NNS January 25th Episode: రణ్‌వీర్‌కు కోర్టు నోటీసులు- అంజును తీసుకెళ్లేందుకు మనోహరితో ప్లాన్- కోయదొరగా చిత్రగుప్తుడు
Nindu Noorella Saavasam January 25th Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 25 ఎపిసోడ్‌లో రణవీర్‌కు వచ్చిన కోర్టు నోటీసులు చూస్తుంటాడు. కూతురుని ప్రవేశపెట్టనందుకు ఆస్తి అంతా ట్రస్ట్‌కు వెళ్లిపోతుందని లాయర్ చెబుతాడు. దాంతో ఫైర్ అయిన రణవీర్ అమర్ కూతురు అంజును తీసుకొచ్చెందుకు మనోహరికి కాల్ చేసి చెబుతాడు.
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్ (NNS 25th January Episode)లో మిస్సమ్మను బయటకు తీసుకొచ్చిన అమర్ బండి నడపడం నేర్పిస్తానంటాడు. దాంతో షాకైన మిస్సమ్మ ఏవండి మీరు చెప్పింది నాకు ఏమీ వినిపించలేదు మళ్లీ చెప్పండి అంటుంది. నీకు బుల్లెట్ నేర్పిద్దామని తీసుకొచ్చానని చెప్పాను కదా అంటాడు అమర్.
ప్లాష్ బ్యాక్ గుర్తుకు తెచ్చుకుని
ఆ విషయం నువ్వు ముందే చెప్పి తీసుకొస్తే బాగుండు కదా..? అని మిస్సమ్మ చెప్పగానే.. నీ బుర్రలో ఇన్ని దారుణమైన ఆలోచనలు ఉన్నాయని నాకెలా తెలుసు అంటాడు అమర్. వచ్చి బండి ఎక్కు.. ఒక్కనిమిషం నీ స్కూటీ లాగా మనుషుల మీదకు కాకుండా.. రోడ్ల మీద నడుపు అంటాడు అమర్. దీంతో ప్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటుంది మిస్సమ్మ. తర్వాత బండెక్కి స్టార్ట్ చేయడానికి మిస్సమ్మ ఇబ్బంది పడుతుంటే.. అమర్ స్టార్ట్ చేసి బండి వెనకే కూర్చుని నేర్పిస్తాడు.
మరోవైపు రణవీర్ కోర్టు నోటీసులు చూస్తూ కూర్చుని ఉంటే.. లాయర్ వచ్చి నువ్వు నీ కూతురుని కోర్టులో ప్రవేశపెట్టని కారణంగా నీ ఆస్తులన్నీ ట్రస్ట్ పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ చేయమని కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి అని చెప్తాడు. దీంతో రణవీర్ కోపంగా నోటీసులు చించి వేస్తూ.. ఎవరి ఆస్తి ఎవరికి పంచిపెడుతున్నారు. ఈ రణవీర్ అంటే ఎవరనుకున్నారు. ఆ ఆస్తి కోసం ఇన్నేళ్లు రోడ్లు పట్టుకుని తిరుగుతుంటే ఆస్తిని ఎవరి పేరునో ఎలా రాస్తారు అంటాడు.
కూతురు లేకుండా
దీంతో లాయర్ ఇది నా చేతుల్లో పని అయితే నేను కచ్చితంగా చేస్తానని నీకు తెలుసు. కానీ, నీ కూతురు లేకుండా ఏ లాయరు, ఏ చట్టం నీ ఆస్తి నీకు దక్కేలా చేయలేరు అని చెప్తూ.. అయినా నీ కూతురు మనోహరి దగ్గర లేదని అనాథ శరణాలయంలో వదిలేసింది అని తెలిసినా కూడా ఆ మనోహరిని ఎందుకు ఏమీ అనడం లేదు అంటాడు లాయర్.
నా ఆస్తి నా పేరు మీద మారేవరకు ఆ మనోహరి బతికే ఉండాలి లాయరు. ఎప్పుడైనా ఎక్కడైనా మనోహరి అవసరం ఉండొచ్చు.. అయినా ఇప్పుడు మనోహరి సమస్య కాదు. నా ఆస్తి అంటాడు రణవీర్. దీంతో నీ కూతురిని తీసుకొస్తే ఆస్థిలొ చిల్లిగవ్వ కూడా ఎవ్వరికీ దక్కకుండా చేస్తాను అని లాయర్ చెప్పగానే.. అయితే లాయరు.. నా కూతురు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు కదా..? అనగానే.. అదంతా సులువు కాదు ఆ అమ్మాయికి డీఎన్‌ఏ టెస్ట్ చేస్తారు. పోలీసులు, లాయర్లు ప్రశ్నిస్తారు. నీ కూతురుగా వచ్చే పాప చాలా స్టేబుల్‌గా ఉండాలి అని లాయరు చెబుతాడు.
అమరేంద్ర చిన్న కూతురు
రణవీర్‌కు అంజు గుర్తుకు వస్తుంది. లాయరు నా కూతురు వస్తుందని ఈ నోటీసుకు ఒక స్టే తీసుకో అని చెప్తాడు. ఎలా అని అడగ్గానే.. అమరేంద్ర చిన్నకూతురు అంజలి ఉంది కదా..? అంటాడు రణవీర్. అమరేంద్రను దాటి అమ్మాయిని ఎలా తీసుకొస్తావు అని లాయరు అడుగుతాడు. తీసుకొచ్చేది నేను కాదు మనోహరి అని రణవీర్ చెప్తాడు.
మరోవైపు మిస్సమ్మకు అమర్ బైక్ నేర్పిస్తుంటే.. మనోహరి వచ్చి చూస్తుంది. అమర్ ఎందుకు దీనికి ఇంత కనెక్ట్ అయ్యాడు అని బాధపడుతుంది. ఆ ముసలోడు ఏమైనా హామీ తీసుకున్నాడా..? అని తిట్టుకుంటుంది. దీని అక్కని అమర్‌కు దూరం చేయడానికి ఇన్నేళ్లు పట్టింది. ఈసారి అమర్ దీనికి దగ్గర అయ్యాడంటే ఇక నాకు ఎప్పటికీ దగ్గర కాలేడు. దాని ముఖంలో సంతోషం ఉండకూడదు. అని తిట్టుకుంటుంటే.. మనోహరికి రణవీర్ ఫోన్ చేస్తాడు.
అంజలి కావాలి
నా కూతురు కావాలని.. నా కూతురుని కోర్టులో ప్రోడ్యూస్ చేయకపోతే.. నా ఆస్తి నాకు ఎప్పటికీ రాదు అందుకే నాకు ఒక కూతురు కావాలి అని చెప్తాడు. అలాంటి అమ్మాయి ఇప్పటికి ఇప్పుడు ఎలా దొరుకుతుంది అని అడుగుతుంది మనోహరి. దీంతో దొరుకుతుంది అంజలి.. నా కూతురుగా నటించడానికి నాకు అంజలి కావాలి అని చెప్తున్నాను. నేను వెంటనే హైదరాబాద్ వస్తున్నాను. ప్లాన్‌తో ఆలోచించి రెడీగా ఉండు అంటూ ఫోన్ కట్ చేస్తాడు రణ్‌వీర్.
ఇంకోవైపు చిత్రగుప్తుడు కోయదొర వేషం వేసుకుని అమర్ వాళ్ల ఇంటికి వస్తాడు. గార్డెన్‌లో ఉన్న అరుంధతిని చూసి నవ్వుతూ వెళ్తాడు. శివరామ్ వచ్చి కోయదొరను వెళ్లగొడుతుంటే.. నిర్మల వచ్చి ఆయన్ని నేనే పిలిచానని మన పెద్దకోడలు ఇక్కడే ఉందని చెప్పారు కదా..? ఆయనతో మాట్లాడించవచ్చేమోనని పిలిపించాను అంటూ లోపలికి తీసుకెళ్తుంది నిర్మల.
షాక్‌లో అరుంధతి
మీ కష్టం ఏంటో చెప్పమని చిత్రగుప్తుడు అడగ్గానే.. నువ్వేం చెప్తావు అని అరుంధతి అడుగుతుంది. నేను చెప్పేది చెప్తాను అనగానే.. అరుంధతి షాక్ అవుతుంది. ఇంతలో నా కోడలు ఎక్కడుంది అని నిర్మల అడగ్గానే.. ఇదిగో ఈడనే ఉంది అని చెప్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. అక్కడితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ముగుస్తుంది.
టాపిక్