NNS November 19th Episode: అమర్‌తో అత్తింట్లోకి భాగీ రీ ఎంట్రీ- తాళి చూపిస్తూ మనోహరికి మాస్ వార్నింగ్- యముడుకి షాక్
Nindu Noorella Saavasam November 19th Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 19 ఎపిసోడ్‌లో భాగీని తీసుకెళ్లేందుకు పిల్లలతోపాటు రామ్మూర్తి ఇంటికి వెళ్తాడు అమర్. భాగీని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకెళ్లెందుకు ఒప్పిస్తాడు. రామ్మూర్తికి సారీ కూడా చెబుతాడు. అనంతరం అత్తింట్లోకి అడుగుపెడుతుంది భాగీ.
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్ (NNS 19th November Episode)లో మిస్సమ్మను తీసుకెళ్లడానికి పిల్లలతో కలిసి రామ్మూర్తి ఇంటికి వస్తాడు అమర్. అమ్ము బతిమాలడడంతో ఇంట్లోకి వచ్చిన అమర్, రామ్మూర్తితో మిస్సమ్మను తీసుకెళ్లడానికే వచ్చాను అంటాడు.
గట్టిగా పిలవట్లేదు
తీసుకెళ్లండి బాబు.. తను మీ భార్య, వాళ్లకు అమ్మ.. మీరు ఎప్పుడైనా తీసుకెళ్లండి అంటాడు రామ్మూర్తి. అయితే ఇప్పుడే మిస్సమ్మను తీసుకెళ్లవచ్చా..? అని సంతోషంగా అడుగుతుంది అమ్ము. అది తన ఇష్టం అమ్మా ఇప్పుడే వెళ్లాలి అనుకుంటే వెళ్లండి. రెండు రోజులు ఉండి వెళ్లాలి అనుకుంటే వెళ్లొచ్చు అంటాడు రామ్మూర్తి. నేను రెండు రోజులు ఉండి వస్తాను. ఆయన రమ్మని గట్టిగా పిలవట్లేదు కదా..? కానీ, మా నాన్న ఇక్కడ ఉండమని ప్రేమగా అడుగుతున్నారు అందుకే అంటుంది భాగీ.
మిస్సమ్మ ఇంటికి వెళ్దాం పద. నేను పిల్లలు నిన్ను తీసుకెళ్లడానికే వచ్చాం. రెండు రోజులు ఆగి కాదు. ఇవాళే మాతో రా.. సరేనా..? అంటాడు అమర్. సరే అండి ఇప్పుడే బట్టలు తెచ్చుకుంటాను అంటుంది భాగీ. బాబు గారు గంటన్నర సేపు రాహుకాలం ఉంది. అది వెళ్లాక మీరు వెళ్లుదురు. ఇబ్బందేం లేదు కదా..? బాబు అంటాడు రామ్మూర్తి. ఇబ్బందేం లేదండి అని అమర్ అనగానే రామ్మూర్తి పిల్లలకు ఐస్‌క్రీమ్ తీసుకురావడానికి వెళ్తుంటాడు.
అరుంధతి వల్లే భంగం
అప్పుడు అమర్ బయటకు వెళ్లి రామ్మూర్తికి సారీ చెప్తాడు. మీ ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య వచ్చినా.. మీకు మీరే పరిష్కరించుకోవాలి బాబు అని చెప్పి వెళ్తాడు రామ్మూర్తి. అమర్ లోపలికి వచ్చేసరికి భాగీ పిల్లలకు అన్నం తినిపిస్తూ ఉంటుంది. అది చూసి అమర్ ఎమోషన్ అవుతాడు. మరోవైపు యముడు కోపంగా ఎవరు తనకు భంగం కలిగించారని గుప్తను తిడతాడు. అరుంధతి వల్లే మీకు భంగం కలిగిందంటాడు గుప్త.
ఇంత కష్టంలో కూడా ఆ బాలిక ఇంత సంతోషంగా ఎలా ఉంది అని అడుగుతాడు యముడు. అయ్యో ప్రభు ఇంత జరిగినా మీకు ఇంకా ఆ బాలిక గురించి అర్థం కాలేదు. ఆ బాలిక తనకు తన కుటుంబానికి ఎదురైన కష్టాలను చూసిన తర్వాత నాకు మానవ లోకంపై అభిమానం ఏర్పడింది అంటాడు గుప్త. ఏది ఏమైనా ఈ అమావాస్య నాడు ఆ బాలికను మనం మన లోకానికి తీసుకెళ్లాలి అంటాడు యముడు. నా అనుభవంతో చెప్తున్నాను. మనం అనుకున్నప్పుడు ఆ బాలిక రాదు అంటాడు గుప్త.
తను అనుకున్నప్పుడే ఆరు వస్తుంది. ఎంటి రాజు గారు మా గుప్త గారిని భయపెడుతున్నారు. నన్ను ఎలా తీసుకెళ్లాలా అని ప్లాన్ చేస్తున్నారా..? అంటుంది అరుంధతి. ప్రణాళిక వేయాల్సిన అవసరం మాకెం ఉంది అని యముడు చెప్పగానే యముడిని మళ్లీ పొగడ్తలతో ముంచెత్తుతుంది ఆరు. భాగీ తిరిగి ఇంటికి వస్తుందని ఆరు సంతోషంగా ఉంటుంది. ఇంతలో అమర్, భాగీ పిల్లలు వస్తారు. వాళ్లను చూసిన మనోహరి ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది.
ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది
నిర్మల వాళ్ళకు దిష్టి తీస్తుంది. నిమ్ము డార్లింగ్ ఇది నీకు కొంచెం ఎక్కువగా అనిపించడం లేదా..? అంటుంది అంజు. అనిపించడం లేదు. ఇలా మీ అందరిని సంతోషంగా చూశారు కాబట్టే మిస్సమ్మ మా ఇంట్లోంచి వెళ్లాల్సి వచ్చింది. మళ్లీ ఆ దేవుడి దయ వల్ల మీరందరూ కలుసుకున్నారు అంటుంది నిర్మల. హారతి మిస్సమ్మకు కదా.. ఇచ్చుకోండి వెళ్లిపోతాను అంటుంది అంజు. నువ్వు కూడా ఉంటేనే మన ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది అంజు నువ్వు కూడా ఉండు. మీరు తీయండి అత్తయ్యా.. అని భాగీ అనగానే నిర్మల దిష్టి తీస్తుంది.
అంతా గమనిస్తున్న మనోహరి రగిలిపోతుంది. అందరూ లోపలికి వస్తారు. తిరిగొచ్చిన భాగీని చూసి మనోహరి ముఖం పక్కకు తిప్పుకుంటుంది. అందరూ వెళ్లిపోయాక భాగీ, మనోహరి రూంలోకి వెళ్తుంది. ఏం జరిగింది మను.. నీ కాలు విరిగింది అని విన్నాను. ఎక్కడ పడితే అక్కడ కాలు పెడితే ఇలాగే ఉంటుంది అని వార్నింగ్ ఇస్తుంది భాగీ.
నన్ను పర్మినెంట్‌గా పంపించేసి నువ్వు ఆయన పక్కన పర్మినెంట్‌గా సెటిల్ అవుదామనుకున్నావా..? అని అడుగుతుంది భాగీ. అరుంధతి ఫోటో గురించి పిల్లలకు నువ్వే నూరిపోశావా అంటూ నిలదీస్తుంది భాగీ. ఒక్కసారి పంపించిన దాన్ని మళ్లీ పంపిచలేను అనుకున్నావా..? అని మనోహరి అంటుంది.
అది దీని పవర్
అలా మనోహరి అనగానే నువ్వు ఎన్నిసార్లు పంపించినా.. నేను మళ్లీ మళ్లీ వస్తాను. అది నా పవర్ కాదు. అంటూ తాళి చూపిస్తుంది భాగీ. అది దీని పవర్ అని భాగీ అనడంతో మనోహరి షాక్ అవుతుంది. అక్కడితో నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
టాపిక్