NNS January 4th Episode: అరుంధతి గురించి నిజం చెప్పిన వార్డెన్.. అమర్ ఇంటికి రామ్మూర్తి.. అల్లుడితోనే తేల్చుకుంటానంటూ!
Nindu Noorella Saavasam January 4th Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 4 ఎపిసోడ్‌లో అమర్ నచ్చజెప్పడంతో అరుంధతి అస్థికలు ఇస్తుంది అంజు. ఆశ్రమంలో పిల్లలకు చాక్లెట్స్ పంచుతున్న రామ్మూర్తిని చూసి తన కూతురు గురించి టీచర్‌తో నిజం చెబుతుంది వార్డెన్. ఆ మాటలు విన్న రామ్మూర్తి అమర్ ఇంటికి వెళ్తాడు.
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్ (NNS 4th January Episode)లో అమ్మ అస్థికలు కాశీలోని గంగానదిలో కలిపితేనే అరుంధతి ఆత్మ శాంతిస్తుందని అమర్ నచ్చజెప్పడంతో సరేనని అస్థికల్ని ఇస్తుంది అంజు. గార్డెన్‌లో కూర్చున్న అరుంధతి తనలో తానే నవ్వుకుంటుంది.
విధి ఫుట్‌బాల్ ఆడుకుంటుంది
అది చూసిన గుప్తా ఎందుకు బాలిక నీలో నువ్వు నవ్వుకుంటున్నావు అని అడుగుతాడు. ఇన్ని రోజుల పడిన కష్టాలు ఒక లెక్క. ఇప్పుడు మరో లెక్క. విధి మరీ పుట్‌బాల్ అడేసుకుంది అని అరుంధతి చెప్తుంటే.. నువ్వంటే మానవ జన్మ ఎత్తితివి కాబట్టి నువ్వు కర్మ అనుభవించాలి. కానీ, నేను ఏం పాపము చేసితిని అంటూ ఆలోచిస్తాడు గుప్తా.
తర్వాత జ్ఞప్తికి వచ్చిందని అరుంధతి చేసిన పనులను గుప్తా గుర్తు చేయగానే.. అరుంధతి మీకు జ్ఞాపకశక్తి బాగా ఎక్కువగా ఉంది. సరే ఇక్కడ ఉండే మూడు రోజులు బాగా చిల్ అవ్వండి తర్వాత ఆలోచిద్దురు అంటుంది. తర్వాత వెంటనే పరుగెత్తుకుని డోర్ దగ్గరకు వెళ్తుంది అరుంధతి. వెనకే గుప్త పరుగెత్తుకొచ్చి చూస్తుంటాడు. అప్పుడే మనోహరి వస్తుంది. పైనుంచి అమర్ అస్థికలు తీసుకుని వస్తాడు.
ఇంకోసారి అమ్మను దూరం చేసుకోలేక
అవి చూసిన మనోహరి అస్థికలు అమర్ చేతిలో ఉన్నాయేంటి ఎవరు తీసుకున్నారు అని మనసులో అనుకుంటుంది. తర్వాత అమర్ దగ్గరకు వెళ్లి అస్థికలు పోయాయి అన్నారు కదా..? ఎవరు తీసుకున్నారు అని అడగ్గానే.. పోలేదు మనోహరి ఇంట్లోనే ఉన్నాయి. అంజు తీసుకుంది అని అమర్ చెప్తాడు. అంజు తీసుకుందా.. ఎందుకు అని అడగ్గానే ఎందుకని అలా అడుగతావేంటి మనోహరి. మళ్లీ ఇంకోసారి వాళ్ల అమ్మను దూరం చేసుకోలేకపోయింది అని అమర్ చెబుతాడు.
అస్థికలు తన దగ్గర ఉంటే తన తల్లి తనతోనే ఉంటుందేమో అనుకుంది అని శివరామ్ చెప్తాడు. అవునా అమర్ అంటూ అడగ్గానే అవునని అమర్ చెప్తాడు. ఏదైతే అయిందిలే.. అస్థికలు దొరికాయి.. మూడు రోజులు జాగ్రత్తగా కాపాడితే మళ్లీ గంగలో కలిపేయవచ్చు. అరుంధతికి ఘనంగా వీడ్కోలు పలకొచ్చు అంటుంది మనోహరి. సరే నాన్నా అమ్మాయి ఫోటో తీసుకొస్తాను పూజ చేద్దువు కానీ అంటుంది నిర్మల.
మనోహరి టెన్షన్
దాంతో మనోహరి టెన్షన్ పడుతుంది. ఇంతలో అమర్ వద్దు అమ్మా అంటాడు. ఎందుకు అమర్ అని శివరామ్ అడగ్గానే.. పిల్లలు బాధపడుతున్నారు. ఇప్పుడిప్పుడే అరుంధతి లేదనే బాధను దాటి బతుకుతున్నారు. ఇప్పుడు అస్థికలు తీసుకొచ్చాక అంజు ఏం చేసిందో తెలుసు కదా.. అంటాడు అమర్. మిస్సమ్మ కూడా అవును మామయ్య అంటుంది. దీంతో నిర్మల సరే నాన్నా గదిలోనైనా ఫోటో పెట్టి దీపం పెట్టు అని చెప్తుంది.
అమర్ సరే అని అస్థికలు తీసుకుని పైకి వెళ్తాడు. రూంలో అరుంధతి ఫోటో ముందు నిలబడి ఏడుస్తూ ఇంకో రెండు రోజుల్లో అరుంధతి అమర్ కథ ముగిసిపోతుంది. ఈ అరుంధతి తోడు లేకుండా అమర్ ఏం చేయగలడో తెలియడం లేదు ఆరు. పిల్లలు నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాం. నువ్వు ఎక్కడున్నా..? హ్యాపీగా ఉండాలి అంటూ ఎమోషనల్ అవుతాడు అమర్. పక్కనే వచ్చి నిలబడి అంతా చూస్తున్న ఆరు ఏడుస్తుంది.
నిజం చెప్పిన వార్డెన్
మరోవైపు అమ్మఒడి ఆశ్రమానికి వెళ్లిన రామ్మూర్తి పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు పంచుతుంటాడు. ఆశ్రమంలో ఉన్న ఆయా చూసి బాధపడుతుంది. అరుంధతి గురించి ఏమీ చెప్పొద్దని అమర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని సైలెంట్‌గా ఉండిపోతుంది. ఆశ్రమంలో టీచర్ వచ్చి ఎందుకు మేడం అంత డల్లుగా ఉన్నారు అని అడగ్గానే.. ఆయన కూతురు గురించి తనకు తెలుసని.. కానీ ఆ విషయం ఈయనకు చెప్పొద్దని అమరేంద్రకు మాటిచ్చానని చెబుతుంది.
ఆ మాటలు రామ్మూర్తి వింటాడు. లోపలికి వచ్చి మీరు చెప్పేది నిజమా మేడం అంటూ ఎమోషనల్ అవుతుంటాడు రామ్మూర్తి. మా అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంది..? ఎలా ఉంది..? ఏం చేస్తుంది అని రామ్మూర్తి అడిగినా వార్డెన్ చెప్పదు. దీంతో రామ్మూర్తి కోపంగా అమర్‌తోనే తేల్చుకుంటానని ఇంటికి వెళ్తాడు రామ్మూర్తి. అక్కడ తనపై ఒట్టు వేసి నిజం చెప్పమని అమర్‌ను రామ్మూర్తి నిలదీస్తాడు. అక్కడితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
టాపిక్