NNS October 11th Episode: అక్కాచెల్లెళ్ల తీన్మార్ డ్యాన్స్​.. భాగీకి ముద్దుపెట్టి మురిసిన ఆరు.. కథలో అద్భుతమైన ట్విస్ట్!-nindu noorella saavasam serial october 11th episode arundhathi bhagamathi dance nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns October 11th Episode: అక్కాచెల్లెళ్ల తీన్మార్ డ్యాన్స్​.. భాగీకి ముద్దుపెట్టి మురిసిన ఆరు.. కథలో అద్భుతమైన ట్విస్ట్!

NNS October 11th Episode: అక్కాచెల్లెళ్ల తీన్మార్ డ్యాన్స్​.. భాగీకి ముద్దుపెట్టి మురిసిన ఆరు.. కథలో అద్భుతమైన ట్విస్ట్!

Sanjiv Kumar HT Telugu

Nindu Noorella Saavasam October 11th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 11వ తేది ఎపిసోడ్‌‌లో అరుంధతికి స్పర్శ జ్ఞానం, ఏం అనుకుంటే అది జరిగే అద్భుతమైన పవర్స్ వస్తాయి. దీంతో అరుంధతి తీన్మార్ డ్యాన్స్ వేస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 11వ తేది ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌ (NNS 9th October Episode)లో మనోహరిని కాలు అడ్డు పెట్టి పడేసిన అరుంధతి తనకు స్పర్శ శక్తి వచ్చిందని తెలుసుకుంటుంది. గుప్త కావాలనే తనకు వచ్చిన శక్తుల గురించి తెలియకుండా చేస్తున్నాడని కోపంగా బయటకు వెళ్తుంది.

నాకేం తెలియదు

అరుంధతికి స్పర్శ వచ్చిందనే విషయం తెలియకుండా చేయాలని గుప్త ఆలోచిస్తుంటాడు. అరుంధతి అక్కడకు వచ్చి వెటకారంగా మాట్లాడుతుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు గుప్త. ఇవాళ ఉదయం నుంచి నేను అనుకున్నవి జరిగిపోతున్నాయి. నాకు స్పర్శ శక్తి వచ్చింది కదా అని అడుగుతుంది అరుంధతి. గుప్త తనకేం తెలియదని చెప్తాడు.

అయితే నేనే వెళ్లి తేల్చుకుంటాను అని లోపలికి వెళ్తుంటే నువ్వనుకున్నది నిజమే బాలిక అంటాడు. నాలుగు మండలముల పాటు ఆత్మ భూలోకంలో ఉన్నచో ఆ ఆత్మకు శక్తులు లభించును. నీవు దేనినైననూ తాకవచ్చును. నీ మనసును ఏదైనా సంకల్పించుకున్నచో అది కచ్చితంగా జరుగును. కానీ, ఒక్కమాట నీ శక్తులను నువ్వు దుర్వినియోగ పరిచినచో ఆ వరమే నీకు శాపం అగును అని గుప్త చెబుతాడు.

దాంతో అరుంధతి పలకకుండా గుప్తకు దూరంగా వెళ్లి అటూ ఇటూ చూసి తీన్మార్‌ డాన్స్‌ చేస్తుంది. ఇంతలో స్కూల్‌ నుంచి వచ్చిన భాగీ కూడా కలిసి అరుంధతితో కలిసి డాన్స్‌ చేస్తుంది. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ డాన్స్​ చేస్తుంటే.. ఊ.. బాగున్నది బాగున్నది.. అంటాడు గుప్త. అక్కా ఇప్పుడు చెప్పండి ఎందుకక్కా ఇంత ఆనందంగా ఉన్నారు అని అడుగుతుంది భాగీ.

ఎటులకు దారితీయునో

మిస్సమ్మ ఈ కథలో ఎవ్వరూ ఊహించలేని ఒక అధ్బుతమైన ట్విస్ట్‌ ఒకటి జరిగింది. అంటే దొరికింది. ఆ ట్విస్టు వల్ల నాకైతే చాలా మేలు జరగనుంది. అందుకే ఇంత ఆనందంగా ఉన్నాను అంటుంది ఆరు. చిన్నారుల వల్లే ఒకరి సంతోషాన్ని ఒకరు ఎటుల పంచుకుంటున్నారు. ఇటువంటి వారిని ఎటుల విడదీయాలనిపించింది స్వామి. ఈ పరిచయం. ఈ కలయిక, ఈ స్నేహము, ఈ బంధము ఎటులకు దారి తీయునో.. ఎంతటి ప్రమాదం తెచ్చిపెట్టునో అని భయంగా ఉంది. జగన్నాథ నువ్వే రక్షఅనుకుంటూ వెళ్లిపోతాడు గుప్త.

మరోవైపు మనోహరి ఘోరాను కలవడానికి వెళ్తుంది. ఘోరా ఏంటి ఇక్కడికి రమ్మన్నారు. ఈ ప్లేస్‌ ఏంటి ఇంత భయంకరంగా ఉంది. నువ్వే పిలవొచ్చు కదా ఘెరా. ప్రాణం పోయింది తెలుసా? అంటుంది. మనల్ని చూసి జనాలు భయపడాలి. మనం భయపడకూడదు మనోహరి అంటాడు ఘోరా. అయినా నువ్వేంటి ఇక్కడికి మకాం మార్చావు అనగానే తమరి ప్రేమ వల్లే అంటాడు.

సరే ఏంటి అర్జెంట్‌‌గా కలవాలని ఫోన్ చేశావు అంటుంది మనోహరి. ఆత్మ భూమి మీద ఉండబట్టి 4 మండలాలు దాటింది అని ఘోరా అనగానే అయితే రేపు జిల్లాలు కూడా దాటమని చెప్తానులే అని వెటకారంగా మాట్లాడుతుంది మనోహరి. ఆ ఆత్మలో ఏవైనా మార్పులు గమనించావా? మనోహరి అని అడుగుతాడు ఘోరా. అది నాకు రోజు కనబడి హాయ్‌ చెప్తుంది. కలర్ తగ్గిందా? బరువు పెరిగిందా? అని చూడటానికి అంటున్న మనోహరి అంటుంది.

తగిలినట్లు కిందపడ్డాను

దానికి ఏంటలా మాట్లాడుతున్నావు. దయచేసి నేను అడిగిన వాటికే సమాధానం చెప్పు అంటాడు ఘోరా. నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు ఘోరా. మార్పులు అంటే ఏంటి? అంటుంది మనోహరి. అనుమానాస్పదం లాంటివి అనగానే పొద్దున నేను దానితో మాట్లాడుతుంటే ఒక కొబ్బరి బొండం నా మీద పడబోయింది అంటుంది మనోహరి. ఇంకేం జరిగింది అని అడగగానే ఇంతకు ముందు వస్తుంటే అక్కడ ఏమీ లేదు. కానీ, ఏదో తగిలినట్టు కిందపడిపోయాను అని చెబుతుంది మనోహరి.

అయితే నా అనుమానం నిజం అయింది. నాలుగు మండలాలు ఆత్మ భూమ్మీద ఉంటే ఆత్మకు శక్తులు వచ్చాయి అంటాడు ఘోరా. ఏంటి ఘోరా అసలు ఏం మాట్లాడుతున్నావు.. శక్తులు రావడం ఏంటి. అసలు ఏం శక్తులు వచ్చాయి ఘోరా అని మనోహరి అడగ్గానే ఆత్మకు స్పర్శ వచ్చిందని ఘోరా చెప్పగానే మనోహరి భయపడుతుంది. అది కచ్చితంగా నన్ను చంపేస్తుంది అని మనోహరి అంటుంది.

ఆ ఆత్మ నిన్నేం చేయదు మనోహరి అంటూ ఆత్మను బంధించడం చాలా ఈజీ అవుతుంది అని చెప్తాడు ఘోరా. మరోవైపు ఇంటికి వచ్చిన అమర్‌, మిస్సమ్మను పిలిచి అంజుకు బట్టలు కొనడానికి షాపింగ్‌కు వెళ్లాలని రమ్మని పిలుస్తాడు. సరే రెడీ అయి వస్తానని భాగీ లోపలికి వెళ్తుంది.

ఆరు ఏం చేస్తుంది

అరుంధతి శక్తులతో ఏం చేస్తుంది? అమర్​ భాగీని ఎక్కడకు తీసుకుని వెళ్తాడు? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు అక్టోబర్​ 11న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!