18 Pages OTT Release Date: నిఖిల్ 18 పేజెస్ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే
18 Pages OTT Release Date: నిఖిల్ హీరోగా నటించిన 18 పేజెస్ సినిమా త్వరలో ఓటీటీలో రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా ఏ రోజు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే...
18 Pages OTT Release Date: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 18 పేజెస్ ప్రాఫిటబుల్ సినిమాగా నిలిచింది. గత నెల 23న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. అగ్ర దర్శకుడు సుకుమార్ కథను అందించిన ఈ సినిమాకు సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు. థియేటర్లలో ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి రాబోతున్నది.
ట్రెండింగ్ వార్తలు
జనవరి 27న నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఒకే సారి రెండు ఓటీటీలలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది. నెట్‌ఫ్లిక్స్‌లో దక్షిణాది భాషలన్నింటిలో స్ట్రీమింగ్ కానుండగా ఆహాలో మాత్రం కేవలం తెలుగులో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు తెలిసింది.
ఓ అమ్మాయిని చూడకుండా ఆమె రాసిన డైరీ ద్వారా తనతో ప్రేమలో పడిన ఓ యువకుడి కథతో 18 పేజెస్ సినిమా తెరకెక్కింది. ఆ అమ్మాయి లక్ష్యాలను నెరవేర్చి ఆమె ప్రేమను ఎలా సొంతం చేసుకున్నాడన్నది ఎమోషనల్‌గా దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి ఈ సినిమాలో ఆవిష్కరించారు.
18 పేజెస్ సినిమాలో నిఖిల్, అనుపమ తమ కెమిస్ట్రీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. కార్తికేయ -2 తర్వాత వీరిద్దరు కలిసి నటించిన సినిమా ఇది. మరో వైపు కుమారి 21 ఎఫ్ అనంతరం లాంగ్ గ్యాప్ తర్వాత దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి తెరకెక్కించిన సినిమా ఇది.