స్ రివర్స్ చేశానని విరాట్ చెబుతుంది. బయటికి వెళ్లాలంటే కాళ్లు పట్టుకొని బతిమాలాలని విరాట్ అంటాడు. ఎందుకు మామూలుగానే వెళతానని చంద్ర అంటుంది. అయితే, తలుపుకు లాక్ వేసి ఉంటాడు విరాట్. నన్ను బయటికి వెళ్లనివ్వు అని చంద్ర అడుగుతుంది. ఏసీ కూలింగ్‍ను కూడా షేర్ చేసుకుందామని విరాట్ అడుగుతాడు. రూమ్‍లోకి ఎప్పుడూ రానని కాళ్లు పట్టుకొని బతిమాలాలని అంటాడు. దుప్పటి కూడా లేకుండా చేశానంటాడు. చంద్ర చలికి అల్లాడుతుంటుంది. విరాట్ మాత్రం అలాగే పడుకుంటాడు. విరాట్ కింద ఉన్న బెడ్‍షీట్ లాక్కొని కప్పుకుంటుంది చంద్ర. విరాట్ చలికి వణుకుతాడు. దీంతో నిన్ను కోరి నేటి మే 26 ఎపిసోడ్ ఫినిష్ అయింది.
సంబంధిత కథనం