Action OTT: ఓటీటీలోకి మెగా డాటర్ నిహారిక కొణిదెల తమిళ్ యాక్షన్ మూవీ - థియేటర్లలో రిలీజై నెల కాకముందే స్ట్రీమింగ్
Action OTT: మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ మద్రాస్‌కారణ్ థియేటర్లలో రిలీజైన నెలరోజుల్లోనే ఓటీటీలోకి వస్తోంది. ఫిబ్రవరి 7 నుంచి ఆహా తమిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీలో షేన్‌నిగమ్, కాలైయరాసన్ హీరోలుగా నటించారు.
Action OTT: నిహారిక కొణిదెల హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ మద్రాస్‌కారణ్ థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వస్తోంది. మద్రాస్‌కారణ్ మూవీలో షేన్ నిగమ్, కలైయరాసన్, ఐశ్వర్య దత్తా కీలక పాత్రలు పోషించారు. రివేంజ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించాడు.

ఆహా ఓటీటీలో...
మద్రాస్‌కారణ్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. ఫిబ్రవరి 7 నుంచి ఆహా తమిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. రిలీజ్ డేట్‌ను ఆహా ఓటీటీ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. ఓ యాక్షన్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది. థియేటర్లలో రిలీజైన నెలరోజుల్లోపే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుండటం గమనార్హం. పొంగల్ కానుకగా జనవరి 10న మద్రాస్‌కారణ్ థియేటర్లలో సందడి చేసింది.
మెగా బ్రదర్‌సిస్టర్ మూవీ...
రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్, నిహారిక కొణిదెల మద్రాస్‌కారణ్ ఒకే రోజు రిలీజయ్యాయి.మెగాబ్రదర్ సిస్టర్ బాక్సాఫీస్ పోరు ఆసక్తికరంగా మారింది. కానీ రెండు సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి.
గ్లామర్ రోల్‌లో...
మద్రాస్‌కారణ్ మూవీలో మీరా అనే యువతిగా గ్లామర్ రోల్‌లో నిహారిక కొణిదెల కనిపించింది.కాదల్ సడుగుడు అనే పాటలో నిహారిక, షేన్ నిగమ్ రొమాంటిక్ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ రీమిక్స్ సాంగ్‌లో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది.
మద్రాస్‌కారణ్ కథ ఇదే...
మీరా (నిహారిక కొణిదెల), సత్య (షేన్ నిగమ్) ప్రేమించుకుంటారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. తల్లిదండ్రుల కోరిక మేరకు సొంత ఊరిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్న సత్య బంధువులతో కలిసి ఓ పల్లెటూరికి వస్తాడు సత్య. పెళ్లి హడావిడిలో సత్య ఓ యాక్సిడెంట్ చేస్తాడు. ఈ ప్రమాదం కారణంగా దురై సింగం అనే లోకల్ లీడర్‌కు సత్య టార్గెట్‌గా మారుతాడు.
సత్యతో పాటు అతడి కుటుంబాన్ని చంపేందుకు దురైసింగం మనుషులు ప్రయత్నిస్తుంటారు. సత్య, దురై సింగం మధ్య గొడవకు కారణమేమిటి? దురై సింగం బారి నుంచి తన కుటుంబాన్ని సత్య ఎలా కాపాడుకున్నాడు? సత్య చేసిన యాక్సిడెంట్‌లో గాయపడిన ప్రెగ్నెంట్ లేడీకి దురై సింగానికి ఉన్న సంబంధం ఏమిటి? మీరాను పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
విజయ్ సేతుపతి మూవీలో...
కాన్సెప్ట్ ఔట్‌డేటెడ్ కావడం, స్క్రీన్‌ప్లేను కొత్తగా రాసుకోవడంలో దర్శకుడు తడబడటంతో మద్రాస్‌కారణ్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. నిహారిక హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ తమిళ్ మూవీ ఇదే. ఓవరాల్‌గా తమిళంలో ఇది రెండో సినిమా. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో 2018లో వచ్చిన ఒరు నల్ల నాల్ పాథు సొల్రెన్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది.