NNS November 20th Episode: జుట్లు పట్టుకుని భాగీ అంజు గొడవ- అరుంధతికి యమపాశం- గుప్తకు కనిపించని ఆత్మ- మనోహరి న్యూ ప్లాన్
Nindu Noorella Saavasam November 20th Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 20 ఎపిసోడ్‌లో కాంప్రమైజ్ అవ్వడానికి భాగీ, పిల్లలు మీటింగ్ అవుతారు. అక్కడ అంజును ఆటపట్టించడంతో భాగీతో గొడవ అవుతుంది. ఇద్దరు జుట్లు పట్టుకుని గొడవ పడతారు. మరోవైపు అరుంధతిని యమపాశంతో తీసుకెళ్లెందుకు రెడీగా ఉంటాడు యముడు.
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్ (NNS 20th November Episode)లో అరుంధతి ఆత్మను ఎలాగైనా అమావాస్య గడియలు ముగిసేలోపు తమ లోకానికి తీసుకుని వెళ్లాలనుకుంటాడు యముడు. అందుకు సమయం ఆసన్నమైందని అమావాస్య గడియలు మొదలయ్యాయని గుప్తుకు చెప్తాడు.
యమపాశంతో
గుప్త కంగారుగా అయితే ఆ బాలికను తీసుకొని పోయే గడియలు వచ్చేశాయా ప్రభు అంటాడు. అవునని యముడు చెప్పగానే ఆ బాలిక ఇష్టంతోనే ఇక్కడి నుంచి తీసుకెళ్లాలి అన్నారు. అది అమావాస్య ముగిసేలోపు అని చెప్పారు. ఆ బాలికకేమో ఇక్కడి నుంచి రావడానికి ఇష్టం లేదు. మరి ఆ బాలికను ఎలా తీసుకెళ్తారు ప్రభు అని గుప్త అడగ్గానే యముడు యమపాశం చూపిస్తాడు. అమావాస్య గడియలు ముగియక ముందే ఆ బాలికను తీసుకుని పోవాలి అంటాడు యముడు.
మరోవైపు పిల్లలందరూ రూంలో మీటింగ్ పెట్టుకుంటారు. మనం అందరం ఇక్కడ ఎందుకు మీట్ అయ్యామో మీకు తెలుసు కదా..? అంటుంది అమ్ము. తెలుసు.. అంటుంది భాగీ. ఏంటి అంజు తెలుసా..? తెలియదా..? అని అడుగుతుంది అమ్ము. ఏంటి అమ్ము.. అంజుకు ఒక్కసారి చెబితే ఎప్పుడైనా ఏదైనా అర్థం అయిందా..? అంటుంది భాగీ. అమ్ము అమ్మ తెలివి లేని వాళ్లకు ఏదో పేరు పెట్టి పిలుస్తారు అని చెప్పేది అంటుంది అంజు.
జుట్లు పట్టుకున్న భాగీ అంజు
కోడి బుర్ర.. అని అమ్ము చెప్పగానే ఆ పేరు ఉన్న వాళ్లను ఇన్నాళ్లు విన్నాను కానీ ఇప్పుడు ఆ పర్సన్‌ను చూస్తున్నాను అని అంజు అనగానే భాగీ, అంజు జుట్లు పట్టుకుని గొడవ పడతారు. అమ్ము మనం ఇక్కడ కాంప్రమైజ్‌కు వచ్చాం గొడవలు పడటానికి కాదు అని చెప్తుంది. అంజును స్కూల్ విషయంలో బ్లాక్ మెయిల్ చేస్తుంది భాగీ. నువ్వెంత భయపెట్టినా మా నిర్ణయం మార్చుకోం అంటుంది. నాకు ఏ మిస్సమ్మ హెల్ఫ్ అవసరం లేదు అని అంజు చెప్పగానే భాగీ నువ్వు భలే క్యూట్‌గా ఉన్నావు అంటూ అంజును కిస్ చేస్తుంది.
మరోవైపు అమర్ రూంలోకి పాలు తీసుకుని వస్తుంది భాగీ. ఆగు ఏం చేస్తున్నావు అంటాడు అమర్. మీరు ఇబ్బంది పడుతున్నారని తెలుసు అందుకే నేను కింద పడుకుంటా..? మీరు పైన పడుకోండి అంటుంది భాగీ. ఒక్క నిమిషం నువ్వే పైన పడుకో.. నేను కింద పడుకుంటాను అంటాడు అమర్. అంటే మీకు నా ముఖం చూస్తేనే కోపం వస్తుంది కదా..? లెఫ్టినెంట్ గారు. నేను పైన పడుకున్నాను అనుకోండి ఆ కోపం ఇంకా పెరిగిపోతే.. అంటుంది భాగీ.
ఏయ్ లూజ్.. పోనీలే పాపం కింద పడుకోవడానికి ఇబ్బంది పడతావని.. పైన పడుకోమని చెప్పాను కదా..? నాదే తప్పు. నువ్వు చెప్పిందే కరెక్టు నువ్వు పైన పడుకుంటే నాకు ఇబ్బంది. నువ్వు కిందే పడుకో అంటాడు అమర్. అంత పాస్ట్‌గా డెసిషన్ చేంజ్ చేసుకుంటే ఎలాగమ్మా.. నేను పైనే పడుకుంటా..? అంటుంది భాగీ. సైలెంట్‌గా వెళ్లి పడుకో.. అంటాడు అమర్. ఎప్పుడూ ముఖం ఉమ్మని అలా పెట్టుకోకపోతే కొంచెం నవ్వొచ్చుగా.. అని తిట్టుకుంటా పడుకుంటుంది భాగీ.
అమర్ భాగీ గొడవ
ఇంతలో అమర్ వెళ్లి లైట్ ఆఫ్ చేస్తాడు. భాగీ లేచి మాట్లాడుతుంటే లైట్ ఎందుకు ఆఫ్ చేస్తున్నారు అని వెళ్లి లైట్ ఆన్ చేస్తుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. యముడు ఆరును యమలోకానికి తీసుకెళ్లాలని వెతుకుతుంటాడు. గుప్తతో కలిసి ఇంట్లోకి వెళ్తారు. ప్రభు తమరు ఇచ్చటనే వేచి ఉందురు. ఆ బాలిక ఎచ్చట ఉన్నదో నేను వెళ్లి వెతికెద అంటాడు గుప్త. ఆ బాలిక కచ్చితముగా ఈ గృహములోనే ఉన్నదని నీకు ఎలా తెలియును అంటాడు యముడు.
ప్రభు ఆ బాలిక తన కుటుంబమును విడిచి దూరంగా వెళ్లలేదు అంటాడు గుప్త. సరే వెల్లి వీక్షించుము.. అని యముడు చెప్పగానే గుప్త ఇంట్లో వెతుకుతుంటాడు. ఆరు మాత్రం అమర్ బెడ్ రూంలోకి వెళ్లి అమర్, భాగీ మధ్యలో భయంగా కూర్చుని ఉంటుంది. ఇంతలో గుప్త ఆరు ఎక్కడ లేదని వస్తాడు. యముడు అమర్ రూంలో చూసావా అని అడుగుతాడు. అక్కడ భాగీ ఉంది కదా.. అంటాడు గుప్త. యముడు గుప్తను తిట్టి అమర్ రూంలోకి వెళ్తాడు.
గుప్తకు కనిపించని ఆరు
రూంలో గుప్తకు ఆరు కనిపించదు. కానీ, యముడు ఆరును చూస్తాడు. గుప్తకు కూడా చూపిస్తాడు. ఆరును చూసిన గుప్త వెంటనే యమపాశం విసరండి ప్రభు అంటాడు. వద్దని ఏమాత్రం పొరపాటు జరిగినా అక్కడ ఉన్న మూడు ప్రాణాలు పోతాయి అని వెళ్లిపోతాడు యముడు.
మరోవైపు మనోహరి భాగీని ఇంట్లోంచి పంపించి వేయడానికి ప్లాన్ చేస్తుంది. అప్పుడే ఏదో అలికిడి వినిపించడంతో అరుంధతి ఆత్మ అనుకుని భయపడిపోతుంది. అక్కడితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ముగుస్తుంది.
టాపిక్