NNS January 30th Episode: చిత్రగుప్త లెక్కల్లో తప్పులు- మళ్లీ భూలోకానికి ఆరు- రణ్​వీర్​ కొత్తనాటకం- మిస్సమ్మకు డౌట్​!-nindu noorella saavasam january 30th today episode chitragupta mistakes bhagi doubts ranveer zee telugu nns serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns January 30th Episode: చిత్రగుప్త లెక్కల్లో తప్పులు- మళ్లీ భూలోకానికి ఆరు- రణ్​వీర్​ కొత్తనాటకం- మిస్సమ్మకు డౌట్​!

NNS January 30th Episode: చిత్రగుప్త లెక్కల్లో తప్పులు- మళ్లీ భూలోకానికి ఆరు- రణ్​వీర్​ కొత్తనాటకం- మిస్సమ్మకు డౌట్​!

Sanjiv Kumar HT Telugu

Nindu Noorella Saavasam January 30th Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 30 ఎపిసోడ్‌‌లో చిత్రగుప్త లెక్కల్లో తప్పులున్నట్టలు గుర్తించిన యముడు తిడతాడు. ఇప్పుడు అరుంధతికి తెలిస్తే మన పరిస్థితి ఏంటని భయపడిపోతాడు. దాంతో విచిత్రగుప్తుడిని పిలిపించి సలహా అడిగితే.. మళ్లీ భూలోకానికి పంపించమని చెబుతాడు.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జనవరి 30 ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌ (NNS 30th January Episode)లో చిత్రగుప్తుడి పొరపాటు వల్ల జరిగిన తప్పు అరుంధతికి తెలియకూడదని తనని పక్కకు తీసుకెళ్లమని చెప్తాడు యముడు. దాంతో అరుంధతిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు గుప్త.

అరుంధతి పసిగడితే

వాళ్లు వెళ్లిపోయాక మనం చేసిన తప్పిదం ఆ బాలికకు తెలిస్తే ఇంకేమైనా ఉన్నదా అని భయపడతాడు యముడు. దీంతో చిత్రగుప్తుడు పాపుల చిట్టా నా దగ్గరే ఉంది కదా..? అందులో ఆ బాలిక నాలుగు తప్పిదములు చేసిందని రాస్తాను అంటాడు. యముడు కోపంగా ఆ బాలిక ఈ విషయం పసిగడితే మన పరిస్థితి ఏంటి. ఇదే నరకంలో మనం కూడా శిక్ష అనుభవించాలి అంటాడు యముడు.

మరి ఇప్పుడేం చేయాలని చిత్రగుప్తుడు అడిగితే ఆ బాలిక గురించి పూర్తిగా తెలిసిన చిత్ర విచిత్రగుప్తుడినే అడుగుదాం అని పిలుస్తారు. గుప్త రాగానే యముడు అనుమానంగా చూస్తుంటాడు. గుప్త భయంతో ఆ బాలికను రెచ్చగొట్టింది నేనే అని పసిగట్టారా ఏంటి ప్రభువు అని భయపడుతుటాడు. ఇంతలో చిత్రగుప్తుడు అదే విషయం అడగ్గానే.. గుప్త కంగారు పడతాడు. నేను ఆ పని ఎందుకు చేస్తాను అంటాడు.

భూలోకం పంపిస్తే సరి

అయితే ఇప్పుడు ఆ బాలిక మా మాట వినుట వలెనన్నా ఏమీ చేయవలెను అని అడుగుతాడు యముడు. ఆ బాలిక తన పిల్ల పిచ్చుక ప్రమాదంలో ఉన్నదని గమనించింది. ఆ పిల్ల పిచ్చుకను కాపాడితే సరిపోతుంది అని చెప్తాడు గుప్త. అయితే ఇప్పుడే నేను భూలోకం వెళ్లాలా అని యముడు అడగ్గానే.. అవసరం లేదు ప్రభు ఆ బాలికను భూలోకం పంపినచో సరిపోతుంది అంటాడు గుప్త.

దీంతో చిత్ర గుప్తుడు కోపంగా విచిత్ర నీకు మతి కానీ భ్రమించిందా..? ఆ బాలికను భూలోకం నుంచి తీసుకుని వచ్చుటకు ఎంత కష్టపడ్డామో తెలిసి మళ్లీ భూలోకం పంపమని చెప్తున్నావా..? అంటాడు. దీంతో గుప్త ప్రభువుల వారు అడిగితిరి నేను చెప్పితిని అంటాడు. దీంతో యముడు సరే విచిత్ర నేను ఆలోచించుకుని చెప్తాను నువ్వు వెళ్లు అంటాడు. తర్వాత గుప్త అరుంధతి దగ్గరకు వెళ్లి ప్రభువుల వారు ఆలోచిస్తున్నారు అంటే నిన్ను పంపిస్తారని అర్థం అంటాడు గుప్త.

రణవీర్‌పై మిస్సమ్మ డౌట్

మరోవైపు కూరగాయలు కట్‌ చేస్తున్న మిస్సమ్మ.. రణవీర్‌, మనోహరి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. శివరామ్ వచ్చి మిస్సమ్మ కొంచెం మంచినీళ్లు పట్టుకురా అంటాడు. మిస్సమ్మ ఉలకదు.. పలకదు.. అనుమానంగా దగ్గరకు వెల్లిన శివరామ్ ఏంటీ మిస్సమ్మ అలా ఉన్నావు అని అడుగుతాడు. మనోహరి, రణవీర్‌ గురించి మామయ్యా. నాకెందుకో వాళ్లిద్దరూ కలిసి ఏదో ప్లాన్‌ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అందుకే అంజును పంపాలంటే భయమేసింది అని చెప్తుంది.

ఇంతలో నిర్మల వచ్చి వాళ్లిద్దరు కలిసి ఏం ప్లాన్‌ చేస్తారు మిస్సమ్మ. వాళ్లిద్దరూ ముందు నుంచి తెలిసివాళ్లు కాదు కదా..? అయినా నీకెందుకు అలా అనిపించింది మిస్సమ్మ అని అడుగుతుంది. దీంతో మనోహరి, రణవీర్‌ సైగ చేసుకోవడం.. ఇద్దరూ ఒకర్ని ఒకరు ముందే కలిశామని చెప్పడం కంగారు పడటం లాంటివి చూస్తుంటే అనుమానం వచ్చింది అని చెప్తుంది మిస్సమ్మ.

దగ్గినందుకే ఆస్పత్రికి

మరోవైపు అంజును తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లిన రణవీర్‌ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని అంజు అడుగుతుంది. నువ్వు ఇంతకు ముందు ఐస్‌క్రీమ్‌ తిన్నప్పుడు దగ్గావు కదా అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్తాడు. అయ్యో అంకుల్‌ ఐస్‌క్రీమ్‌ తింటే ఎవరైనా దగ్గుతారు అంటుంది అంజు. అది కాదు అంజు నీకు జలుబు కానీ జ్వరం కానీ వస్తే మళ్లీ నన్ను తిడతారు. ఐస్‌క్రీమ్‌ తిన్నందుకు నిన్ను తిడతారు అంటాడు రణవీర్‌.

అయితే ఓకే అంటుంది అంజు. ఇంతలో మిస్సమ్మ, రణవీర్‌కు ఫోన్‌ చేసి ఎక్కడున్నారు అని అడుగుతుంది. మాల్‌‌లో ఉన్నామని అంజలి ఆడుకుంటుందని చెప్తుంటే రణవీర్‌ పక్కనుంచి ఒక వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతూ హాస్పిటల్‌ అడ్రస్‌ చెప్తాడు. మిస్సమ్మ అనుమానపడుతుంది. రణవీర్‌ కూడా మిస్సమ్మ విందేమోనని భయపడుతుంటాడు. ఫోన్‌‌లో ఉన్న హాస్పిటల్‌కు వెళ్లొస్తానని మిస్సమ్మ.. శివరామ్, నిర్మలకు చెప్పి అక్కడి నుంచి వస్తుంది.

మళ్లీ భూలోకానికి అరుంధతి

అప్పుడే హాస్పిటల్‌కు వెళ్తుంది మనోహరి. అంజుకు కనిపించకుండా రణవీర్‌తో మాట్లాడాలి అనుకుంటుంది. ఇంతలో అంజు వాటర్‌ తాగడానికి బయటకు వెళ్తుంది. ఇదంతా పైన యమలోకంలో ఉన్న అరుంధతి మాయాపేటికలో చూస్తూ.. కంగారుపడుతుంది. అంజలిని తీసుకెళ్లిపోతారు గుప్త గారు అంటూ బాధపడుతుంది. దీంతో బిడ్డ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడం ధర్మమే కదా బాలిక అంటాడు గుప్త.

దీంతో అరుంధతి ఎమోషనల్‌గా గుప్తను తిడుతుంది. నువ్వు మళ్లీ భూలోకం వెళ్లడానికి నీకు అన్ని అర్హతలు ఉన్నాయి అంటాడు గుప్త. అక్కడితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.