Niharika Konidela: నిహారిక కొణిదెల త‌మిళ మూవీ టాక్ ఏంటంటే? - తొలిరోజు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఇవే!-niharika konidela tamil movie madraskaaran day 1 box office collections shane nigam movie disappoints at box office ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Niharika Konidela: నిహారిక కొణిదెల త‌మిళ మూవీ టాక్ ఏంటంటే? - తొలిరోజు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఇవే!

Niharika Konidela: నిహారిక కొణిదెల త‌మిళ మూవీ టాక్ ఏంటంటే? - తొలిరోజు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఇవే!

Nelki Naresh Kumar HT Telugu
Jan 11, 2025 12:16 PM IST

Niharika Konidela: రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్‌కు పోటీగా రిలీజైన నిహారిక కొణిదెల త‌మిళ మూవీ మ‌ద్రాస్‌కార‌ణ్ డిజాస్ట‌ర్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. శుక్ర‌వారం రిలీజైన ఈ మూవీ తొలిరోజు 25 ల‌క్ష‌ల లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం.

నిహారిక కొణిదెల
నిహారిక కొణిదెల

Niharika Konidela: రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్‌కు పోటీగా త‌మిళంలో మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల హీరోయిన్‌గా న‌టించిన మ‌ద్రాస్‌కార‌ణ్ మూవీ రిలీజైంది. బాక్సాఫీస్ బ‌రిలో ఒకే రోజు అన్నాచెల్లెళ్ల సినిమాలు పోటీ ప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే మెగ్ బ్ర‌ద‌ర్‌, సిస్ట‌ర్‌కు ఈ సంక్రాంతి అంత‌గా అచ్చిరాలేదు.

yearly horoscope entry point

రివేంజ్ డ్రామా....

గేమ్ ఛేంజ‌ర్‌తో పాటు నిహారిక న‌టించిన మ‌ద్రాస్‌కార‌ణ్ కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.షేన్ నిగ‌మ్‌, క‌లైయరాస‌న్ హీరోలుగా యాక్ష‌న్ రివేంజ్ డ్రామాగా తెర‌కెక్కిన మ‌ద్రాస్‌కార‌ణ్ మూవీ ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కార‌ణంగా మొద‌టిరోజే డిజాస్ట‌ర్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. ఫ‌స్ట్ డే ఈ మూవీ కేవ‌లం 25 ల‌క్ష‌ల లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

రామ్‌చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ త‌మిళ వెర్ష‌న్ శుక్ర‌వారం రోజు రెండు కోట్ల ప‌ది ల‌క్ష‌ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. గేమ్ ఛేంజ‌ర్‌కు మ‌ద్రాస్‌కార‌ణ్ ఏ మాత్రం పోటీ ఇవ్వ‌లేక‌పోయింది. పోటీగా గేమ్ ఛేంజ‌ర్‌తో అరుణ్ విజ‌య్ వ‌నంగాన్ సినిమాలు రిలీజ్ కావ‌డం కూడా మ‌ద్రాస్‌కార‌ణ్‌కు మైన‌స్‌గా మారింది.

గ్లామ‌ర్ పాత్ర‌లో...

ఈగో క్లాష్ కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు వాలి మోహ‌న్ దాస్ మ‌ద్రాస్‌కార‌ణ్ మూవీని రూపొందించాడు. ఈ సినిమాలో స‌త్య అనే క్యారెక్ట‌ర్‌లో షేన్ నిగ‌మ్ క‌నిపించ‌గా...అత‌డిని ప్రేమించి పెళ్లిచేసుకోవాల‌నుకున్న‌ మీరా అనే యువ‌తిగా నిహారిక కొణిదెల న‌టించింది. ఈ సినిమాలో నిహారిక కొణిదెల గ్లామ‌ర్ పాత్ర‌లో క‌నిపించింది. మూవీలో కాద‌ల్ స‌డుగుడు అనే పాట‌లో నిహారిక‌, షేన్ నిగ‌మ్ త‌మ‌ రొమాన్స్‌, కెమిస్ట్రీ ఆక‌ట్టుకున్నారు. ఈ రీమిక్స్ సాంగ్ మ‌ద్రాస్‌కార‌ణ్ మూవీకి స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది.

సెకండాఫ్‌లో మిస్‌...

మ‌ద్రాస్‌కార‌ణ్ మూవీ ఫ‌స్ట్ హాఫ్ చాలా వ‌ర‌కు షేన్ నిగ‌మ్‌, నిహారిక ల‌వ్ ట్రాక్‌తోనేసాగుతుంది. మెయిన్ స్టోరీ మొద‌లైన త‌ర్వాత నిహారిక క్యారెక్ట‌ర్‌ను పూర్తిగా సైడ్ చేసిన‌ట్లు స‌మాచారం. సెకండాఫ్ మొత్తంలో నిహారిక పాత్ర‌లో ఈ సినిమాలో క‌నిపించ‌ద‌ని అంటున్నారు.

మ‌ద్రాస్‌కార‌ణ్ క‌థ ఇదే...

మీరాతో స‌త్య పెళ్లి కుద‌రుతుంది. త‌ల్లిదండ్రుల కోరిక మేర‌కు సొంత ఊరిలో పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్న స‌త్య‌ బంధువుల‌తో క‌లిసి ఓ ప‌ల్లెటూరికి వ‌స్తాడు స‌త్య‌. పెళ్లి ప‌నుల్లో ఉండ‌గా...దురై సంగం అనే వ్య‌క్తితో మొద‌లైన గొడ‌వ ఊరి మొత్తాన్ని కుదిపేస్తుంది. ఊరంతా స‌త్య‌కు వ్య‌తిరేకంగా మారిపోతారు.

స‌త్య‌తో పాటు అత‌డి కుటుంబాన్ని చంపేందుకు దురైసింగం మ‌నుషులు ప్ర‌య‌త్నిస్తుంటారు. స‌త్య, దురై సింగం మ‌ధ్య గొడ‌వ‌కు కార‌ణ‌మేమిటి? దురై సింగం బారి నుంచి త‌న కుటుంబాన్ని స‌త్య ఎలా కాపాడుకున్నాడు? మీరాను పెళ్లి చేసుకున్నాడా? లేదా? అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందింది.

Whats_app_banner