NNS February 8th Episode: అమర్​కి మనోహరి గురించి నిజం చెప్పేసిన కాళీ- రణ్‌వీర్‌ను అడ్డుకున్న మిస్సమ్మ- బయటపడిన రహస్యం!-nindu noorella saavasam february 8th today episode khali tells manohari truth bhagi stops ranveer zee telugu nns serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns February 8th Episode: అమర్​కి మనోహరి గురించి నిజం చెప్పేసిన కాళీ- రణ్‌వీర్‌ను అడ్డుకున్న మిస్సమ్మ- బయటపడిన రహస్యం!

NNS February 8th Episode: అమర్​కి మనోహరి గురించి నిజం చెప్పేసిన కాళీ- రణ్‌వీర్‌ను అడ్డుకున్న మిస్సమ్మ- బయటపడిన రహస్యం!

Sanjiv Kumar HT Telugu
Published Feb 08, 2025 10:01 AM IST

Nindu Noorella Saavasam February 8th Episode: నిండు నూరేళ్ల సావాసం ఫిబ్రవరి 8 ఎపిసోడ్‌‌లో అమర్ ఇంటికి వచ్చిన కాళీ గొడవ చేస్తాడు. రాథోడ్‌ను కాళీ కొట్టబోతుంటే అమర్ వచ్చి అడ్డుకుంటాడు. అరుంధతిని చంపింది, భాగీని చంపాలని చూస్తుంది అంతా ఒక్కరే మనోహరి అని నిజం చెప్పేస్తాడు కాళీ. దాంతో అంతా నివ్వేరపోతారు.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 8 ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 8 ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌ (NNS 8th February Episode)లో కాళీ జైలు నుంచి అమర్‌ ఇంటికి వచ్చి గట్టిగా పిలుస్తుంటే రాథోడ్‌ అడ్డుపడతాడు. నువ్వు జరుగు అంటూ లోపలికి వెళ్తాడు కాళీ. మిస్సమ్మ వచ్చి అడ్డుపడుతుంది. అయినా వినకుండా కాళీ లోపలికి వెళ్లబోతుంటే.. శివరామ్, నిర్మల వస్తారు.

మీరు చంపొచ్చు ఇవాళ

ఏయ్‌ ఎందుకు వచ్చావు అని అడుగుతారు. నేను మీతో ఎవ్వరితో మాట్లాడను.. అమరేంద్ర గారితోనే మాట్లాడతాను అంటూ పిలుస్తుంటాడు. ఇంతలో రాథోడ్‌ కోపంగా కాళీ గల్లా పట్టుకుని బయటకు పోరా అంటాడు. కాళీ కోపంగా రాథోడ్‌ను కొట్టబోతుంటే.. అమర్‌ వచ్చి ఆపుతాడు. కాళీని కొడతాడు. కాళీ అమర్‌ చేయి పట్టుకుని నేను మీ ఎదురుగానే ఉన్నాను మీరు చంపొచ్చు అయినా ఇవాళ నేను నిజం చెప్పడానికి వచ్చాను అంటాడు.

నిజమా.. ఏంటి మామయ్యా ఆ నిజం అని అడుగుతుంది మిస్సమ్మ. కాళీ ఈ ఇంటి కోడలు ఈయన గారి మొదటి భార్య ఈ పిల్లల తల్లి ఏ పాపం ఎరుగని ఆవిడ చావు వెనకాల ఎవరున్నారో చెప్పడానికి వచ్చాను అంటాడు కాళీ. ఏంటీ మా కోడలిని ఎవరు చంపారో నీకు తెలుసా..? అని అడుగుతాడు శివరామ్​. కాళీ నాకే కాదు సార్‌.. మీకు కూడా తెలుసు.. కానీ మంచితనం అనే ముసుగులో వాళ్లు ఉండటం వల్ల మీకు తెలియడం లేదు. ఈయనను పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉందని ఆమెను చంపారు. అప్పటి నుంచి ఈ ఇంట్లో ఏ కష్టం వచ్చినా దాని వెనకాల ఉన్నది ఆమె అంటాడు కాళీ.

భాగీని కూడా చంపాలని

సరస్వతి వార్డెన్‌కు నిజం తెలుసని కూడా ఆవిడను నాతో చంపించాలనుకున్నారు. రెండో సారి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని చూస్తే.. మధ్యలో భాగీ వచ్చిందని భాగీని కూడా అప్పటి నుంచి చంపడానికి చూస్తున్నారు అని కాళీ చెప్పగానే అమర్‌ కోపంగా ఎవరు? అరుంధతిని చంపింది ఎవరు..? ఆ బాబ్జీ వెనక ఉండి ఎవరు చేశారు అని అడుగుతాడు. దాంతో ఆ మనోహరియే ఇదంతా చేసింది అని చెప్తాడు కాళీ. అమర్‌ కోపంగా మనోహరి అని గట్టిగా పిలుస్తాడు.

ఇదంతా కలగన్న మనోహరి ఉలిక్కిపడుతుంది. ఆ కాళీ గాడు అనుకున్నంత చేస్తాడు. రేపు వెళ్లి నేనే వాణ్ని కూల్‌ చేయాలి అనుకుంటుంది. మరోవైపు యమలోకంలో ఉన్న గుప్త.. కింద భూలోకంలో ఉన్న చిత్రగుప్తుడిని అరుంధతిని చూస్తూ నవ్వుకుంటాడు. మా చిత్రగుప్తుడి వర్తమానం నాకు కనిపిస్తుంది అని హ్యాపీగా ఫీలవుతుంటాడు. చిత్రగుప్తుడు పరుగెత్తుకుంటూ అరుంధతి దగ్గరకు వెళ్లి నాగమణి ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు.

చిత్రగుప్తుడి గోల

దీంతో ఆరు చిత్రగుప్తుడిని తిడుతూ.. అసలే అంజును ఆ మనోహరి, రణవీర్‌ కలిసి కోల్‌కతా తీసుకెళ్తున్నారు. వాళ్లిద్దరూ కలిసి అంజును ఏం చేస్తారో అని నేను టెన్షన్‌ పడుతుంటే.. మధ్యలో మీ గోల ఒకటి. నా పని పూర్తి అయ్యే వరకు ఒక మూలన కూర్చోండి.. లేదంటే యమపురికి వెళ్లిపోండి.. పని పూర్తి అయ్యాక పిలుస్తాను వచ్చి తీసుకెళ్లండి అంటుంది. దాంతో చిత్రగుప్తుడు బాధపడతాడు.

కోల్‌కతా వెళ్లడానికి అంజు రెడీ అవుతుంది. పిల్లలందరూ అంజును కిందకు తీసుకొస్తారు. బయట నుంచి గమనిస్తున్న అరుంధతి బాధపడుతుంది. అంజు చిన్న మనసుకు వాళ్ల స్వార్థం అర్థం కావడం లేదు. అనుకుంటుంది. అంజు బిల్డప్‌ చూసి రాథోడ్‌ వెటకారంగా మాట్లాడతాడు. అంజు పాప నువ్వు ఉండే రెండు రోజులకు ఇంత బిల్డప్‌ అవసరమా అంటాడు. నిర్మల కూడా ముందు నువ్వు ఆ కళ్లజోడు తీసేయ్‌ లేదంటే కనబడదు. ఎక్కడైనా కింద పడతావు అంటుంది.

పరిచయాన్ని బయటపెట్టిన రణ్‌వీర్

ఇంతలో అమర్‌, మిస్సమ్మ కిందకు వస్తారు. అమర్‌ బోర్డింగ్‌కు ఇంకా ఎంత టైం ఉంది అని అడుగుతాడు. గంటన్నర ఉందని చెప్తాడు. రాథోడ్‌ మిమ్మల్ని డ్రాప్‌ చేస్తాడని చెప్పగానే సరే అంటూనే.. మర్చిపోయి రణ్‌వీర్.. మనోహరి ఫ్లైట్‌కు టైం అవుతుంది త్వరగా రా అని పిలుస్తాడు. దాంతో అందరూ షాక్‌ అవుతారు. ఏమైంది అందరూ అలా చూస్తున్నారు అని రణ్‌వీర్‌ అడుగుతాడు.

దానికి మిస్సమ్మ.. రణ్‌వీర్‌ గారు మీరు అలవాటులో పొరపాటుగా అందరి ముందు మీ పరిచయాన్ని బయటపెట్టేశారు. అదే మనోహరి గారు మీకు బాగా తెలిసినట్టు.. పరిచయం ఉన్నట్టు అంత క్లోజ్‌గా పిలిచారు కదా.. అది అలవాటా..? పొరపాటా..? అని అడుగుతున్నాను అంటుంది. అదా కోల్‌కతాలో కొంచెం పరిచయం ఉన్నా క్లోజ్‌గా పిలుస్తాం.. అని రణ్‌వీర్‌ చెప్తాడు.

ఏమైనా ప్రాబ్లమా

మనోహరి వచ్చి ఏయ్‌ ఏం మాట్లాడుతున్నావు.. మాకు ఇంతకు ముందు పరిచయం ఉండటం ఏంటి..? అని తిడుతుంది. ఇంతలో రణ్‌వీర్‌.. మనోహరి గారు మీ లగేజీ ఎక్కడ ఫ్లైట్‌కు టైం అవుతుంది అండి అని అడుగుతాడు. మనోహరి .. నాకు ఇవాళ రావడం కుదరదు. మీరు అంజలి వెళ్లండి నేను రేపు పొద్దునే జాయిన్‌ అవుతాను అని చెప్తుంది. రణ్‌వీర్‌ ఏమైంది ఎందుకు రావడం లేదు.. అని అడుగుతాడు. మనోహరి.. రేపు పొద్దునే ఒక చిన్న పడింది. అది చూసుకుని వచ్చేస్తాను అని చెప్తుంది.

దీంతో రణ్‌వీర్‌.. మనోహరి గారు రేపు పొద్దున్నే అంజలిని మనం ఒక ఫేమస్‌ ప్లేస్‌కు తీసుకెళదాం అనుకున్నాం కదా మీరు రాకపోతే నేను ఎలా తీసుకెళ్లగలను చెప్పండి అంటాడు. పరిస్థితి అర్థం అయింది. కానీ నాది ఇంపార్టెంట్‌ పని అది అయ్యాక వస్తాను అంటుంది మనోహరి. ఇంతలో అమర్‌ ఎందుకు అంత భయపడుతున్నావు మనోహరి.. ఏదైనా ప్రాబ్లమా..? అని అడుగుతాడు. ఏం లేదు అమర్‌.. ఆశ్రమం పని పడింది. అది చూసుకుని వెళ్తాను అని చెప్తూ.. రణ్‌వీర్‌ గారు మీరు వెళ్లండి నేను రేపు వచ్చి కలుస్తాను అంటుంది.

నిర్మలకు అనుమానం

నిర్మల అనుమానంగా మనోహరి నువ్వు వెళ్లేది మీ ఫ్రెండ్ ఇంటికి కదా..? రణ్‌వీర్‌ దగ్గరకు వెళ్తాను అంటున్నావేంటి అని అనుమానంగా అడుగుతుంది. ఏం లేదు ఆంటీ.. అంజును తీసుకెళ్లాలి కదా అందుకే అలా చెప్పాను అంటుంది. రణ్‌వీర్‌ అంజును తీసుకుని వెళ్లబోతుంటే.. మిస్సమ్మ.. రణవీర్‌ గారు మీతో అంజును పంపించడం కుదరదు. ఒక ఆడపిల్ల తండ్రిగా మీరు కూడా ఆలోచించండి.. మమ్మల్ని ఇబ్బంది పెట్టి అంజును తీసుకెళ్లడం మీకు ఇష్టం ఉండదు అనుకుంటున్నా అని మిస్సమ్మ అంటుంది.

దాంతో అమర్‌ కూడా అంజును తర్వాత పంపిస్తాం లేదంటే.. హాలిడేస్‌లో మేమందరం కోల్‌కతా వస్తాము అని చెప్తాడు. రణ్‌వీర్‌ సరే అంటూ వెళ్లిపోతాడు. పిల్లలు అందరూ అంజును చూసి నవ్వుతుంటారు. అంజు సిగ్గుతో తల దించుకుంటుంది. అక్కడితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం