NNS January 17th Episode: అరుంధతిని బంధించిన ఘోరా- అమర్​ చేతిలో ​​చావు దెబ్బలు- తెలిసిపోయిన ఆత్మ నిజం.. షాక్‌లో మిస్సమ్మ-nindu noorella saavasam january 17th today episode amar beats ghora for kidnap arundhathi soul zee telugu nns serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns January 17th Episode: అరుంధతిని బంధించిన ఘోరా- అమర్​ చేతిలో ​​చావు దెబ్బలు- తెలిసిపోయిన ఆత్మ నిజం.. షాక్‌లో మిస్సమ్మ

NNS January 17th Episode: అరుంధతిని బంధించిన ఘోరా- అమర్​ చేతిలో ​​చావు దెబ్బలు- తెలిసిపోయిన ఆత్మ నిజం.. షాక్‌లో మిస్సమ్మ

Sanjiv Kumar HT Telugu
Jan 17, 2025 06:00 AM IST

Nindu Noorella Saavasam January 17th Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 17 ఎపిసోడ్‌‌లో అంజులో అరుంధతి ఆత్మ ఉందని అమర్, రాథోడ్ అనుమానించి రామ్మూర్తి వెళ్లిన షాప్‌కు వెళ్తారు. కానీ, అదివరకే అంజును పాత బిల్డింగ్‌లో బంధిస్తాడు ఘోరా. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన అమర్ ఘోరాను చితకబాతాడు.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జనవరి 17 ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జనవరి 17 ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌ (NNS 17th January Episode)లో అంజు రామ్మూర్తితో కలిసి షాపింగ్​కి వెళ్లిందని తెలుసుకున్న అమర్​ ఆలోచనలో పడతాడు. అసలు అక్కడ ఉన్నది అంజు కాదేమోనని నా అనుమానం అంటాడు.

yearly horoscope entry point

శారీ కొనడం ఏంటీ

అలా అంటారేంటి సార్‌ అని రాథోడ్‌ అడగ్గానే.. ఉదయం మిస్సమ్మ ఒక మాట చెప్పింది అరుంధతికి మనుషుల్లో ప్రవేశించే శక్తి వచ్చిందేమో అని.. ఆ మాట ప్రకారం చూసుకుంటే ఆరు, అంజులో ప్రవేశించిందేమో అంటాడు అమర్‌. అలా ఎలా కుదరుతుంది సార్‌ అని రాథోడ్‌ అడగ్గానే.. అవును రాథోడ్‌ అంజలి.. రామ్మూర్తి గారి ఇంటికి వెళ్లడం ఏంటి..? ఇద్దరూ కలిసి శారీ కొనడం ఏంటి..? అంటాడు అమర్‌.

సార్‌ అయితే మనం ఇప్పుడు మేడంతో మాట్లాడొచ్చా సార్‌ అంటాడు రాథోడ్‌. ఏమో రాథోడ్ ఫాస్ట్‌‌గా అక్కడికి వెళ్లు మనం అంజులో అరుంధతి ఉందో లేదో తెలుసుకుందాం అంటాడు అమర్‌. ఇద్దరు అక్కడికి బయలుదేరుతారు. షాపులో చీర చూస్తున్న అరుంధతి ఈ శారీ నాకు ఎలా ఉంది అని అడుగుతుంది. మహాలక్ష్మీలా ఉన్నావు తల్లి అంటాడు రామ్మూర్తి. ఎంతైనా మీ కూతురిని కదా అంటుంది అంజు. ఆశ్చర్యంగా రామ్మూర్తి నా కూతురా..? అనగానే అదే మిస్సమ్మ మీకు కూతురు కదా..? నేను మిస్సమ్మకు కూతురుని కదా అందుకే అలా అన్నాను అంటుంది.

ఆఖరి ప్రయాణంలో

బయట ఘోర ముసుగు వేసుకుని అరుంధతి కోసం ఎదురుచూస్తుంటాడు. లోపల రామ్మూర్తి నీళ్లు తాగుతుంటే పొలమారుతుంది. అరుంధతి వెంటనే నెమ్మదిగా నాన్నా అంటుంది. ఆశ్చర్యంగా రామ్మూర్తి చూడగానే.. అదే తాతయ్యా అంటుంది. ఇంతకీ రేపు కాశీకి వస్తున్నారా..? తాతయ్య అనగానే.. రావాలి కదమ్మా.. పెళ్లి చేసి నా కూతురిని అత్తారింటికి పంపలేకపోయాను.. కనీసం నా బిడ్డ ఆఖరి ప్రయాణంలోనైనా ఒక తండ్రిగా తోడుగా ఉందామనుకుంటున్నాను అని రామ్మూర్తి చెబుతుంది.

దాంతో కన్నీళ్లతో తల రాతలు తుడిపేసే అవకాశమే ఉంటే ఈ లోకంలో అందరూ ఏడుస్తూనే ఉంటారు. జరిగిన దాన్ని దాటి ముందుకు అడుగువేయాలి. కానీ, అక్కడే ఉండకూడదు నాన్నా.. అంటూ అదే తాతయ్యా అంటుంది. అయినా చనిపోయింది మా అమ్మ కదా..? ఎవరైనా వింటే మీ కూతురు అనుకుంటారు అంటూ రామ్మూర్తి కన్నీళ్లు తుడుస్తుంది అంజు. తర్వాత బట్టలు తీసుకుని బయటకు వచ్చిన ఆరు ఆ పక్కనే కాచుకుని ఉన్న ఘోరను చూస్తుంది.

అమర్ ఎంక్వైరీ

భయంతో తాతయ్యా మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అంటూ రామ్మూర్తిని తీసుకుని వెళ్లిపోతుంది. ఇంతలో అమర్‌ షాపుకు వస్తాడు. రామ్మూర్తి , పాప గురించి ఎక్వైరీ చేస్తాడు. వాళ్లిద్దరూ పరిగెత్తడం చూశాను అని ఒక బాయ్‌ చెప్తాడు. అమర్ రామ్మూర్తికి ఫోన్‌ చేస్తాడు. కాల్‌ కనెక్ట్ అవ్వదు. అమర్‌ సీసీటీవీ ఫుటేజ్‌ చూస్తాడు. అంజు బిహేవిర్‌ చూసి రాథోడ్‌.. సార్‌ మేడమే అంటాడు. ఘోర అంజు వాళ్ల వెంట బడటం చూసి అక్కడి నుంచి వస్తారు.

ఘోరాను తప్పించుకుని రామ్మూర్తి, అంజు వెళ్తుంటారు. కొద్ది దూరం వెళ్లాక రామ్మూర్తి ఆయాసం వస్తుందని నేను పరుగెత్తలేనని చెప్తాడు. దీంతో అంజు ఇక నేను ఇంటికి వెళ్తాను తాతయ్యా అంటూ కొద్ది దూరం వెళ్లి మళ్లీ రిటర్న్‌ వచ్చి రామ్మూర్తిని హగ్‌ చేసుకుని ఘోరా నుంచి నేను తప్పించుకోకపోతే నేను మిమ్మల్ని చూడటం ఇదే ఆఖరి సారి అవుతుంది నాన్నా అంటూ ఏడుస్తూ వెళ్లిపోతుంది.

ఘోరాను కనిపెట్టిన అమర్

మిస్సమ్మ, అమర్‌కు ఫోన్‌ చేస్తుంది. ఘోర అంజలిని ఎత్తుకెళ్లడానికి షాపు దగ్గరకు వచ్చాడు. వాడి నుంచి తప్పించుకోవడానికి అంకుల్‌, అంజలి షాపు నుంచి పారపోయారు. నేను వాళ్లను వెతుక్కుంటు వెళ్తున్నాను అని చెప్తాడు అమర్. దాంతో మిస్సమ్మ షాక్ అవుతుంది. ఇంతలో రామ్మూర్తి అమర్‌కు ఫోన్‌ చేసి తాను ఎక్కడ ఉన్నది చెప్తాడు. ఇంట్లో విషయం తెలిసి పిల్లలు షాక్ అవుతారు.

అమర్‌, రాథోడ్‌ దగ్గరకు రాగానే.. అంజు ఇలా వెళ్లింది అని చెప్తాడు రామ్మూర్తి. అందరూ కలిసి అంజు వెళ్లిన వైపుకు వెళ్తారు. మరోవైపు ఓల్డ్‌ బిల్డింగ్‌లోకి వెళ్లిన అంజలిని బెదిరిస్తూ ఘోర నువ్వు ఇక తప్పించుకోలేవు అంటాడు. అంజుకు ఎదురుగా నిలబడి ఘోర మంత్రాలు చదువుతుంటాడు. ఇంతలో అమర్‌ వస్తాడు. ఘోరాను కొడతాడు. అక్కడితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner