18 Pages Streaming On OTT: నిఖిల్ 18 పేజెస్ సినిమా శుక్రవారం ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఆహా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఆహాలో మాత్రం కేవలం తెలుగులోనే విడుదలచేశారు. ,ప్యూర్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించారు. కార్తికేయ -2 తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ఇది. 18 పేజెస్ సినిమాకు టాప్ డైరెక్టర్ సుకుమార్ కథతో పాటు స్క్రీన్‌ప్లే అందించారు. కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు. ,ఓ అమ్మాయిని నేరుగా కలవకుండా ఆమె రాసిన డైరీ ద్వారా తనతో ప్రేమలో పడే ఓ యువకుడి కథ ఇది. ఆ యువతి లక్ష్యాలను అతడు ఏ విధంగా నెరవేర్చాడన్నదే ఎమోషనల్‌గా దర్శకుడు ఈ సినిమాలో ఆవిష్కరించారు. ఇందులో సిద్ధు అనే యువకుడిగా నిఖిల్ కనిపించగా నందిని పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటించింది. ,డిసెంబర్ 23న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. పదిహేను కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈసినిమా 22 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. జీఏ2 పిక్చర్స్‌తో కలిసి దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను నిర్మించారు.