NNS January 9th Episode: తండ్రిని నిలదీసిన మిస్సమ్మ- బోరున విలపించిన రామ్మూర్తి, అమర్- దేవుడిపై అరుంధతికి పెరిగిన ద్వేషం-nindu noorella saavasam january 9th today episode bhagamathi asks ramamurthy about her sister arundhathi zee telugu nns ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns January 9th Episode: తండ్రిని నిలదీసిన మిస్సమ్మ- బోరున విలపించిన రామ్మూర్తి, అమర్- దేవుడిపై అరుంధతికి పెరిగిన ద్వేషం

NNS January 9th Episode: తండ్రిని నిలదీసిన మిస్సమ్మ- బోరున విలపించిన రామ్మూర్తి, అమర్- దేవుడిపై అరుంధతికి పెరిగిన ద్వేషం

Sanjiv Kumar HT Telugu
Jan 09, 2025 06:00 AM IST

Nindu Noorella Saavasam January 9th Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 9 ఎపిసోడ్‌‌లో అక్క గురించి ఆచూకి తెలిసిందా అని రామ్మూర్తిని మిస్సమ్మ అడిగితే సైలెంట్‌గా ఉంటాడు. దాంతో ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని నిలదీస్తుంది భాగమతి. మరోవైపు నిజం తెలిసి ఏడుస్తుంటుంది అరుంధతి. గుప్తా ఓదారుస్తాడు.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జనవరి 9 ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జనవరి 9 ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌ (NNS 9th January Episode)లో రామ్మూర్తి దగ్గరకు వెళ్లిన మిస్సమ్మ అక్క అచూకి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది. తెలియలేదు, అక్క మనకు అందనంత ఎత్తులో.. చేరుకోలేనంత దూరంలో ఉందమ్మా అంటాడు రామ్మూర్తి.

yearly horoscope entry point

తండ్రిని నిలదీసిన మిస్సమ్మ

ఏంటి నాన్నా.. అక్క గురించి తెలిసినట్టు మాట్లాడుతున్నారు. అడిగితే నాకేం తెలియదంటున్నారు అని మిస్సమ్మ అడగ్గానే.. ఎక్కడుందో ఎలా ఉందో తెలియని మీ అక్కను చేరుకోవడం అంత ఈజీ కాదమ్మా.. విడదీసిన ఆ విధే మళ్లీ కలపాలి అంటాడు రామ్మూర్తి. లేదు నాన్నా మీ మాటలు వింటుంటే నాకేదో అనుమానంగా ఉంది. చెప్పండి నాన్నా అసలు ఏం జరిగింది అని నిలదీస్తుంది మిస్సమ్మ.

నువ్వు లేనిపోనివి ఊహించుకుని మీ నాన్న మనసును ఇబ్బంది పెట్టకు అంటాడు అమర్‌. లేదండి మిమ్మల్ని, మా నాన్న మాటలు చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉంది. నిజం చెప్పండి నాన్నా అసలేం జరిగింది అని అడుగుతుంది. అంటే ఆశ్రమంలో ఉన్న వాళ్లు చాలామంది పెళ్లిళ్లు చేసుకుని విదేశాల్లో సెటిల్‌ అయ్యారంట అందుకే అలా అన్నాను అంటాడు రామ్మూర్తి.

అస్థికలు ముట్టుకోవచ్చా

అక్క ఎంత దూరంలో ఉంది తెలిస్తే ముందు నేనే వెళ్తాను అని మిస్సమ్మ చెప్పగానే.. వద్దమ్మా నువ్వు అలా మాట్లాడకు.. తల్లి అంటాడు రామ్మూర్తి. దాంతో డల్లుగా మిస్సమ్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రామ్మూర్తి ఏడుస్తూ అమ్మాయి ఫోటోను అస్థికలను ఒక్కసారి ముట్టుకోవచ్చా అని అడుగుతాడు. దానికి సరే అంటాడు అమర్‌. ఆపు రామ్మూర్తి మాటలు గుర్తు చేసుకుని బాధపడుతుంది.

గుప్త వచ్చి నీకు ఎప్పుడో చెప్పాను కదా బాలిక. నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అని. నువ్వు తెలుసుకున్న నిజం నీకు బాధను, కష్టాన్ని ఇస్తుంది. ఇక నువ్వు ఈ నిజాన్ని మోయక తప్పదు. నీకే ఏదైనా బాధ ఉంటే నాతో చెప్పుకో బాలిక అని గుప్త చెప్పగానే.. ఒక గంటే నేను ఈ నిజాన్ని మోయలేకపోతున్నాను. ఆయన ఒక్కరే ఇన్ని రోజులు ఈ నిజాన్ని ఎలా మోయగలిగారు అని అరుంధతి అంటుంది.

మనసారా తిట్టాలని ఉంది

మా ఆయనతో సంతోషంగా ఉన్నా.. నా పిల్లలతో హ్యాపీగా ఉన్నా మనసులో ఎప్పుడూ ఏదో వెలితిగా ఉండేది. కానీ, మొదటి సారి నా చెల్లి మాట విన్నప్పుడు చాలా సంతోషం వేసింది. నా కుటుంబాన్ని తనది అనుకున్నప్పుడు ఏ జన్మ రుణమో అనుకున్నాను. కానీ ఈ జన్మ రక్తసంబంధం అనుకోలేదు. దేవుడు చాలా దుర్మార్గుడు గుప్త గారు.. నాకు ద్రోహం చేసినప్పుడు కూడా దేవుడి మీద నాకు కోపం రాలేదు. కానీ, భాగమతి నా చెల్లెలు అని తెలిశాక దేవుడంటే ఇప్పుడు కోపంగా ఉంది. మనసారా ఆ దేవుడిని తిట్టాలని ఉందంటూ అరుంధతి ఏడుస్తుంది.

బాలిక ఏమిటీ ఆ మాటలు.. జీవితమంతయూ దైవమును కొలిచి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు. చావు ముందు నా చెల్లిని నా కళ్ల ముందుకు తీసుకొచ్చి కలవకుండా చేశాడు గుప్త గారు. ఎందుకు చేశావు దేవుడా ఇలాగా..? నేను ఎవరికి ఏం అన్యాయం చేశానని ఇలా చేశావు చెప్పు.. నా కుటుంబానికి ఎందుకింత కష్టాన్ని తీసుకొచ్చావు. అప్పుడు ఇప్పుడు నా తండ్రికి ఎందుకు ఇంత దుఃఖాన్ని ఇచ్చావు అంటుంది ఆరు.

కన్నీళ్లు తుడవాలని ఉంది

బాలిక ఏడవకు.. నీ పతి దేవుడు నీ తండ్రిని.. నీ సోదరిని బాగా చూసుకుంటాడు. నువ్వు లేని లోటు లేకుండా చూస్తాడు అని గుప్త ఓదారుస్తాడు. మీ రుణ బంధం ఇంకా ఉంది కాబట్టి ఆ జగన్నాథుడు ఇలా చేశాడు.. అని గుప్త చెప్పగానే.. నాకు ఒక్కసారి బతకాలని ఉంది గుప్త గారు.. నాన్న వేలు పట్టుకుని బతకాలని ఉంది. చెల్లెలు వేలు పట్టుకుని తన కన్నీళ్లను తుడవాలని ఉంది. నేను కోల్పోయిన జీవితాన్ని పొందడం కోసం నాకు బతకాలని ఉంది అని అరుంధతి అంటుంది.

బాలిక అది అసంభవం అని గుప్త అంటే.. అసంభవం అని తెలుసు గుప్త గారు. కానీ, మనిషిని కదా..? అంటూ ఏడుస్తుంటే.. గుప్త ఓదారుస్తూ.. ముందు ఇంటికి వెళ్దాం పద బాలిక అంటాడు. అమర్‌ రూంలోకి వెళ్లిన రామ్మూర్తి, అరుంధతి ఫోటో చూస్తూ ఏడుస్తుంటాడు. దాంతో అమర్‌ ఓదారుస్తాడు. అరుంధతి అస్థికలు తాకి మరింత బోరున ఏడుస్తాడు రామ్మూర్తి. రాథోడ్, అమర్‌ కూడా ఏడుస్తారు. అక్కడితే నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner