NNS March 2nd Episode: ​​​మంగళ చెంప చెళ్లుమనిపించిన రామ్మూర్తి.. కాళీ అరెస్ట్​.. మనోహరి కొత్త ప్లాన్-nindu noorella saavasam march 2nd episode rammurthy slaps mangala kali arrest nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nindu Noorella Saavasam March 2nd Episode Rammurthy Slaps Mangala Kali Arrest Nindu Noorella Saavasam Today Episode

NNS March 2nd Episode: ​​​మంగళ చెంప చెళ్లుమనిపించిన రామ్మూర్తి.. కాళీ అరెస్ట్​.. మనోహరి కొత్త ప్లాన్

Sanjiv Kumar HT Telugu
Mar 02, 2024 12:29 PM IST

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 2వ తేది ఎపిసోడ్‌లో కాళీని అంజలి గుర్తు పడుతుంది. సాక్ష్యం ఉందా అని మంగళ అంటే.. పోలీసులు వచ్చి కాళీని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 2వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మార్చి 2వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam March 2nd Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 2nd March Episode) పెళ్లిలో కాళీ గురించి నిజం చెప్పేస్తుంది అంజలి. నేను చూశాను డాడీ ఈ అంకులే సరస్వతి ఆంటీని యాక్సిడెంట్ చేసి చంపింది అని అంటుంది అంజు. కాళీ చేతులు వణుకుతూ ఉంటాయి. భాగమతి పెళ్లి పీటల నుంచి లేచి నిలబడుతుంది. ఏంటి సార్ నేను ఏదో తప్పు చేసినట్టు అలా చూస్తున్నారు అని అంటాడు కాళీ.

అరిచేసిన రామ్మూర్తి

ఆ పాప ఎవర్ని చూసి ఎవరు అనుకుందో అంటుంది మంగళ. అంజు షాక్​కు గురైన కానుంచి ఇలాగే మాట్లాడుతోంది కదా అమర్ మొన్న షాపింగ్ మాల్లో కూడా ఇలాగే చెప్పింది అంటుంది మనోహరి. అమ్మాయి నువ్వు పీటల మీద కూర్చో రేయ్ తమ్ముడు నువ్వు తాళి కట్టరా అని మంగళ అంటుంది. కాళీ తాళికట్టబోతు ఉండగా రామ్మూర్తి వచ్చి రేయ్.. అని అరుస్తాడు. రామ్మూర్తి భాగమతి దగ్గరికి పరిగెత్తుకొస్తాడు. భాగమతి తాళిబొట్టును తీసి విసిరేస్తాడు

నా కూతురు మెడలో తాళి కట్టావంటే చంపేస్తాను అని కాళీని చూస్తూ అంటాడు రామ్మూర్తి. నాన్న మీకు ఏమైంది అంటుంది భాగమతి. వచ్చేసారా మీరు లేకుండా తాళి కట్టొద్దంటున్నాను అంటుంది మంగళ. ఏమయ్యా చప్పుడు చేయకుండా ఒక మూలన కూర్చో అంటుంది. రామ్మూర్తి ఓపిక తెచ్చుకొని మరీ లేచి మంగళ చెంప పగలగొడతాడు. నన్ను కొడతారా అండి అంటుంది మంగళ. నువ్వు చేసిన దారుణానికి చంపిన పర్వాలేదు అంటాడు రామ్మూర్తి.

ఏడ్చిన భాగమతి

నాన్న అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతుంది భాగమతి. వీళ్లిద్దరూ నిన్ను మోసం చేశారమ్మ. వీడికి నిన్నిచ్చి పెళ్లి చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది వీడు కోరుకునే పెళ్లి అని చెబుతాడు రామ్మూర్తి. మీ స్వార్థం కోసం నాన్న పేరు అడ్డం పెట్టుకొని నన్ను బలి చేద్దామనుకున్నారా అని భాగమతి రామ్మూర్తిని కౌగిలించుకొని ఏడుస్తుంది. ఏడవకు తల్లి నేను వచ్చేసానుగా ఎవరు నిన్ను ఏమీ చేయలేరు అంటాడు రామ్మూర్తి.

మిస్సమ్మ ఈయన మీ నాన్న..? అని అడుగుతాడు అమర్​. అవును అంటుంది భాగమతి. స్కూల్ దగ్గర చూసినప్పుడు ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు అమర్​. స్కూల్లో మా నాన్నని ఎందుకు చూశానండి అంటుంది భాగమతి. ఆ స్కూల్లో మీ నాన్న వాచ్‌మెన్‌గా చేస్తున్నాడు కదా అని అంటాడు అమర్​. నేను చెప్పిన తాతయ్య ఈయనే మిసమ్మ అంటుంది అమృత. నువ్వు వాచ్‌మెన్‌గా చేయడం ఏంటి నాన్న ఈ కూతురికి బాధ్యత లేదనుకున్నావా అంటుంది భాగమతి.

సాక్ష్యం ఉందా?

నీకు భారం కాకూడదు అనుకున్నాను అమ్మ అంటాడు రామ్మూర్తి. మిస్సమ్మ ఒక్కసారి ప్రాబ్లం ఇదని చెప్పు ఉండాల్సింది కదా అంటాడు అమర్​. ఇలాంటి నీచుడికి మా మిస్సమని ఇచ్చి పెళ్లి చేయాలా అంటాడు శివరామ్. అసలు ఆవిడ ఎవరో కూడా మా వాడికి తెలియదు మావాడు ఎందుకు ఆవిడకి యాక్సిడెంట్ చేస్తాడు. సాక్ష్యం ఏమైనా ఉందా అని అంటుంది మంగళ. ఉంది అని ఎస్ఐ అంటాడు. హలో ఎస్సై గారు నేనే లెఫ్టినెంట్​ని మీ దగ్గర ఏ ప్రూఫ్ ఉంది అని అంటాడు అమర్​.

ఆ ఏరియాలో సీసీటీవీ ఫుటేజీ ఉంది సార్. అలాగే ట్రక్కు ఓనర్‌ని కూడా పట్టుకున్నాం అని అంటాడు ఎస్ఐ. కాళీ నిన్ను అటెంప్ట్ మర్డర్ కింద అరెస్ట్ చేస్తున్నాం అని ఎస్ఐ గారు కాళీని అరెస్టు చేసి తీసుకువెళ్లి పోతారు. మా తమ్ముడికి ఏమీ తెలియదు సార్ అంటూ మంగళ ఏడుస్తుంది. అక్కడికి మనోహరీ వస్తుంది. నీ కళ్ళు చల్లబడ్డాయా నీవల్లే నా తమ్ముడు హంతకుడు అయ్యాడు అంటుంది మంగళ. అరవకు అని అంటుంది మనోహరి.

తప్పు చేశాను

ప్రపంచమంతా ఏమైపోయినా పర్వాలేదు మీరు మాత్రం పశాంతంగా ఉండాలా అంటుంది మంగళ. ప్రశాంతంగా నేను చెప్పేది ఒక్కసారి విను అని అంటుంది మనోహరి. పోలీసులు అన్ని మాటలు అంటూ ఉంటే ఒక్కమాటైనా మాట్లాడావా అంటుంది మంగళ. అక్కడ నీతో మాట్లాడితే పోలీసులకు నా మీద కూడా అనుమానం వచ్చేది అంటుంది మనోహరి. డబ్బుకు కక్కుర్తి పడి నీతో చేతులు కలిపి తప్పుచేశాను. తప్పు చేసింది వాడేనా చేయించింది మీరు కదా వాడు ఒక్కడే జైలుకెందుకు పోవాలి అంటుంది మంగళ.

నేను చెప్పేది విను అంటుంది మనోహరి. ఇదంతా నువ్వు పన్నినా కుట్ర అని చెప్పి నువ్వు అతని పెళ్లి చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నావని నీ బండారం మొత్తం బయట పెడతాను నిన్ను కూడా ఆ ఇంట్లో నుంచి బయటికి గెంటేలా చేస్తాను అంటూ మంగళ వెళ్తుంది. వెళ్లూ మంగళ.. వెళ్లి చెప్పు ఏమవుతుంది అందరూ నమ్మేస్తారా నువ్వు చెప్పితే నమ్మినా సరే నేను నాలుగు కన్నీళ్లు కార్చి తల్లి లాంటి మేడమ్‌ని నేను ఎందుకు చంపుతాను అమర్ అని అంటే అమర్ నన్ను ఏమీ అనుమానించడు.

బయటకు తీసుకురావొచ్చు

రవ్వ అంత కూడా తిట్టడు అప్పుడు నీ తమ్ముడే జైల్లో మగ్గిపోతాడు నేను చెప్పినట్టు చేస్తే నీ తమ్ముని కాపాడుకోవచ్చు అంటుంది మనోహరి. అంటే ఏంటమ్మా మీరనేది నేను చెప్తే ఎవరు నమ్మరా అంటుంది మంగళ. నిజం తెలిసిన బాగమతి రామ్మూర్తి నిన్ను బయటికి గెంటేస్తారు అప్పుడు నేనే కదా నీకు గతి. ఇప్పుడు నిజం చెప్పి నన్ను మీ తమ్ముని జైల్లో వేస్తే ఏమొస్తుంది అదే నేను చెప్పినట్టు చేస్తే మీ తమ్ముని జైల్లో నుంచి బయటికి తీసుకు రావచ్చు ఆలోచించుకో నిర్ణయం నీదే అని అంటుంది మనోహరి.

ఏం చేయాలో చెప్పండి అమ్మ అని మంగళ అంటుంది. తన ప్లాన్‌ని మంగళకి చెబుతుంది మనోహరి. అలాగే అమ్మ నువ్వు చెప్పినట్టు చేస్తే నా తమ్ముని తీసుకొస్తావు కదా అంటుంది మంగళ. తప్పకుండా తీసుకొస్తాను మంగళ కానీ నేను ఇప్పుడు వెళ్తున్నాను నువ్వు 10 నిమిషాల తర్వాత రా అని మనోహరి వెళ్తుంది. కట్ చేస్తే, భాగమతి అంజలి చేయి పట్టుకుని నొప్పిగా ఉందా అమ్మ అంటూ చూస్తుంది తన చేతుల్ని. పర్వాలేదులే మిస్సమ్మ ఏమి నొప్పి పుట్టడం లేదు అని అంజలి అంటుంది.

నేనేం చేశాను

చిన్నపిల్లని చూడకుండా చేతులు కట్టిపడేశాడు ఆ కాళీ ఎంత దుర్మార్గుడా అని శివరామ్ అంటాడు. నా తమ్ముడు చేసింది తప్పేనయ్యా. కానీ ఈ పెద్ద మనిషి చేసింది తప్పు కదా అంటుంది మంగళ. నీ తమ్ముడు నువ్వు తప్పులు చేసి ఆయనను అంటారు ఏంటే అంటాడు రామ్మూర్తి. ఏంటమ్మా పెద్దరికం తీసుకొని పెళ్లి చేయాలనుకున్నది మా అమర్ చేసిన తప్పా అంటాడు శివరామ్. మీరు ఆగండి నాన్న మీరు చెప్పండి మంగళ గారు నేనేం చేశాను అని అంటాడు అమర్​.

మీరు దేశాలు తిరుగుతారు. దేశాన్ని కాపాడుతారు. దేశాలు తిరిగే బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు అంటుంది మంగళ. అసలు మంగళ ఏం అడగబోతోంది? మనోహరి గురించి అమర్​కి ఎలా తెలియనుంది? అనే విషయాలు తెలియాలంటే మార్చి 3న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

WhatsApp channel