Niharika Konidela Saagu: నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతోన్న నిహారిక కొణిదెల ఇండిపెండెంట్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Niharika Konidela Saagu: నిహారిక కొణిదెల ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న ఇండిపెండెంట్ మూవీ సాగు డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతుంది. అమెజాన్ ప్రైమ్, సోనీతో పాటు పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మార్చి 4న నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
Niharika Konidela Saagu: మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న సాగు మూవీ థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ ఇండిపెండెంట్ మూవీలో వంశీ తుమ్మల, హారిక బల్ల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. వినయ్ రత్నం దర్శకుడు.
సాగు సినిమా కాన్సెప్ట్ నచ్చి నిహారిక కొణిదెల ఈ చిత్రానికి ప్రజెంట్‌గా వ్యవహరిస్తున్నారు. సాగు మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ, టాటా స్కై బింగ్, ఎయిర్ టెల్ ఎక్స్‌ట్రీమ్, ఎం.ఎక్స్ ప్లేయర్స్, హంగామా, జెసాన్, వ్యూయిడ్, యాక్ట్, నెట్ ప్లస్ బ్రాండ్, వి.ఐ, ఫైర్ టీవీ స్టిక్, ఎం.ఐ, ఎల్.జి, 1+ టవీ, క్లౌడ్ వాకర్, వాచో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మార్చి 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆశయలు...ఆశయాలు...
ప్రేమ....వివక్ష తో నిండిపోయిన సమాజాన్ని ఎదురిస్తుంది, ఓడిస్తుంది. సాగు... హరిబాబు మరియు సుబ్బలక్ష్మిల కథ . వాళ్ల ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆశలు, ఆశయాలు కోసం పోరాడి వాళ్లకున్న బీడు భూమికి ఎలా నీళ్లు తెచ్చుకున్నారు అన్నదే ఈ మూవీ క థ. . ప్రేమ ఎలాంటి క్లిష్టమైన సవాళ్లనైనా ఎదుర్కుంటుంది అన్నదానికి సాగు నిదర్శనంగా నిలుస్తుందని దర్శకుడు అన్నాడు.
నమ్మకం వదలకుండా...
సాగు గురించి నిహారిక మాట్లాడుతూ.. ‘సాగు మూవీ నాకు ఎంతో ప్రత్యేకమైనది. లైఫ్‌లో మనకు చాలా ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. కానీ నమ్మకం వదలకుండా ముందుకు వెళ్లాలని అనుకుంటాం. వ్యవసాయధారులకు ఎంతో హోప్ ఇచ్చేలా సాగు ఉంటుంది.
నా జీవితంలో నాకు ప్రతీ విషయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తోడున్నారు. 52 నిమిషాలున్న ఇండిపెండెంట్ ఫిల్మ్‌ని 4 రోజుల్లో షూట్ చేశారు. . ఇలాంటి యంగ్ టీంను సపోర్ట్ చేయడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. రైతుల కష్టాల్ని నేను ఎప్పుడూ దగ్గరుండి చూడలేదు. కానీ ఇలాంటి సినిమాను అందరికి ముందు తీసుకు రావడం ఆనందంగా ఉంది. మంచి సినిమాకు అండగా ఉండాలనే సాగు సినిమాకు నేను ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నాను" అని తెలిపింది.
ఆత్మహత్య పరిష్కారం కాదు...
సమస్య ఎలాంటిదైనా దానికి ఆత్మహత్య పరిష్కారం కాదనే సందేశంతో సాగు సినిమాను తెరకెక్కించామని దర్శకుడు చెప్పాడు. నిహారిక వల్లే మా సాగు సినిమా మంచి రీచ్ వచ్చిందని హీరో వంశీ తుమ్మల తెలిపాడు. సాగు సినిమాలో తన స్లాంగ్ డిఫరెంట్‌గా ఉంటుందని, ఇలాంటి చాలెంజింగ్ రోల్స్ అంటే చాలాఇష్టమని హీరోయిన్ హారిక చెప్పింది. గత సినిమాలకు మించి సాగు తనకు పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకముందని అన్నది.
నిహారిక రీఎంట్రీ....
సూర్యకాంతం సినిమా తర్వాత టాలీవుడ్‌కు దూరమైన నిహారిక కొణిదెల త్వరలో రీఎంట్రీ ఇవ్వబోతున్నది. వాట్ ది ఫిష్ పేరుతో తెలుగులో ఓ మూవీ చేస్తోంది. ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.
ఇందులో అష్టలక్ష్మి అనే అమ్మాయిగా యాక్షన్ ప్రధానంగా సాగే పాత్రలో నిహారిక కనిపించబోతున్నాడు. తెలుగుతో పాటు ఈ ఏడాది తమిళంలో కూడా ఓ మూవీకి నిహారిక గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మద్రాస్కరన్ పేరుతో ఓ మూవీ చేస్తోంది. ఆర్‌డీఎక్స్ ఫేమ్ షేన్ నిగమ్ హీరోగా నటిస్తున్నాడు. ఓ వైపు యాక్టర్‌గా సినిమాలపై ఫోకస్ పెడుతూనే పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్‌పై కన్ని వెబ్‌సిరీస్‌లను నిర్మిస్తోంది.