NNS December 6th Episode: నిజం చెప్పిన గుప్త- యమలోకానికి వస్తానన్న ఆరు- అమర్‌కే అడ్రస్ చెప్పిన కిడ్నాపర్- అంజు ఫైటింగ్-nindu noorella saavasam serial december 6th episode arundhathi promise to gupta zee telugu serial nns today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns December 6th Episode: నిజం చెప్పిన గుప్త- యమలోకానికి వస్తానన్న ఆరు- అమర్‌కే అడ్రస్ చెప్పిన కిడ్నాపర్- అంజు ఫైటింగ్

NNS December 6th Episode: నిజం చెప్పిన గుప్త- యమలోకానికి వస్తానన్న ఆరు- అమర్‌కే అడ్రస్ చెప్పిన కిడ్నాపర్- అంజు ఫైటింగ్

Sanjiv Kumar HT Telugu
Dec 06, 2024 01:45 PM IST

Nindu Noorella Saavasam December 6th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 6 ఎపిసోడ్‌‌లో యముడు, చిత్రగుప్త మాటలు విన్న అరుంధతి ఏమైందో చెప్పమని ఒట్టు వేయించుకుంటుంది. దాంతో పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని, ఏం చేయలేని పరిస్థితి అని గుప్త నిజం చెబుతాడు. ఏదోటి చేయమని, తాను యమలోకానికి వస్తానంటుంది.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ డిసెంబర్ 6 ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ డిసెంబర్ 6 ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌ (NNS 6th December Episode)లో పిల్లలకు ఏదో ప్రమాదం వాటిళ్లబోతోందని తెలిసి తాను ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నానని గుప్త బాధపడుతూ ఉంటాడు. అదే విషయాన్ని యముడికి చెప్పి పరిష్కారం చూపమంటాడు.

yearly horoscope entry point

తన మీద ఒట్టేసి

గుప్త యముడితో మాట్లాడటం చూస్తుంది అరుంధతి. తర్వాత మీరిద్దరు ఏం మాట్లాడారో చెప్పమని అడుగుతుంది. గుప్త చెప్పకపోవడంతో గుప్త చేయి తన తల మీద పెట్టుకుని నన్ను చెల్లి అంటారు కదా..? నా మీద ఒట్టేసి నిజం చెప్పండి అని అరుంధతి అడుగుతుంది. దాంతో గుప్త నువ్వు విన్నది అంతా నిజమే అంటాడు.

అయితే గుప్త గారు మీరు నా పిల్లలను కాపాడండి నేను మీతో యమలోకానికి వస్తాను అని అరుంధతి అంటుంది. సమయం మించి పోయిందని ఇక నేను ఏమీ చేయలేనని విధికి ఎదురెళ్లడం మంచిది కాదని గుప్త చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు బస్సులో వెళ్తున్న పిల్లలు సాంగ్స్ పెట్టుకుని డాన్స్‌ చేస్తూ వెళ్తుంటారు. ఇంతలో డ్రైవర్‌ సాంగ్స్‌ సౌండ్‌ తక్కువ చేయడంతో మేడం సౌండ్‌ తక్కువ చేశాడు.. పెంచమని చెప్పు అంటుంది అంజు.

వేసింది డస్ట్ బిన్‌పైనే కదా

ఏయ్‌ డ్రైవర్‌ సౌండ్‌ తక్కువ చేశావేంటి..? ఎక్కువ పెట్టు అని ప్రిన్సిపాల్ తిట్టగానే డ్రైవర్‌ మళ్లీ సౌండ్ పెడతాడు. పిల్లలు డాన్స్‌ చేస్తుంటే.. డ్రైవర్‌ పిల్లలను తిడతాడు. ప్రిన్సిపాల్‌ కోపంగా డ్రైవర్‌ను తిడుతుంది. బంటి చాక్లెట్ తిని రాపర్‌ అంజు మీదకు వేస్తాడు. అంజు కోపంగా అరేయ్‌ బంటి ఏంటిది..? అని అడుగుతుంది. ఆ అది కూడా తెలియదా..? చాక్లెట్‌ రాపర్‌ కళ్లు కనిపించడం లేదా..? అంటాడు బంటి.

నాకు బాగానే కనిపిస్తున్నాయి. నీకే సరిగ్గా కనిపించడం లేదనుకుంటా..? డస్ట్‌బిన్‌‌లో వేయాల్సిన రాపర్‌ను నా ముఖం మీద వేశావు అంటుంది అంజు. దీంతో నేను వేసింది కూడా డస్ట్ బిన్‌‌లోనే. నీ ముఖం డస్ట్‌ బిన్నే కదా అంటాడు బంటి. దీంతో అంజు కోపంగా బంటి మీదకు ఫైటింగ్‌‌కు వెళ్తుంది. అమ్ము ఆపి బంటిని తిడుతుంది. మరోవైపు అమర్‌ డల్లుగా ఇంటికి వస్తాడు.

ఏమైందంటూ ఆరా

అంజును కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించిన విషయం, అరవింద్‌ ఫోన్‌‌లో ఇచ్చిన వార్నింగ్ గుర్తు చేసుకుంటాడు. ఇంతలో రాథోడ్‌ పిల్లలను డ్రాప్‌ చేసి వచ్చినప్పటి నుంచి మీరు అదోలా ఉన్నారు ఏం జరిగింది సార్‌ అని అడుగుతాడు. అమర్‌ ఏమీ చెప్పకుండా మిస్సమ్మను వాటర్‌ తీసుకురా అని అడుగుతాడు. వాటర్‌ తీసుకుని వచ్చిన మిస్సమ్మ.. అమర్‌ ను చూసి ఏమైంది రాథోడ్‌ అని అడుగుతుంది.

ఏమో తెలియదని రాథోడ్‌ చెప్తాడు. ఇంతలో నిర్మల, శివరామ్ వచ్చి ఏమైందని అడుగుతారు. అమర్‌ పలకడు.. కానీ రాథోడ్ మాత్రం రెగ్యులర్‌గా వచ్చే డ్రైవర్‌ కాకుండా కొత్త డ్రైవర్‌ వచ్చాడు అని చెప్పగానే అదేంటి రాథోడ్‌ అలా ఎలా వచ్చారు. ఇవాళే ఎందుకు వచ్చారు. కొత్త అతను తెలిశాక కూడా పిల్లల్ని ఎందుకు పంపించారు అని మిస్సమ్మ అడుగుతుంది.

పిల్లల బస్సుకు ట్రాకర్

రాథోడ్‌ అసలు అతను డ్రైవరేనా..? లేక ఆ రౌడీల్లో ఒకడా..? అని శివరామ్ అడగ్గానే ఆ అనుమానంతోనే సార్‌ బస్సు ఓనరుకు ఫోన్‌ చేశారు. ఆ డ్రైవరు ఓనరు పంపించిన డ్రైవరే..? మామూలుగా వచ్చే ఆయనకు ఒంట్లో బాగాలేకపోతే ఇతను వచ్చాడంట అని రాథోడ్‌ చెప్తాడు. ఇంతలో అమర్‌ లాప్‌టాప్‌ తీసుకుని ఓపెన్‌ చేసి పిల్లలను దించడానికి వెళ్లినప్పుడు బస్సుకు ట్రాకర్‌ పెట్టాను ఇప్పుడు అదే ఓపెన్‌ చేసి చూస్తున్నాను అని చెప్తాడు.

ఏమైందండి బస్సు కరెక్టు రూట్‌‌లోనే వెళ్తుందా అని మిస్సమ్మ అడుగుతుంది. కరెక్ట్ రూట్‌‌లోనే వెళ్తుందని అమర్‌ చెప్తాడు. అరవింద్‌ కారు ఆపి బస్సు డ్రైవర్‌కు ఫోన్‌ చేసి మేము ఫారెస్ట్‌‌లోకి ఎంటర్‌ అవుతున్నాం. నేను చెప్పిన బంగ్లా దగ్గరకు వెళ్లి అరేంజ్‌ చేసుకుంటాం. ప్లాన్‌ అంతా గుర్తు ఉంది కదా ఎక్కడ చిన్న తేడా రాకూడదు అని చెప్తాడు. సరేనని ఫోన్‌ కట్‌ చేస్తాడు డ్రైవర్.

కిడ్నాప్ చేశారు

డ్రైవర్‌ వెనక నుంచి వచ్చిన ప్రిన్సిపాల్‌ ఏయ్‌ ఏంటి ఏదో తేడా అని మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. ప్రిన్సిపాల్‌ మాటలకు డ్రైవర్‌ భయపడతాడు. బస్సు ఓనర్ అసలైన డ్రైవర్‌ను తీసుకుని అమర్ దగ్గరకు వస్తాడు. అందరూ షాక్‌ అవుతారు. అసలు మీ స్థానంలో అతనెందుకు వెళ్లాడు. మీరేం చేస్తున్నారు అని అమర్‌ అడగ్గానే.. సార్‌ ఉదయం కొంత మంది వచ్చి నన్ను కిడ్నాప్‌ చేసి నా స్థానంలో వేరే అతన్ని పంపిచారు అని చెబుతాడు.

అలా డ్రైవర్‌ చెప్పగానే నిర్మల ఏంటి బాబు మీరు మాట్లాడేది.. నీ స్థానంలో వేరే వాళ్లు ఎందుకు వెళ్తారు. అసలే ఆ బస్సులో చాలా మంది పిల్లలు ఉన్నారు అంటుంది నిర్మల. ఇవాళ పిల్లల్ని ఎక్స్‌‌కర్షన్‌కు తీసుకెళ్లిన డ్రైవరు నిన్ను కిడ్నాప్‌ చేసిన వ్యక్తేనా..? అని శివరామ్ అడుగుతాడు. అవునని డ్రైవర్‌ చెప్తాడు.

అడ్రస్ చెప్పిన డ్రైవర్

దీంతో అందరూ షాకింగ్‌‌గా చూస్తుంటారు. మిస్సమ్మ కంగారుపడుతుంది. ఇంతలో అమర్‌ డ్రైవర్‌కు ఫోన్‌ చేయగానే డ్రైవర్‌ అరవింద్‌ అనుకుని అడవిలోకి వెళ్తున్నాను అంటాడు. అక్కడితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner