NNS January 24th Episode: మిస్సమ్మకు అమర్ సర్​ప్రైజ్​​- మనోహరి ఆరాలు- యముణ్ని విసిగించిన ఆరు- భూలోకానికి విచిత్రగుప్తుడు-nindu noorella saavasam january 24th today episode amar surprise to bhagi arundhathi irritate yama zee telugu nns serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns January 24th Episode: మిస్సమ్మకు అమర్ సర్​ప్రైజ్​​- మనోహరి ఆరాలు- యముణ్ని విసిగించిన ఆరు- భూలోకానికి విచిత్రగుప్తుడు

NNS January 24th Episode: మిస్సమ్మకు అమర్ సర్​ప్రైజ్​​- మనోహరి ఆరాలు- యముణ్ని విసిగించిన ఆరు- భూలోకానికి విచిత్రగుప్తుడు

Sanjiv Kumar HT Telugu

Nindu Noorella Saavasam January 24th Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 24 ఎపిసోడ్‌‌లో అమర్ వచ్చి మిస్సమ్మను రెడీ అవ్వమంటాడు. ఎఫ్ఎమ్‌కు ఎలా వెళ్లావో అలా రెడీ అవ్వమంటాడు. చుడీదార్‌లో వెళ్లేదాన్ని అని అనుకున్న మిస్సమ్మ సంతోషంగా ఫీల్ అవుతుంది. కానీ ఆ తర్వాత మిమ్మల్ని నమ్మి మోసపోయాను అంటుంది.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జనవరి 24 ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌ (NNS 24th January Episode)లో మిస్సమ్మను తీసుకుని బయటకు వెళ్తాడు అమర్​. అది చూసి మనోహరి షాక్‌ అవుతుంది. మిస్సమ్మను తీసుకుని అమర్​ బయటకు వెళ్లడం ఏంటని మనసులో అనుకుంటుంది. ఇంతలో అమర్‌, మిస్సమ్మను పిలుస్తాడు.

చుడీదార్ వేసుకునేదాన్ని

చెప్పండి అంటూ మిస్సమ్మ రాగానే ఇంట్లో పనులు పక్కన పెట్టేయ్‌ మనం బయటకు వెళ్తున్నాం అని చెప్తాడు అమర్‌. సరేనండి పదండి అంటుంది. ఇలా కాదని నువ్వు ఎఫ్‌ఎంకు వెళ్లేటప్పుడు ఎలా వెళ్లేదానివి అంటాడు అమర్​. నేను నా ఫ్రెండ్‌తో స్కూటీ మీద వెళ్లే దాన్ని అంటుంది భాగీ. ఎలా వెళ్లే దానివి అంటే నువ్వు ఎలాంటి డ్రెస్‌ వేసుకునే దానివో అలా అని నిర్మల చెప్పగానే.. చుడిదార్‌లో వెళ్లేదాన్ని అంటూ డ్రెస్‌ వేసుకుని వస్తానని పైకి వెళ్తుంది మిస్సమ్మ.

ఇంతకు ముందు అమర్‌ ఒక ఆపరేషన్‌ కోసం తీసుకెళ్లిన విషయం గుర్తు చేసుకున్న మిస్సమ్మ అమర్‌ దగ్గరకు వెళ్లి నేను రానండి అంటుంది. మిస్సమ్మ, అమర్‌ ఏం అడిగాడో నీకు అర్థం అయ్యే సమాధానం చెప్పావా..? అంటాడు శివరామ్​. ఆయన మాటలు అర్థం అయ్యాయి.. ఆయన మాటల్లోని పరమార్థం కూడా అర్థం అయింది అంటుంది మిస్సమ్మ. మిస్సమ్మ, అమర్‌ నిన్ను బయటకు తీసుకెళ్లడానికి బట్టలు మార్చుకోమంటున్నాడు అంటుంది నిర్మల.

మీకే అర్థం కాలేదత్తయ్య

అది నాకు అర్థం అయ్యింది అత్తయ్యా మీకే అర్థం కాలేదు అంటుంది మిస్సమ్మ. ఇంతకీ నీకేం అర్థం అయింది మిస్సమ్మ అంటూ శివరామ్ అడగ్గానే.. బయట ఇంకేదో షూట్‌ అవుట్‌ ప్లాన్‌ చేసి ఉంటారు. నాకు పరిగెత్తడానికి వీలుగా ఉండటానికి నన్ను డ్రెస్‌ మార్చుకోమంటున్నారు అని అప్పుడంటే నేనేదో మోసపోయా.. ఇంకోసారి అలా మోసపోను అంటుంది. ఏయ్‌ లూజ్‌ నేను తీసుకెళ్తుంది అందుకు కాదు అంటాడు అమర్‌.

నీ మీద నాకు నమ్మకం లేదు అంటుంది మిస్సమ్మ. నిర్మల, శివరామ్ ఇద్దరూ కలిసి వెళ్లమని చెప్తారు. అయినా వినదు మిస్సమ్మ.. అమర్‌ మాత్రం ఇంకో రెండు నిమిషాల్లో రెడీ అయ్యి రావాలని చెప్పి బయటకు వెళ్తాడు. మనోహరి, అమర్‌ వెనకాలే బయటకు వెళ్తుంది. బయటకు వెళ్లిన అమర్‌ ఎవరికో ఫోన్‌ చేస్తుంటాడు. మరోవైపు గార్డెన్‌లో ఉన్న అరుంధతి ఏమైంది ఈయనకు.. పొద్దున్నేమో పిల్లల చేత వర్కవుట్‌ చేయించారు. ఇప్పుడు మిస్సమ్మను చుడీదార్‌ వేసుకుని రమ్మంటున్నారు.. మిస్సమ్మేమో భయపడుతుంది అని ఆలోచిస్తుంది.

బైక్ మీద వెళ్తున్నామా

ఇంతలో మిస్సమ్మ వచ్చి నేను రెడీ అండి వెళ్దాం అంటుంది మిస్సమ్మ. అమర్‌ బైక్‌ దగ్గరకు వెళ్లగానే.. మనం ఇప్పుడు బైక్‌ మీద వెళ్తున్నామా..? అంటూ హ్యాపీగా ఫీలవుతుంది. వెంటనే.. వెళ్లేది షూట్‌ అవుట్‌‌కు అయినప్పుడు సంతోషం దేనికి అనుకుంటూ బాధతో నిలబడిపోతుంది. వెంటనే అమర్‌ బైక్‌ ఎక్కు అనగానే బాధగానే బైక్‌ ఎక్కుతుంది మిస్సమ్మ. అమర్‌ ఎమోషనల్‌‌గా ఫీలవుతూ అరుంధతిని గుర్తు చేసుకుంటాడు.

మిస్సమ్మ వెళ్దామా అండి అనగానే అమర్‌ బైక్‌ స్టార్ట్‌ చేసుకుని వెళ్లిపోతాడు. అమర్​, మిస్సమ్మ వెళ్లిపోయాక.. ఆరు, గుప్తను పిలుస్తుంది. గుప్త పలకపోవడంతో యముడిని పిలుస్తుంది. ఆరు పిలుపునకు యమలోకంలో ఉన్న యముడు ఇరిటేటింగ్‌‌గా ఫీలవుతూ గుప్తను తిడతాడు. దీంతో గుప్త మీరు కూడా ప్రయత్నించి విఫలం అయ్యారు కదా అంటాడు. దీంతో యముడు కోపంగా ఈ యమధర్మరాజుల వారికే ఎదురు చెప్తున్నావా..? నీవు చేసిన ఈ తప్పిదమునకు నిన్ను వెంటనే ఈ గుప్తుల బాధ్యత నుంచి తొలగించి నిన్ను ద్వార పాలకుడిగా నిమిస్తున్నాను అని తిడుతుండగానే.. చిత్రగుప్తుడు వస్తాడు.

భూలోకానికి విచిత్రగుప్తుడు

నా శిక్షణలో పెరిగిన ఈ చిత్రవిచిత్రగుప్తుడు ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. అతని తరపున నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను ప్రభు.. అంటాడు. నేను తక్షణమే భూలోకం వెళ్లి ఆ బాలికను తీసుకుని వచ్చెదను.. అంటాడు. దీంతో అయ్యా చిత్రగుప్తుల వారు తొందర పడి మాట ఇవ్వకండి అని హెచ్చరిస్తాడు గుప్త. ఇంతలో యముడు, చిత్రగుప్తుడిని భూలోకం వెళ్లమని చెప్తాడు.

మరోవైపు మిస్సమ్మను కొద్దిదూరం తీసుకెళ్లాక ఒక దగ్గర ఆపేస్తాడు. బైక్‌ దిగిన మిస్సమ్మ ఇక్కడేనా షూటౌట్‌ నాకు గన్‌ అంటే భయం లేదు.. కానీ అందులో ఉన్న బుల్లెట్‌ అంటేనే భయం అంటూ ఏడుస్తుంది. అక్కడితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ముగుస్తుంది.