18 Pages OTT Release Date: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గతేడాది కార్తికేయ-2 చిత్రంతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అనంతరం అతడు నటించిన తాజా చిత్రం 18 పేజెస్. డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడమే కాకుండా మంచి వసూళ్లు కూడా వచ్చాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తాజాగా సదరు ఓటీటీ సంస్థ విడుదల తేదీని ప్రకటించింది.,జనవరి 27 నుంచి ఆహా వేదికగా నిఖిల్ నటించిన 18 పేజెస్ సినిమా అందుబాటులోకి రానుంది. థియేటర్లో ఈ సినిమా చూడటం మిస్ అయిన వాళ్లు ఫ్యామిలీతో కలిసి 18 పేజెస్ సినిమాను ఆహా వేదికగా వచ్చే వారం నుంచి ఈ సినిమాను చూసేయచ్చు. సంచలన దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు కథను అందించగా.. ఆయన శిష్యుడు సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు.,ఈ వినూత్న ప్రేమ కథ ప్రేక్షకులను అలరించింది. నిఖిల్, అనుపమ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. క్యూట్ లవ్‌స్టోరీకి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జత చేయడం ఆసక్తిని కలిగించింది. కుమారి 21 ఎఫ్ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమా తెరకెక్కించారు.,నిఖిల్ సరసన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. కార్తికేయ 2తో సక్సెస్‌ఫుల్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జోడీ 18 పేజీస్‌తో మరోసారి అలరించింది. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కించాయి. బన్ని వాసు నిర్మాతగా వ్యవహరించారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పించగా.. పల్నాటీ సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. పాన్ఇండియా దర్శకులు సుకుమార్ కథను అందించారు. డిసెంబరు 23న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.,