NNS January 17th Episode: అర్ధరాత్రి తండ్రి దగ్గరికి పరుగెత్తుకెళ్లిన మిస్సమ్మ.. భాగీపై దొంగతనం మోపిన మనోహరి-nindu noorella saavasam january 17th episode manohari convinces amar parents for bhagamathi theft money ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns January 17th Episode: అర్ధరాత్రి తండ్రి దగ్గరికి పరుగెత్తుకెళ్లిన మిస్సమ్మ.. భాగీపై దొంగతనం మోపిన మనోహరి

NNS January 17th Episode: అర్ధరాత్రి తండ్రి దగ్గరికి పరుగెత్తుకెళ్లిన మిస్సమ్మ.. భాగీపై దొంగతనం మోపిన మనోహరి

Sanjiv Kumar HT Telugu
Jan 17, 2024 08:48 AM IST

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జనవరి 17వ తేది ఎపిసోడ్‌లో ఇంట్లో డబ్బులు దొంగతనం చేసిన దాన్ని భాగమతిపై మోపుతుంది మనోహరి. తనకు ఎలాంటి అవసరం ఉందో మనకు తెలియదు కదా అని అందరిని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జనవరి 17వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జనవరి 17వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam 17th January Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 17th January Episode) డబ్బుని దొంగలించి తన గదికి తీసుకొస్తుంది మనోహరి. మీరు నిజంగా గ్రేట్ అండి ఎంత సులువుగా దొంగతనం చేసేసారు. ముందు నుంచి మీకు అలవాటు ఉందా అని అడుగుతుంది నీల. ఆ మాటలకి నీలని కోపంగా చూస్తుంది మనోహరి. మాట దాట వేస్తూ ఇప్పుడు ఈ డబ్బుకి ఆ మిస్సమ్మకి ఎలా లింకు పెడతారు అని అడుగుతుంది నీల. చెప్పేస్తే మజా ఏముంది చూస్తూ ఉండు అంటుంది మనోహరి.

పీడకల కన్నావా?

తండ్రి చనిపోయాడని కలకంటుంది మిస్సమ్మ. కంగారుపడుతూ అర్ధరాత్రి తన ఇంటికి పరుగులు తీస్తుంది. తలుపు తీయమంటూ తలుపు కొడుతూ ఉంటే అర్ధరాత్రి ఎవరు వచ్చారు అనుకుంటూ మంగళ తలుపుతీస్తుంది. ఇంట్లోకి వచ్చిన మిస్సమ్మ తండ్రిని లేపి అతడిని పట్టుకొని ఏడుస్తుంది. ఏమైంది ఎందుకంత కంగారు, ఏమైనా పీడకలకన్నావా అంటుంది మంగళ. ఇంకేముంటుంది నేను దగ్గి, దగ్గి చనిపోయానని కలగని ఉంటుంది అంటాడు రామ్మూర్తి.

అలా అనొద్దు అంటూ అతని నోరుమూసి తండ్రిని హత్తుకొని ఏడుస్తుంది మిస్సమ్మ. పంతులు గారు చెప్పిన విషయం భాగీకి చెప్పు అని భర్తతో చెప్తుంది మంగళ. పంతులుగారు తనతో చెప్పినదంతా మిస్సమ్మకు చెప్తాడు రామ్మూర్తి. నీకు జబ్బు నయం అయ్యేవరకు నాకు పెళ్లి వద్దు అంటుంది మిస్సమ్మ. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. ఈ విషయంలో నేను నిర్ణయం తీసేసుకున్నాను అంటాడు రామ్మూర్తి. మరేమీ మాట్లాడలేక పోతుంది మిస్సమ్మ.

డబ్బులు కనిపించడం లేదు

బీరువాలో ఏదో పెట్టటానికి డోర్ ఓపెన్ చేస్తుంది అమర్ తల్లి. అక్కడ డబ్బు బ్యాగ్ లేకపోవడంతో భర్త దగ్గరికి వచ్చి బ్యాంకులో డబ్బు వేస్తానన్నారు కదా ఇంత పొద్దున్నే ఎందుకు డబ్బులు తీశారు అని అడుగుతుంది. నేను ఇప్పుడే లేచి పేపర్ చదువుతున్నాను. నువ్వు ఎప్పుడు టీ ఇస్తావా అని వెయిట్ చేస్తున్నాను. నేనెప్పుడు డబ్బులు తీసాను అంటాడు అమర్​ తండ్రి. అయితే డబ్బులు కనిపించడం లేదు అని కంగారుగా భర్తతో చెప్తుంది అమర్ తల్లి. అప్పుడే వచ్చిన రాథోడ్ కి అమర్ కి కూడా విషయం చెప్తుంది.

ఆ మాటలు విన్న మనోహరి మీకు నిన్న డబ్బులు ఎవరు ఇచ్చారు ఆంటీ అని అడుగుతుంది. మిస్సమ్మ అని చెప్తుంది అమర్​ తల్లి. ఇంకేముంది తనే తీసుకొని ఉంటుంది. కేర్ టేకర్ గా వచ్చి డబ్బులు తీసుకొని వెళ్లిపోయిన వారు చాలామంది ఉన్నారు అంటుంది మనోహరి. నిజం తెలుసుకోకుండా ఒక మనిషి గురించి అలా మాట్లాడొద్దు అంటూ మందలిస్తారు అమర్ తల్లిదండ్రులు. ఆమె అలాంటిది కాదు అని మిస్సమ్మని వెనకేసుకొస్తాడు రాథోడ్​.

ఎలాంటి అవసరం ఉందో

కాదు అని అంత కచ్చితంగా చెప్తున్నావు నువ్వు తీసావా అని అడుగుతుంది మనోహరి. ఏం మాట్లాడుతున్నారమ్మ.. నేను ఎందుకు తీస్తాను? నాకేం అవసరం అని అడుగుతాడు రాథోడ్​. ఈ మాటలు అన్ని వింటున్న అరుంధతి కూడా మిస్సమ్మని అలా అనొద్దు, మిస్సమ్మ అలాంటిది కాదు అని అంటుంది. కానీ, ఆమె మాటలు ఎవరికీ వినబడవు. నీకు, నాకు ఆ అవసరం లేదు మరి ఆ మిస్సమ్మకి ఎలాంటి అవసరం ఉందో ఎవరికి తెలుసు అంటుంది మనోహరి.

పొద్దున్న నుంచి మిస్సమ్మ ఇంట్లో కనిపించడం లేదు అంటుంది నీల. ఇంకేముంది తనే ఆ డబ్బు తీసుకుని వెళ్లిపోయి ఉంటుంది అంటుంది మనోహరి. ఆ మాటలకి కంగారుపడిన అరుంధతి మిస్సమ్మ అలాంటిది కాదు నేను ఇక్కడ ఎంత మాట్లాడినా లాభం లేదు గుప్తా గారి దగ్గరికి వెళ్తాను అని అక్కడ నుంచి వెళ్లిపోతుంది. నిజా నిజాలు తెలుసుకోకుండా ఒక మనిషి గురించి అలా మాట్లాడొద్దు అంటూ మిస్సమ్మ కి ఫోన్ చేయమని రాథోడ్ కి చెప్తాడు అమర్ తండ్రి.

నిర్దోషిగా నిరూపించుకుంటుందా?

రాథోడ్ మిస్సమ్మ కి ఫోన్ చేస్తే ఫోన్ సౌండ్ ఇంట్లోంచి వస్తుంది. మిస్సమ్మ ఫోన్ ఇంట్లోనే వదిలేసినట్లుంది అంటుంది నీల. చిత్రగుప్తుడు దగ్గరికి వచ్చిన అరుంధతి లోపల జరిగిందంతా చెప్తుంది. ఆ అమ్మాయి అలాంటిది కాదు కదా మరి ఆ డబ్బు తీయవలసిన అవసరం ఎవరికి వచ్చింది అని అంటాడు చిత్రగుప్తుడు. ఆలోచనలో పడుతుంది అరుంధతి. మిస్సమ్మ దొంగతనం చేయలేదని ఎలా నిరూపించుకుంటుంది? నిజం తెలిసిన అరుంధతి ఏం చేస్తుంది? అనే విషయాలు తెలియాలంటే జనవరి 18 ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner