NNS January 3rd Episode: తల్లి అస్థికలు మాయం చేసిన అంజు.. అవాక్కైన మిస్సమ్మ, రాథోడ్.. చీకట్లో మనోహరి, ఘోరా బతుకు!-nindu noorella savasam january 3rd episode anju theft arundhathi bones and manohari afraid zee telugu nns today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns January 3rd Episode: తల్లి అస్థికలు మాయం చేసిన అంజు.. అవాక్కైన మిస్సమ్మ, రాథోడ్.. చీకట్లో మనోహరి, ఘోరా బతుకు!

NNS January 3rd Episode: తల్లి అస్థికలు మాయం చేసిన అంజు.. అవాక్కైన మిస్సమ్మ, రాథోడ్.. చీకట్లో మనోహరి, ఘోరా బతుకు!

Sanjiv Kumar HT Telugu
Jan 03, 2025 11:14 AM IST

Nindu Noorella Saavasam January 3rd Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 3 ఎపిసోడ్‌‌లో అరుంధతి అస్థికలు ఎవరు తీశారని మనోహరి, ఘోరా తల బాదుకుంటారు. అవి దొరక్కుంటే మనిద్దిరి ప్రయాణం చీకట్లోకే అని ఘోరా అంటాడు. మరోవైపు సీసీ టీవీలో అంజు అస్థికలు తీసుకెళ్లడం చూసి అవాక్కవుతారు మిస్సమ్మ, రాథోడ్.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జనవరి 3 ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జనవరి 3 ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌ (NNS 3rd January Episode)లో అస్థికలు ఎవరు తీసుకెళ్లారు మనోహరి.. నేను రాత్రి అసలు ఆ ఇంటికే రాలేదు. అమర్‌ కంట పడితే నా చావు నేనే కొనితెచ్చుకున్నట్లే కదా అంటాడు ఘోరా. దాంతో మనోహరి షాక్‌ అవుతుంది.

yearly horoscope entry point

ఇద్దరి ప్రయాణం చీకట్లోకే

అయిపోయింది అంతా అయిపోయింది. అస్థికలు పోయుంటాయి. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు అమర్‌ నా నిజస్వరూపం తెలుసుకుంటాడు అంటూ భయపడుతుంది మనోహరి. ఆత్మ తీసి ఉండొచ్చు కదా..? అంటాడు ఘోరా. ఆత్మకు స్పర్శ పోయింది కదా ఘోరా అంటుంది మనోహరి. మరి అలా అయితే ఎవరు తీసి ఉంటారని ఆలోచిస్తుంది మనోహరి. ఆ అస్థికలు కానీ దొరక్కపోతే మన ఇద్దరి ప్రయాణం చీకట్లోకే మనోహరి అంటాడు ఘోర.

మరోవైపు గుప్త గార్డెన్‌లో అటూ ఇటూ తిరుగుతూ.. బాధపడుతూ.. ఎందుకు ప్రభు నన్ను ఇక్కట్ల పెట్టి ఉంటివి అంటూ బాధపడుతుంటే.. యముడు వస్తాడు. ఏమైందని అడుగుతాడు యముడు. ఏమో ప్రభు అంతా గందరగోళంగా ఉంది. నా దివ్య దృష్టి కూడా పని చేయడం లేదు అని చెప్తాడు గుప్త. దీంతో నువ్వు ఆ బాలికకు చేసిన సాయం వల్లే ఈ శిక్ష.. త్వరలోనే సమసిపోతుందిలే అంటాడు యముడు. అయితే ఆ అస్థికలు ఎవరు తీసుకెళ్లారు ప్రభు ఆ ఘోర తీసుకెళ్లాడేమోనని భయంగా ఉంది అంటాడు గుప్త.

మధ్యలో వచ్చి చెడగొట్టావ్

అస్థికలు ఇల్లు దాటి వెళ్లలేదు. ఇంటిలోనే ఉన్నాయి అని యముడు చెప్పగానే.. గుప్త హ్యాపీగా ఫీలవుతాడు. ఆ ఆస్తికలు తీసింది ఎవరు అని అడగ్గానే చెప్పకుండా యముడు మాయం అయిపోతాడు. ఇంతలో సంతోషంగా అరుంధతి పరుగెత్తుకొచ్చి నా ఆస్తికలు ఎవరో తీసుకెళ్లారట.. వెంటనే మీ మాయా పేటికను తెరచి ఎవరు తీసుకెళ్లారో చూడండి అని అడుగుతుంది. నా బాధలో నేను ఉంటే మధ్యలో వచ్చి చెడగొట్టావు అంటాడు గుప్తా.

అస్థికలు ఎక్కడ ఉన్నాయి అని మళ్లీ అడుగుతుంది అరుంధతి. ఇంట్లోనే ఉన్నాయి అని చెప్తాడు గుప్త. మిస్సమ్మ వంట చేస్తూ.. రాథోడ్ కోసం ఎదురుచూస్తుంది. ఇంతలో రాథోడ్ రాగానే కిచెన్‌‌లోకి తీసుకెళ్లి.. నీకు ఏం చెబితే ఏం చేశావు.. మనోహరి అస్థికలు ఎత్తుకెళ్లిపోతుంది. అక్కడ కెమెరా పెట్టమని చెబితే కెమెరానే పెట్టకుండా.. అస్థికలే తీసుకెళ్తావా..? అని మిస్సమ్మ అడగ్గానే.. నేనెందుకు తీస్తాను నేను తీయలేదు మిస్సమ్మ అంటాడు రాథోడ్‌.

దీంతో అస్థికలు నువ్వు కూడా తీయకపోతే ఇప్పుడు అవి ఎవరి చేతులో ఉన్నాయో వాళ్లు ఏం చేస్తున్నారో తలుచుకుంటేనే భయం వేస్తుంది అని మిస్సమ్మ అంటుంది. అయితే అస్థికలు ఎవరు తీశారో ఇప్పుడే వెళ్లి కనిపెడదాం పద మిస్సమ్మ అంటాడు రాథోడ్‌. ఎలా అని మిస్సమ్మ అడగ్గానే.. నా లాప్‌ టాప్‌ ఓపెన్‌ చేస్తే కనిపిస్తుంది అని చెప్పి లాప్‌ టాప్‌ తీసుకొస్తాడు రాథోడ్‌. సీసీటీవీ పుటేజీ ఓపెన్‌ చేసి చూస్తే అందులో అంజు పాప వచ్చి అస్థికలు ఎత్తుకెళ్లినట్టు కనిపిస్తుంది.

పిల్లలు షాక్

దాంతో మిస్సమ్మ, రాథోడ్‌ షాక్ అవుతారు. తన రూమ్‌లో అరుంధతి అస్థికలు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అంజు. అమ్మా అంటూ పిలుస్తుంది. అంజు అమ్మా అని పిలవగానే గార్డెన్‌లో ఉన్న అరుంధతి అంజు నన్ను పిలిచినట్టు అనిపించింది అని ఆరు లోపలికి పరుగెట్టుకెళ్తుంది. అంజు చేతిలో అస్థికలు చూసి షాక్ అవుతుంది అరుంధతి. ఇంతలో ఆనంద్‌, ఆకాష్‌, అమ్ము రాగానే అస్థికలు దాచిపెడుతుంది అంజు.

ఏం దాస్తున్నావు అంజు అని ఆకాష్‌ అడగ్గానే.. అంజు ఆస్థికలు తీసి చూపిస్తుంది. పిల్లలు ముగ్గురు షాక్ అవుతారు. నాన్నా కనిపించకుండా పోయాయి అన్న అస్థికలు నీ దగ్గరకు ఎలా వచ్చాయి అని అమ్ము అడుగుతుంది. నైట్‌ అందరూ పడుకున్నాక నేనే అమ్మ అస్థికలు తీసుకొచ్చాను అని చెప్తుంది అంజు. అస్థికలు తీసింది నువ్వే అని తెలిస్తే డాడ్‌ ఎంత కోప్పడతారో తెలుసా అంటాడు ఆనంద్‌. నేను ఎవ్వరికీ ఇవ్వను అస్థికలు నాతో ఉంటే అమ్మ నాతో ఉంటుంది కదా అంటుంది అంజు.

దీంతో అమ్ము, ఆనంద్‌, ఆకాష్‌ ముగ్గురు కలిసి అంజును కన్వీన్స్‌ చేయాలని చూస్తారు. అయినా అంజు వినదు. దాంతో అంజు చేతిలోంచి అస్థికలు లాక్కోవడానికి అమ్ము ప్రయత్నిస్తుంది. ఇద్దరి పెనుగులాటలో అస్థికలు కిందపడబోతుంటే అమర్‌ వచ్చి పట్టుకుంటాడు. అమర్‌ను చూసిన అంజు భయంతో వణికిపోతుంది.

నాక్కూడా ఇష్టం లేదు

వెంటనే అస్థికలు అంజుకు ఇచ్చిన అమర్‌ నాక్కూడా అమ్మను పంపడం అస్సలు ఇష్టం లేదు అని చెప్తాడు. అంతా పక్కనే ఉండి గమనిస్తున్న అరుంధతి ఏడుస్తుంది. అక్కడితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner