NNS January 29th Episode: య‌మ‌లోకంలో ఆరు పంచాయ‌తీ - ర‌ణ‌వీర్ క‌న్నింగ్ ప్లాన్ - అంజుకు ప్ర‌మాదం-nindu noorella saavasam january 29th episode ranveer visits amar house and plans to out anjali from home zee telugu seri ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns January 29th Episode: య‌మ‌లోకంలో ఆరు పంచాయ‌తీ - ర‌ణ‌వీర్ క‌న్నింగ్ ప్లాన్ - అంజుకు ప్ర‌మాదం

NNS January 29th Episode: య‌మ‌లోకంలో ఆరు పంచాయ‌తీ - ర‌ణ‌వీర్ క‌న్నింగ్ ప్లాన్ - అంజుకు ప్ర‌మాదం

Nelki Naresh Kumar HT Telugu
Jan 29, 2025 11:13 AM IST

NNS January 29th Episode: నిండు నూరేళ్ల సావాసం జ‌న‌వ‌రి 29 ఎపిసోడ్‌లో త‌న పిల్ల‌ల‌ను కాపాడుకోవ‌డానికి భూలోకానికి వెళ‌తాన‌ని ఆరు ప‌ట్టుప‌డుతుంది. య‌ముడు అంగీక‌రించ‌డు. త‌న పాపాల‌ చిట్టా లెక్క తేలాల్సిందేన‌ని ఆరు అంటుంది. త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌డానికి పంచాయ‌తీ పెట్టాల్సిందేన‌ని ర‌చ్చ చేస్తుంది.

నిండు నూరేళ్ల సావాసం జ‌న‌వ‌రి 29 ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం జ‌న‌వ‌రి 29 ఎపిసోడ్‌

యముడిని కలవాలనుకున్న ఆరు గంట కొడుతుంది. యముడు వచ్చి కోపంగా ఎందుకు పిలిచావు బాలిక అంటాడు. దాంతో ఆరు భయపడుతుంది. దగ్గరకు వెళ్లి మిమ్మల్ని డిస్టర్బ్‌ చేసినందుకు సారీ కానీ తప్పక అలా చేయాల్సి వచ్చింది. వెంటనే నేను కిందకు వెళ్లాలి అని చెప్తుంది. సూర్యాస్తమయం ముగిసిన పిమ్మట ఇచ్చట ఏ కార్యములు చేయమని.. అన్ని ద్వారములు మూసివేయబడతావని ఈ బాలికకు చెప్పలేదా..? అని అడుగుతాడు యముడు.

yearly horoscope entry point

మాట విన‌డం లేదు...

చెప్పాము ప్రభు.. కానీ మా మాట వినడం లేదు అంటాడు గుప్త. యముడు కోపంగా విచిత్ర గుప్త ఈ బాలికను ఆమె స్థావరం దగ్గర విడిచిపెట్టుము అంటాడు. సరేనని గుప్త తీసుకెళ్తాడు. ఆరు వెళ్లిపోయాక ఆ బాలికకు తన మరణం విషయంలో నిజం తెలిస్తే ముల్లోకాలు తిరిగైనా మనల్ని ఇబ్బంది పెడుతుంది అని చర్చించుకుంటారు యముడు, చిత్రగుప్తుడు.

అమ‌ర్ ఇంటికి ర‌ణ‌వీర్‌...

రణవీర్‌, అమర్‌ ఇంటికి వస్తాడు. రణవీర్‌ను చూసి అంజు పరుగెత్తుకెళ్తుంది. మిస్సమ్మ వచ్చి అంజు ఆపి ఎందుకు అలా పరుగెడుతున్నావు అని అడుగుతుంది. రణవీర్‌ అంకుల్‌ వచ్చాడు అందుకే వెళ్తున్నాను అని వెళ్లిపోతుంది అంజు. దీంతో మిస్సమ్మ.. నిన్న మనోహరి.. రణవీర్‌ వచ్చాడని చెప్పింది. ఎందుకు వచ్చాడని అడిగితే ఏం చెప్పకుండా కంగారు పడింది. ఇప్పుడు రణవీర్‌ వచ్చాడు అని మనసులో అనుకుంటుంది.

బ‌య‌ట‌ప‌డ్డ నిజం...

కిందకు వెళ్లి రణవీర్‌ను పలకరిస్తుంది. రణవీర్‌ మిస్సమ్మను పలకరిస్తాడు. అప్పుడే వచ్చిన మనోహరితో మాత్రం ర‌ణ‌వీర్ మాట్లాడ‌డు. దీంతో నిర్మల అదేంటి మనోహరిని పలకరించలేదు అని అడుగుతుంది. మనోహరిని ముందే కలిశానని చెప్తాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ముందే కలవడం ఏంటి..? అని నిర్మల అడుగుతుంది. నిజం బ‌య‌ట‌ప‌డ‌టంతో ర‌ణ‌వీర్ కంగారు ప‌డ‌తాడు. టాపిక్ డైవ‌ర్ట్ చేసి అంజలిని షాపింగ్‌ కు తీసుకెళ్తానని అడుగుతాడు.

కూతురు లేద‌న్న బాధ‌...

అంజలిని కలిశాకే నా కూతురు లేదన్న బాధ నాకు తగ్గింది. అందుకే ఒక్క రెండు గంటలు అంజలిని నాతో తీసుకెళ్తాను అంటాడు. ఆ విషయంలో అంత మొహమాటం ఎందుకు రెండు గంటలే కదా తీసుకెళ్లండి అంటుంది మనోహరి. దీంతో శివరాం కోపంగా నువ్వు తీసుకెళ్లండి అని ఎందుకు చెప్తున్నావు మనోహరి పిల్లల విషయంలో నిర్ణయం తీసుకోవాలంటే అది కేవలం మిస్సమ్మ, అమర్‌ కే హక్కు ఉంది అంటాడు. మనోహరి షాక్‌ అవుతుంది. మిస్సమ్మను రణవీర్‌ అడిగితే ఆయన లేకుండా బయటకు పంపించలేను అంటుంది మిస్సమ్మ.

ఆరు బాధ‌...

ఆరు బాధగా కూర్చుని బాధపడుతుంటే.. గుప్త వస్తాడు. నా పిల్లలు ప్రమాదంలో ఉన్నారు. నాకేమైనా సాయం చేయండి అని అడుగుతుంది. దీంతో యముడి దగ్గరకు వెళ్లి నీ పాప చిట్టాల లెక్క చూసి శిక్ష వేయండి అని అడుగు అప్పుడు ఏం జరుగునో నువ్వే చూస్తావు అంటాడు గుప్త. డౌటుగానే ఆరు వెళ్తుంది.

చిత్ర‌గుప్తుడి కంగారు...

అప్పుడే యముడు పాపులను శిక్షించడానికి కూర్చోగానే ఆరు వెళ్లి ముందు నన్ను శిక్షించండి.. నేను ఎక్కువ పాపాలు చేయలేదని మీరే చెప్పారు. కాబట్టి నా లెక్క తీయండి అని అడుగుతుంది. దీంతో అటుల తీయుటకు కుదరదు అంటాడు చిత్రగుప్తుడు. ఎందుకు ఇప్పుడే తీయండి.. సభలో ఉన్నవాళ్లందరూ చూస్తున్నారా..? నా లెక్క అడిగితే ఆయన ఎందుకో కంగారు పడుతున్నారు అంటూ అరుస్తుంది ఆరు. దీంతో యముడు కోపంగా ఆరును తిట్టగానే.. అయితే నాకు న్యాయం జరగాలంటే పంచాయతీ పెట్టాల్సిందే అంటూ వెళ్లి గంటను కొట్టి.. ముక్కోటి దేవతలారా అందరూ దిగి రండి.. అంటూ పిలుస్తుంది.

స‌భ వాయిదా...

చిత్రగుప్తుడు వెళ్లి ఆరును మందలించి యముడి దగ్గరకు తీసుకుని వస్తాడు. ఇంతలో యముడు సభను వాయిదా వేసి వెళ్లిపోతాడు. బయటకు వెళ్లిన రణవీర్‌, అమర్‌కు కాల్‌ చేసి అంజలిని బయటకు తీసుకెళ్లి తనకు ఏదైనా గిఫ్ట్‌ కొందామనుకుంటున్నాను.. నేను కాసేపు అంజలిని బయటకు తీసుకెళ్లవచ్చా అని అడుగుతాడు. సరే తీసుకెళ్లండి అని అమర్‌ చెప్పగానే… ఒక్కమాట మిస్సమ్మకు కూడా చెప్పండి అని ఫోన్‌ ఇస్తాడు.

అమ్ము అసైన్‌మెంట్‌...

అమర్‌ ఫోన్‌లో అంజును పంపమని చెప్పగానే.. మిస్సమ్మ అనుమానంగానే సరే అంటుంది. తర్వాత రణవీర్‌, అంజును తీసుకెళ్తుంటే.. మిస్సమ్మ.. అమ్మును పిలిచి అంజుకు తోడుగా వెళ్లమని చెప్తుంది. అంజు కోపంగా అమ్ము వస్తే.. నేను వెళ్లను అంటుంది. అమ్ము కూడా తనకు అసైన్‌మెంట్‌ ఉంది వెళ్లను అంటుంది. రణ్​వీర్​ అంజుని ఎందుకు తీసుకెళ్లాడు? రణ్​వీర్​పై మిస్సమ్మకు అనుమానం వచ్చిందా? అన్న‌ది తెలియాలంటే జనవరి​ 29 నాటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ చూడాల్సిందే!

Whats_app_banner