NNS December 10th Episode: గుప్తను దెబ్బకొట్టిన అరుంధతి- డేంజర్ స్నేక్ జోన్‌లో మిస్సమ్మ- ఆకాష్‌కు కనిపించిన పెద్ద పాము-nindu noorella savasam serial december 10th episode arundhathi reverse plan to gupta zee telugu serial nns today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns December 10th Episode: గుప్తను దెబ్బకొట్టిన అరుంధతి- డేంజర్ స్నేక్ జోన్‌లో మిస్సమ్మ- ఆకాష్‌కు కనిపించిన పెద్ద పాము

NNS December 10th Episode: గుప్తను దెబ్బకొట్టిన అరుంధతి- డేంజర్ స్నేక్ జోన్‌లో మిస్సమ్మ- ఆకాష్‌కు కనిపించిన పెద్ద పాము

Sanjiv Kumar HT Telugu
Dec 10, 2024 06:51 AM IST

Nindu Noorella Saavasam December 10th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 10 ఎపిసోడ్‌‌లో అరుంధతిని గీత దాటమని గుప్త రెచ్చగొడుతుంటాడు. ఆఖరికి అరుంధతి రేఖ దాటుతుంది. దాంతో మనం అనుకున్న ప్రణాళిక ఫలించిందని యముడితో గుప్తా అంటాడు. మరోవైపు డేంజర్ స్నేక్‌ జోన్‌లోకి మిస్సమ్మ వెళ్తుంది.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ డిసెంబర్ 10 ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ డిసెంబర్ 10 ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌ (NNS 10th December Episode)లో గుప్త గీసిన బంధంలోంచి బయటకు రాలేక ఇబ్బంది పడుతుంటుంది అరుంధతి. ఇంతలో ఆరు దగ్గరకు గుప్త వచ్చి నీ పిల్లలు ప్రమాదంలో ఉంటే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి..? వెళ్లు వెళ్లి నీ పిల్లపిచ్చుకలను కాపాడుకో అంటాడు.

ధర్మ మూర్తులైన మీరే

అయినా ఈ గుప్త గీసిన గీతను దాటి వెళ్లితే ఏదైనా ప్రమాదం జరగుతుందని బయపడుతున్నావా..? అనగానే గుప్త గారు మీరు ఇదంతా కావాలనే చేస్తున్నారని నాకు తెలుసు అంటుంది అరుంధతి. నువ్వు నాకు తెలుసు అంటావు. కానీ, నీకేమీ తెలియదని నాకు తెలుసు అంటాడు గుప్త. అన్ని తెలిసిన ధర్మ మూర్తులైన మీరే మౌనంగా ఉంటే నన్నేం చేయమంటారు అని అడుగుతుంది.

ఇంత మాట్లాడుతున్నావు. కానీ, నీ పిల్లలను రక్షించుకోవడానికి వెళ్లడం లేదు అంటాడు గుప్త. నా పిల్లలను కాపాడటానికి మా ఆయన ఉన్నారు. మిస్సమ్మ ఉంది. ఇక నా పిలల్లకు ఏమీ కాదు అంటుంది అరుంధతి. దాంతో గుప్త నవ్వుతాడు. నువ్వు ఈ రేఖ దాటి వెల్లెదవో లేక ఇక్కడే ఉంటావో నీ ఇష్టం అని గుప్త చెప్పగానే దేవుడు న్యాయాన్ని గెలిపిస్తాడు గుప్తగారు ఆ నమ్మకంతోనే నేను ఇప్పుడు ఈ రేఖను దాటుతున్నాను.. అంటూ అరుంధతి రేఖ దాటగానే గుప్త గట్టిగా నవ్వుతూ యముడిని పిలుస్తాడు.

దెబ్బకొట్టిన అరుంధతి

మనం అనుకున్నది సాధించాము. ఆ బాలిక రేఖ దాటింది. ఆ బాలిక నాకన్నా ముందుగానే యమపురికి వస్తుంది అని చెప్పగానే యముడు కోపంగా గుప్తను తిడుతూ ఆ బాలిక అమావాస్య గడియలు మొదలైన తర్వాత రేఖ దాటిందని.. నీకు గుర్తు లేనిది ఆ బాలిక గుర్తు పెట్టుకుని నిన్ను దెబ్బ కొట్టిందని కోప్పడతాడు యముడు. తర్వాత గుప్తను హెచ్చరించి తిరిగి అమావాస్య నాడు ఆ బాలికను తీసుకుని రమ్ము అని చెప్పి వెళ్లిపోతాడు యముడు.

మరోవైపు పిల్లలను పాత బంగ్లాలోకి తీసుకెళ్లిన రౌడీలు.. వాళ్లందరిన్ని ఒక గదిలో బంధిస్తారు. చుట్టు రౌడీలు కాపలా ఉంటారు. పిల్లలు అందరూ భయంతో ఏడుస్తుంటారు. అంజు మాత్రం ఎవ్వరూ కంగారు పడకండి మా డాడీ వస్తారు అందరినీ కాపాడతారు అని చెప్తుంది. తర్వాత అరవింద్‌ ఆర్మీ ఆఫీసర్‌కు ఫోన్‌ చేసి పిల్లలకు ఏమైనా అవ్వడం అవ్వకపోవడం అంతా మీ చేతుల్లోనే ఉంది. పిల్లలు ఇవాళ ఈ పరిస్థితుల్లో ఉన్నారంటే దానికి కారణం మీరు అమరేంద్రనే అని అంటాడు.

ఒంటరిగా పంపించాలి

ఫస్ట్‌ టైం నేను కిడ్నాప్‌ చేసినప్పుడే నేను అడిగినవన్నీ నాకు ఇచ్చేసి ఉంటే నా పని నేను చేసుకునే వాణ్ని అని అరవింద్ అంటాడు. దీంతో ఆఫీసర్‌ నీకేం కావాలో అడుగు ఇస్తాం అని అడగ్గానే మా వాళ్లందరినీ మాకు అప్పగించాలని.. మేము ఇక్కడి నుంచి సేఫ్‌గా వెళ్లాలి ఆ అమరేంద్రను ఒంటరిగా మా దగ్గరకు పంపించాలి అని డిమాండ్‌ చేస్తాడు అరవింద్.

అమర్‌ తప్పా అన్ని డిమాండ్లకు ఓకే చెప్పినా అరవింద్ ఒప్పుకోడు. ఫారెస్టులో స్కూల్‌ బస్సు ఆగిన దగ్గరకు అమర్‌, రాథోడ్‌, మిస్సమ్మ.. ఫారెస్టు ఆఫీసర్లు వస్తారు. బస్సులో ఎవ్వరూ లేకపోవడం చూసి మిస్సమ్మ కంగారు పడుతుంది. ఏవండి బస్సు ఇక్కడే ఉంది. పిల్లలు మాత్రం ఇక్కడ లేరండి.. ఎక్కడికి తీసుకెళ్లిపోయారో అని బాధపడుతుంది మిస్సమ్మ.

ముందుగానే రౌడీలు

రోడ్డు ఇక్కడితో ఎండ్‌ అయింది. అంటే పిల్లలను తీసుకుని ఇటు సైడు వెళ్లి ఉంటారు అని అమర్ రౌడీలు పిల్లలను తీసుకుని వెళ్లిన సైడు వెళ్తుంటాడు. అందరూ అమర్‌ను ఫాలో అవుతారు. కొద్ది దూరం వెళ్లాక రౌడీల వ్యాన్‌ కనిపిస్తుంది. బస్సులో వచ్చిన రౌడీల కంటే ముందే ఇక్కడకు కొంత మంది రౌడీలు ఈ వ్యాన్‌‌లో వచ్చినట్టు ఉంది సార్‌ అని రాథోడ్‌ చెప్తాడు.

ఇంతలో అమర్‌ పిల్లలను ఎక్కడికి తీసుకెళ్లారో తెలిసింది. నడుస్తూ ఈ అడవిలో ఎక్కువ దూరం వెళ్లడానికి రాదు. కాబట్టి పిల్లలు మన చుట్టు పక్కలే ఉండి ఉంటారు అని అమర్‌ చెప్పగానే అందరూ వెతుకుతూ వెళ్తారు. వాళ్లకు డేంజర్‌ స్నేక్‌ జోన్‌ కనిపిస్తుంది. లోపలికి వెళ్లొద్దని ఫారెస్ట్‌ ఆఫీసర్లు హెచ్చరిస్తారు. అయినా మిస్సమ్మ లోపలికి వెళ్దామని చెప్తుంది.

పెద్ద పామును చూసి

దీంతో అమర్‌ అందరు పిల్లలను నేను కాపాడతాను. మన నలుగురి పిల్లలనే కాదు అక్కుడున్న అందరి పిల్లల మీద చిన్న గీత కూడా పడకుండా బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది అని భరోసా ఇస్తాడు అమర్‌. అరవింద్ ఆలోచిస్తూ కూర్చుని ఉంటే.. అనుచరుడు వచ్చి పోయిన సారి కూడా అమరేంద్ర రాత్రి వరకు లేట్ చేసి తర్వాత అపరేషన్‌ చేసాడు అన్న అని చెబుతాడు.

అవును.. మన వాళ్లను గుట్ట మీదకు పంపించి అమరేంద్ర ఏమైనా ప్లాన్‌ చేస్తున్నాడేమో కనుక్కోమని చెబుదాం అంటాడు అరవింద్. బంటి ఆకలి వేస్తుందని బాధపడుతుంటే అంజు, అమ్ము, ఆనంద్‌ తిడతారు. ఆకాష్‌ కిటికీలోకి చూడగానే పెద్ద పాము కనిపిస్తుంది. ఆ పామును చూసిన ఆకాష్‌ స్పృహ తప్పి పడిపోతాడు. అక్కడితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner