NNS February 6th Episode: ​అంజుని కోల్​కతా పంపేందుకు ఒప్పుకున్న అమర్- మనోహరికి ముగిసిన టైమ్- భర్తను తప్పుబట్టిన మిస్సమ్మ-nindu noorella saavasam february 6th today episode amar accept to send anju with ranveer manohari zee telugu nns serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns February 6th Episode: ​అంజుని కోల్​కతా పంపేందుకు ఒప్పుకున్న అమర్- మనోహరికి ముగిసిన టైమ్- భర్తను తప్పుబట్టిన మిస్సమ్మ

NNS February 6th Episode: ​అంజుని కోల్​కతా పంపేందుకు ఒప్పుకున్న అమర్- మనోహరికి ముగిసిన టైమ్- భర్తను తప్పుబట్టిన మిస్సమ్మ

Sanjiv Kumar HT Telugu
Published Feb 06, 2025 08:16 AM IST

Nindu Noorella Saavasam February 6th Episode: నిండు నూరేళ్ల సావాసం ఫిబ్రవరి 6 ఎపిసోడ్‌‌లో రణ్‌వీర్ కోల్‌కతా వెళ్లాలని చెబుతాడు. అప్పుడే మనోహరి కూడా కోల్‌కతా వెళ్తానంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. తర్వాత తనతోపాటు అంజును కోల్‌కతాకు తీసుకెళ్తానని రణ్‌వీర్ అడిగితే సరేనని అమర్ ఒప్పుకుంటాడు.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 6 ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫిబ్రవరి 6 ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌ (NNS 6th February Episode)లో కోల్​కత్తా వెళ్తున్నానని చెప్పిన రణ్​వీర్​ని ఏదో పని మీద వచ్చాను అన్నారు. వచ్చిన పని అయిందా..? అని అమర్‌ అడుగుతాడు. అవుతుందన్న నమ్మకంతోనే వెళ్తున్నాను అని చెప్తాడు రణ్‌వీర్.

కట్టకట్టుకుని వెళ్లిపోతానంటున్నారు

ఇంతలో మనోహరి వచ్చి నేను కూడా కోల్‌కతా వెళ్తున్నాను అని చెప్తుంది. నువ్వా నువ్వెందుకు అని అమర్‌ అడుగుతాడు. దీంతో నేను కూడా కొన్ని రోజులు కోల్‌కతాలో ఉన్నాను కదా..? ఫ్రెండ్స్‌ ఉన్నారు వాళ్లను కలిసి వస్తాను అని చెప్తుంది. మనోహరి మాటలకు మిస్సమ్మ షాక్‌ అవుతుంది. ఏంటి రాథోడ్‌ వీళ్లేదో పెద్ద ప్లాన్‌ వేయబోతున్నారని మనం భయపడుతుంటే.. ఇద్దరూ కట్ట కట్టుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోతాం అంటున్నారేంటి అంటుంది.

రాథోడ్‌ నవ్వుతూ మిస్సమ్మ శని సెండాఫ్‌ ఇచ్చి వెళ్లిపోతాను అంటుంటే.. కారణం మనకెందుకు వెళ్లిపోతున్నారు అది చాలు అంటాడు. మిస్సమ్మ కూడా అది కరెక్టే.. ఎలాగో మనోహరిని రణ్‌వీర్‌తో ఫ్లైట్‌ ఎక్కిద్దాం.. మళ్లీ తిరిగి రాకుండా చేద్దాం అంటుంది. ఇంతలో నిర్మల అది సరే కానీ అక్కడ ఎక్కడుంటావు మనోహరి అని అడుగుతుంది.

మీ టైమ్ అయిపోయింది

మిస్సమ్మ కల్పించుకుని అది మనోహరి గారు మేనేజ్‌ చేసుకుంటారులే.. మనోహరి గారు చిన్నపిల్లేం కాదు.. అక్కడ చాలా రోజులు ఉన్నాను అని చెప్తున్నారు కదా..? పైగా మన రణ్‌వీర్ గారు ఉన్నారు కదా.. సరే మరి బ్యాగ్‌ సర్దుకోండి మనోహరి గారు. మీ టైమ్ అయిపోయింది అనగానే.. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటుంది మనోహరి. అదే మీ ఫ్లైట్‌కు టైం అవుతుంది కదా అంటుంది మిస్సమ్మ. ఇంతలో రణ్‌వీర్ అంజును కూడా మాతో తీసుకెళ్దుమా..? అని అడుగుతాడు.

వెంటనే మిస్సమ్మ చేతిలో కాఫీ కప్పు కింద పడిపోతుంది. నిర్మల ఏమైంది మిస్సమ్మ.. ఓంట్లో బాగాలేదా..? అని అడగ్గానే.. ఏం లేదు అత్తయ్యా అంజలిని తీసుకెళ్తామని అనడంతో కప్పు కింద పడిపోయింది అని చెప్తుంది. వెంటనే రణ్‌వీర్, మనోహరి సెంటిమెంట్‌ డైలాగ్స్‌ చెప్తూ అమర్‌ను కన్విన్స్‌ చేయాలని చూస్తారు. అయితే అరుంధతి లేకుండా నేను ఎప్పుడూ పిల్లలను బయటకు పంపలేదు అని చెప్తాడు. శివరామ్ కూడా అవునమ్మా మనోహరి అంజు అల్లరిపిల్ల దాన్ని కంట్రోల్‌ చేయడం అంత ఈజీ కాదు అంటాడు.

వద్దన్న మిస్సమ్మ, నిర్మల

నిర్మల కూడా సెలవుల్లో పిల్లలను తీసుకుని అమర్‌ కూడా వస్తాడులే అంటుంది. ఇంతలో రణ్‌వీర్ ఈ నెలంతా మా ఇంట్లో దుర్గామాత పూజలు చేస్తాము. అంజు వస్తే బాగుంటుందని చెప్తాడు. దానికి కన్విన్స్‌ అయిన అమర్‌ సరే రణ్‌వీర్ అంజును తీసుకెళ్లు అని చెప్తాడు. శివరామ్ మాత్రం అంతదూరం అంజును ఒక్కదాన్నే పంపడం ఎందుకు అంటాడు. మిస్సమ్మ కూడా పిల్లలకు ఇప్పుడు స్కూల్‌ ఉంది అని చెప్తుంది. నిర్మల కూడా వద్దని చెప్తుంది.

కిటికీలోంచి చూస్తున్న అరుంధతి కూడా బాధపడుతుంది. ఇంతలో అమర్‌ అంజలిని పిలుద్దాం తను వెళ్తానంటే పంపిద్దాం లేదంటే వద్దు అని రాథోడ్‌ వెళ్లి అంజును తీసుకురా అని చెప్పగానే.. రాథోడ్‌ వెళ్లి అంజును తీసుకుని వస్తాడు. అంజు చెప్పండి డాడ్‌ అంటుంది. అంజు మనోహరి ఆంటీతో పాటు నువ్వు కూడా కోల్‌కతా వెళ్తావా..? అని అడుగుతాడు. మీరెవరూ రారా డాడ్‌ అని అడుగుతుంది అంజు. లేదు నాన్నా మనోహరి ఆంటీ ఉంటుంది. అని చెప్పగానే అంజు ఆలోచిస్తుంది.

నిజస్వరూపం నిరూపిస్తాను

ఇంతలో మనోహరి అంజు నేను అంకుల్‌ ఉన్నాం కదా..? నిన్ను బాగా చూసుకుంటాం అని చెప్తుంది. అంజు సరే డాడ్‌ వెళ్తాను అని చెప్తుంది. దీంతో రణ్‌వీర్, అమర్‌కు థాంక్స్‌ చెప్పి వెళ్లిపోతారు. అందరూ వెళ్లిపోయాక మిస్సమ్మ ఏవండి మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టు కాదనిపిస్తుంది అని భర్తను తప్పు బడుతుంది మిస్సమ్మ. దానికి అమర్‌ ఏమీ కాదని నువ్వేం టెన్షన్‌ పడకు అంటాడు. మీ నిజస్వరూపం ఆయనకు ఫ్రూవ్‌ చేయకపోతే నాపేరు భాగమతే కాదు అని మనసులో అనుకుంటుంది మిస్సమ్మ.

గార్డెన్‌లో ఆలోచిస్తున్న మిస్సమ్మ దగ్గరకు రాథోడ్‌ వస్తాడు. ఏం ఆలోచిస్తున్నావు మిస్సమ్మ అని అడుగుతాడు. దీంతో మిస్సమ్మ ఆల్రెడీ అంజలి దగ్గర ఉన్న చైన్‌ను అదే పనిగా మళ్లీ చేయించి అంజలికి గిఫ్టుగా ఎందుకు ఇచ్చారు. అసలు అంజలిని ఎందుకు కోల్‌కతా తీసుకెళ్లాలి అనుకున్నారు. అంజలి, చైన్‌, కోల్‌కతా ఏదో సంబంధం ఉంది రాథోడ్‌. వీళ్ల స్వార్థం వెనక, అంజలి కోల్‌కతా వెళ్లడం వెనక ఏదో ఉంది. అది మనం కనిపెట్టాలి అంటుంది.

మిస్సమ్మ అనుమానం

రాథోడ్‌ కంగారుపడుతూ.. ఇవన్నీ మనకెందుకు మిస్సమ్మ.. అంజు పాప కోల్‌కతా వెళ్లకుండా ఎలా ఆపగలం అది ఆలోచించు అంటాడు. అయితే నువ్వు వెళ్లి అంజు కోల్‌కతా వెళ్లడం ఇష్టం లేదని చెప్పు అని మిస్సమ్మ అనగానే.. నేనా అసలు సార్‌ కళ్లు ఎర్రజేయగానే నేను పరుగెత్తుకెళ్లాలి అంటుండగానే అమర్‌ పిలవగానే రాథోడ్‌ వెళ్లిపోతాడు. ఇంతలో అరుంధతి వచ్చి మిస్సమ్మను అంజును మనోహరి తీసుకెళ్తామంటే ఎందుకు వద్దనలేదు అని అడుగుతుంది.

ఈ విషయం మీకెలా తెలుసు ఇప్పుడే కదా మేము మాట్లాడింది అని మిస్సమ్మ అనుమానంగా అడుగుతుంది. దీంతో కంగారు పడ్డ అరుంధతి ఇంతకుముందు నీకోసం వస్తే అందరూ హాల్‌లో మాట్లాడుకుంటున్నారు. అప్పుడు విన్నాను అని చెప్తుంది. 

అంజు వెళ్లనంటే సరిగా

తర్వాత అంజును కోల్‌కతా వెళ్లకుండా చేయడానికి ఏం చేయాలని ఇద్దరూ ఆలోచిస్తారు. చివరికి అంజును వద్దని చెప్తే అయిపోతుంది ఎందుకంటే అంజు వెళ్లనని చెబితే అమర్‌ పంపించడు అని చెప్పి వెళ్లిపోతుంది అరుంధతి. అక్కడితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner