Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్ (NNS 30th December Episode)లో అరుంధతి అస్థికల కోసం మనోహరి వచ్చిందని అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ అమర్‌కు చెబుతాడు. దాంతో అమర్‌కు కోపం వస్తుంది.
అయితే, అమర్‌కి కట్టుకథ చెప్పి తప్పించుకుంటుంది మనోహరి. ఇకపై తనమీద అనుమానం రాకుండా జాగ్రత్త పడాలి అనుకుంటుంది. మరోవైపు గుప్త ఆకాశంలోకి చూస్తూ బాధపడుతూ ప్రభూ గతంలో నేను ఏవో చిన్న చిన్న తప్పిదాలు చేసినందుకు నన్ను ఈ నరకానికి పంపారా..? అని బాధపడుతుంటాడు. నాకెందుకు ఈ శిక్ష వేశారు. నేను వద్దంటున్నా నన్ను ఆ బాలిక వెంట పంపిచారు అంటూ ఎమోషనల్ అవుతుంటే వెనక నుంచి అరుంధతి వచ్చి గుప్తగారు అంటూ అరుస్తుంది.
ఏం మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా..? ఎందుకు రాజు గారికి చాడీలు చెప్తున్నారు అని అడుగుతుంది. నేను చెప్తున్నది జరిగిన దాని గురించి కాదు. జరగబోయే దాని గురించి అంటాడు గుప్త. అవునా ఏం జరగబోతున్నది అని అరుంధతి అడుగుతుంది. నీ పతి దేవుడు నీ అస్థికలు తీసుకుని వస్తున్నాడు. అవి తీసుకొచ్చి నీ ఫోటో ముందు పెడతాడు అని గుప్త చెప్పగానే అయితే మిస్సమ్మ నా ఫోటో చూస్తుంది. మిస్సమ్మకు నిజం తెలుస్తుంది అని అరుంధతి షాక్ అవుతుంది.
అదే జరిగితే మిస్సమ్మ అందరికీ నిజం చెప్పేస్తుంది. వాళ్లు కాని మిస్సమ్మ మాటలు నమ్మలేదనుకో ఆ మనోహరి మిస్సమ్మకు పిచ్చి పట్టిందని నమ్మించి మిస్సమ్మను ఆయనకు దూరం చేస్తుంది అని బాధపడుతుంది. ఇంతలో అమర్ అస్థికలు తీసుకుని వస్తాడు. దీంతో ఇక అంతా అయిపోయింది. మనం ఇన్నాళ్లు కష్టపడి దాచిపెట్టిన రహస్యం బయటపడుతుంది అంటాడు గుప్తా. వెంటనే అరుంధతి కిటికీ దగ్గరకు వెళ్తుంది.
మిస్సమ్మ అందరినీ భోజనానికి పిలుస్తుంది. ఇంతలో అమర్ ఆస్తికలతో ఇంట్లోకి వస్తాడు. అస్థికలు నదిలో కలుపుతున్నాం కదా..? అప్పటిదాకా ఇంట్లో పెడితే మంచిదని తీసుకొచ్చాను అని చెప్తాడు అమర్. చాలా మంచి పని చేశావు నాన్నా తీసుకెళ్లి నీ గదిలో పెట్టు అని నిర్మల చెప్తుంది. ఇంతలో అంజు వెళ్లి డాడ్ ఒక్కసారి ముట్టుకోవచ్చా..? అని ఆస్తికలు తీసుకుని హాయ్ అమ్మా నన్ను చూస్తుంటావు అని స్వామిజీ చెప్పాడు. ఇప్పుడు కూడా చూస్తుంటావా..? అంటూ ఎమోషనల్ అవుతుంది.
పిల్లలు అందరూ కలిసి అస్థికలు పట్టుకుని బాధపడుతుంటారు. కిటికీలోంచి చూస్తున్న అరుంధతి ఏడుస్తుంది. నువ్వు పోగోట్టుకున్న మీ అక్కను నేను మళ్లీ తీసుకురాలేను మిస్సమ్మ. కానీ, ఆఖరి సారిగా మీ అక్క అస్థికలను నువ్వు ముట్టుకునేలా చేయడం అని మనసులో అనుకుని అస్థికలు మిస్సమ్మకు ఇస్తాడు అమర్. అస్థికలు తీసుకున్న మిస్సమ్మ ఎమోషనల్ అవుతుంది. నా మనసు ఎందుకండి ఇంతలా ఆరాటపడుతుంది అని అమర్‌ను అడుగుతుంది.
ఎందుకంటే ఆవిడ నీ తొడబుట్టినది కనుక అని రాథోడ్, గుప్త మనసులో అనుకుంటారు. అరుంధతికి నీకు మధ్య ఏజన్మలోనో రక్తసంబంధం ఉన్నట్టు ఉంది. అందుకే అమర్‌కు తను దూరం అవుతూ.. నిన్ను దగ్గర చేస్తుంది అని నిర్మల చెప్పగానే.. మిస్సమ్మ అస్థికలు అమర్ రూంలో పెట్టు అని శివరామ్ చెబుతాడు. దాంతో స్వామిజీ అస్థికలు అరుంధతి ఫోటో ముందు పెట్టి దీపం పెట్టమన్నారు అని చెప్పగానే మనోహరి షాక్ అవుతుంది.
టాపిక్